AP GOVT MEGA DSC NOTIFICATION 2024: ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 16 వేల 347 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించింది. దీనికి సంబంధించి నవంబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు చర్యలు చేపడుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాలు లేక కొన్ని లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. గతంలో 2014 నుంచి 2019 వరకు రెండు డీఎస్సీలను టీడీపీ ప్రభుత్వం నిర్వహించింది. డీఎస్సీ-2014లో 10 వేల 313 పోస్టులను భర్తీ చేసింది. 2019లో 7 వేల 902 పోస్టుల భర్తీకి ప్రకటన ఇచ్చి, ఎంపిక ప్రక్రియ సైతం చేపట్టారు. కోర్టు కేసుల కారణంగా నియామకాలు పెండింగ్‌లో పడ్డాయి. ఈ లోపు ఎన్నికలు వచ్చాయి. ఆ తర్వాత వాటి నియామకాలు పూర్తి చేశారు.
అప్పులు చేసి మరీ శిక్షణ కేంద్రాల్లో కోచింగ్ : 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత అప్పటి ప్రభుత్వం డీఎస్సీ నిర్వహిస్తుందని నిరుద్యోగులు ఆశపడ్డా జగన్ సర్కార్ కరుణించలేదు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కంటి తుడుపు చర్యగా కేవలం 6 వేల 100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపేలా, తాము అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ ప్రకటించడంతో పాటు మెగా డీఎస్సీకి మొదటి సంతకం పెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు హమీ ఇచ్చిన విషయం తెలిసిందే. బాధ్యతలు చేపట్టడంతోనే సీఎం మెగా డీఎస్సీకి మొదటి సంతకం చేశారు. డీఎస్సీ-2024లో 16 వేల 347 పోస్టులు భర్తీ చేయబోతున్నారు. నవంబర్లోనే నోటిఫికేషన్ విడుదలకు సిద్ధం అవుతుండటంతో డీఎస్సీ అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పోస్టుల వివరాలు ఇవీ: ఈ మెగా డీఎస్సీలో సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ) 6,371, స్కూల్ అసిస్టెంట్లు (ఎస్‌ఏ)- 7,725, భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. వీటితో పాటు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్(టీజీటీ)-1,781, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్స్(పీజీటీ)-286, వ్యాయామ ఉపాధ్యాయ(పీఈటీ)-132, ప్రిన్సిపాళ్లు 52 పోస్టుల భర్తీ చేయనుంది.
వాట్సాప్ గ్రూపుతో 35 మందికి గవర్నమెంట్ జాబ్స్ - టీచర్ ఐడియా అదుర్స్
మెగా డీఎస్సీకి ఫ్రీ కోచింగ్‌తో పాటు ఉచిత భోజన, వసతి సౌకర్యాలు - దరఖాస్తుకు చివరితేదీ ఎప్పుడంటే ?