ETV Bharat / state

ఐదేళ్లలో కాఫీ సాగు విస్తృతం- కార్యాచరణ సిద్ధం - Expand Coffee Cultivation - EXPAND COFFEE CULTIVATION

గిరిజన రైతులను ప్రోత్సహించి మరో 40 వేల ఎకరాల్లో సాగు చేసేలా చర్యలు

government_plans_to_expand_coffee_cultivation
government_plans_to_expand_coffee_cultivation (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 4, 2024, 10:52 AM IST

AP Government Plans to Expand Coffee Cultivation : ప్రస్తుతం పాడేరు ఐటీడీఏ పరిధిలో పాడేరు, అరకు వ్యాలీ, చింతపల్లి ప్రాంతాల్లో 2.58 లక్షల ఎకరాల్లో కాఫీ పంట సాగు చేస్తున్నారు. దీనికి అదనంగా గిరిజన రైతుల్ని ప్రోత్సహించి మరో 40 వేల ఎకరాల్లో పంటను విస్తరించేలా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. ఏడాదికి 8 వేల ఎకరాల చొప్పున విస్తరించేలా ప్రణాళిక రూపొందించింది. దీన్ని మూడు విధాలుగా అమలు చేయనుంది. సాధారణంగా కాఫీ పంట సాగుకు సూర్యరశ్మి నేరుగా తాకకుండా సరిపడా నీడ ఉండాలి. ఇలా ఇతర మొక్కలు పెంచుతూ ఇప్పటికే నీడ ఉన్న కర్షకుల పొలాల్లో నేరుగా కాఫీ మొక్కలు నాటే చర్యలు ప్రభుత్వ చేపట్టనుంది. నీడ లేని రైతుల పొలాల్లో సిల్వర్‌ ఓక్‌ మొక్కల పెంపకాన్ని చేపట్టి ఆ తర్వాత కాఫీ సాగు చేపడతారు. ఇప్పటికే కాఫీ సాగు చేస్తున్న పొలాల్లో పెరుగుదల లేని మొక్కలు తొలగించి వాటి స్థానంలో కొత్తవి నాటనున్నారు. మొత్తం దీనికి రూ.400 కోట్ల వ్యయం కానుంది.

‘ఉపాధిహామీ’ అనుసంధానంతో వరమే : గిరిజన రైతుల ఆదాయం పెంచేందుకు 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వం కాఫీ సాగును విస్తృతంగా ప్రోత్సహించింది. లక్ష ఎకరాల్లో సాగు విస్తరించేలా చర్యలు తీసుకుంది. అప్పట్లో కర్షకులకు సాగు ఆర్థిక భారం కాకుండా ఉపాధిహామీ పథకాన్ని అనుసంధానించి అమలు చేసింది. తర్వాత వైఎస్సార్​సీపీ ప్రభుత్వం దీన్ని పక్కన పెట్టింది. తాజాగా కూటమి ప్రభుత్వం రావడంతో కాఫీ సాగును ప్రోత్సహించేందుకు మళ్లీ ఉపాధిహామీ పథకాన్ని అనుసంధానించాలని నిర్ణయించింది.

దీనికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ అంగీకరించింది. దాంతో కాఫీ సాగుకు రైతులు ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండదు. మొక్కలను ఉచితంగా అందిస్తారు. నర్సరీ నుంచి రవాణా మొదలు, మొక్కలు నాటేందుకు లైన్‌ మార్కింగ్, గోతులు తవ్వడం, పాదులు తీయడం, కందకాలు ఏర్పాటు చేయడం, పొలం చుట్టూ ఫెన్సింగ్‌ ఇలా అన్నింటికీ ఉపాధి హామీ పథకంలో భాగంగా లేబర్‌ కాంపోనెంట్‌ కింద నిధులు మంజూరు చేస్తారు. దాంతో ఒక్కో రైతుపై రూ.40 వేల నుంచి రూ.70 వేలకు పెట్టుబడి వ్యయాన్ని ప్రభుత్వమే భరించనుంది.

పారిస్ ఒలింపిక్స్‌లో అరకు కాఫీ ఘుమఘుమలు -​​ అతిథులను అలరించనున్న మన్యం పంట - Araku Coffee Second Cafe in Paris

గరిష్ఠంగా 5 ఎకరాల వరకు : కాఫీ సాగు చేసేందుకు మొగ్గు చూపిన గిరిజన రైతులకు ఎకరాకు 1,000 మొక్కల్ని ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంది. ఒక్కో రైతు ఎకరం నుంచి గరిష్ఠంగా 5 ఎకరాలు సాగు చేసేందుకు సహకారం అందించనుంది. మొక్కలు నాటిన ఏడేళ్లకు కాఫీ ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఎకరాకు రూ.25 వేల వరకు ఆదాయం ఉండనుంది. దాదాపు 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వరకు స్థిరంగా ఉత్పత్తి రానుంది.

  • కాఫీ సాగులో అంతరపంటలూ సాగు చేయొచ్చు. ఇలా మిరియాల సాగును ప్రోత్సహించేందుకు ఎకరాకు 200 మొక్కల్ని ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. ఇది కూడా ఏడేళ్లకు ఉత్పత్తి ఇవ్వనుంది. ఆ తర్వాత ఎకరాకు రూ.30 వేల ఆదాయం ఉండనుంది.
  • కాఫీ పంట సాగుకు అనువుగా సరిపడా నీడ లేని రైతుల పొలాల్లో ముందుగా సిల్వర్‌ ఓక్‌ మొక్కల్ని నాటుతారు. వీటిని కూడా ఎకరాకు 1,000 మొక్కల చొప్పున ప్రభుత్వం రైతులకు అందిస్తుంది. ఇవి మూడేళ్ల కాలంలో ఐదు నుంచి ఆరు అడుగుల మేర పొడవుగా పెరుగుతాయి. ఆ తర్వాత వాటి నీడ మధ్యలో కాఫీ మొక్కల్ని నాటుతారు.
  • కాఫీ పంట సాగుకు ఏటా నవంబరు- డిసెంబరు నుంచి ముందస్తు చర్యలు ప్రారంభిస్తారు. జులై-ఆగస్టు నెలల్లో కాఫీ మొక్కల్ని నాటుతారు. ఆ మేరకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది.

అరకు కాఫీపై మోదీ మరోసారి ప్రశంసలు- మరోసారి కలిసి రుచి చూద్దామన్న చంద్రబాబు - PM Modi About Araku Coffee

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.