AP High Court reacts to Guntur diarrhea death: గుంటూరులో కలుషిత నీళ్లు తాగి ప్రజలు మరణిస్తుండటంపై హైకోర్టు స్పందించింది. వాస్తవాలు పరిశీలించి నివేదిక ఇవ్వాలని గుంటూరు జిల్లా న్యాయసేవాధికార సంస్థను ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి టి.లీలావతి జీజీహెచ్ (GGH) కు వెళ్లి పరిశీలించారు.
జీజీహెచ్‌ను పరిశీలించిన సివిల్ జడ్జి: సీనియర్ సివిల్ జడ్జి టి.లీలావతి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన బాధితులతో మాట్లాడారు. ఏ ప్రాంతంలో ఉంటారు, ఎప్పటి నుంచి అనారోగ్యం పాలయ్యారు, కారణాలేంటనే అంశాలపై వివరాలు సేకరించారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్‌తో జడ్జి లీలావతి సమావేశమై చర్చించారు. అనారోగ్య కారణాలు, బాధితుల పరిస్థితి, అందుతున్న చికిత్స వివరాలు తెలుసుకున్నారు. పాత పైపులైన్లు, లీకేజీలు, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల నీరు కలుషితమై ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. దీనిపై మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. మంత్రితో పాటు ప్రజాప్రతినిధులు, నగరపాలక సంస్థ అధికారులు ఈ విషయంలో సరైన కారణాలు వెల్లడించడం లేదు. నీటి నివేదిక వివరాలను బయటపెట్టడం లేదు. ఈ పరిస్థితుల్లో వాస్తవాల ఆధారంగా నివేదిక ఇవ్వాలని హైకోర్టు (High Court) ఆదేశించింది.
గుంటూరులో డయేరియా బాధితలకు న్యాయం చేయాలంటూ టీడీపీ నేతల ఆందోళన!
వారం వ్యవదిలో ఇద్దరు మృతి: కలుషిత నీరు తాగి వారం రోజుల వ్యవధిలోనే ఇద్దరు మృతి చెందారు. మరో 200 మంది ఆసుపత్రుల పాలయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారిలో రైలుపేటకు చెందిన ఇక్బాల్ శుక్రవారం మృతి చెందారు. ఈ నెల 10న పద్మ అనే గిరిజన యువతి మరణించింది. వారం వ్యవధిలోనే మృతుల సంఖ్య రెండుకు చేరడంతో నగర ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పెద్ద సంఖ్యలో నీటి, ఆహార నమూనాలు సేకరిస్తున్న అధికారులు కాలుష్యానికి కారణం ఏమిటో మాత్రం చెప్పడంలేదు. వైద్యమంత్రి విడదల రజిని ఆహార కల్తీ వల్లే ప్రజలు అస్వస్థతకు గురయ్యారని పద్మ మృతి అనంతరం అన్నారు. బాధితులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కాదు. సామూహిక భోజనాలూ చేయలేదు. ఆహార కల్తీ ఎలా కారణమవుతుందని విలేకరులు ప్రశ్నిస్తే, ఆమె సరైన సమాధానం ఇవ్వలేదు.
ప్రభుత్వ నిర్లక్ష్యానికి గుంటూరులో ఇద్దరు బలి - ఈ పాపం ఎవరిది?
విచారణకు ఆదేశించిన హైకోర్టు: వరుస మరణాల అంశంపై హైకోర్టు సీరియస్ అయింది. వరుస మరణాలపై మీడియాలో కథనాలు రావడంతో విచారణకు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకూ గుంటూరు జీజీహెచ్‌కు వచ్చిన న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి టి.లీలావతి ఆసుపత్రి ప్రాంతాన్ని పరిశీలించారు. ఆసుపత్రి పరిసరాలు శుభ్రంగా ఉన్నయిని వెల్లడించారు.
గుంటూరులో ప్రాణాలు తోడేస్తున్న కలుషిత జలం - మొక్కుబడిగా నీటి పరీక్షలు!