ETV Bharat / state

విలీనం పేరుతో తీవ్రంగా నష్టపోయిన ఆర్టీసీ ఉద్యోగులు - కూటమి ప్రభుత్వమే ఆదుకోవాలని వినతి - APSRTC Employees Allowances Issue - APSRTC EMPLOYEES ALLOWANCES ISSUE

YSRCP Govt Neglect APSRTC : ప్రభుత్వంలో విలీనం పేరిట వైఎస్సార్సీపీ సర్కార్ చేసిన మోసంతో వేలాదిమంది ఆర్టీసీ కార్మికులు తీవ్రంగా నష్టపోయారు. వేతనాలు పెరక్కపోగా తగ్గిపోయాయి. సదుపాయాలు రద్దై పోయాయి. అపరిమిత వైద్యం కాస్తా పరిమితమైంది. పోనీ అలవెన్సులైనా వస్తాయా అంటే ఆదీ లేదు. ఎన్నోఏళ్లుగా వస్తోన్న నైటౌట్ సహా పలు అలవెన్సులను గత ప్రభుత్వం నిర్ధాక్షిణ్యంగా తొలగించింది. గతంలో ఉన్న ఎన్నో ప్రయోజనాలకు పాతరేసింది.

YSRCP Govt Neglect APSRTC
YSRCP Govt Neglect APSRTC (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 2, 2024, 3:09 PM IST

APSRTC Employees Allowances Issue : ప్రభుత్వంలో విలీనంతో ప్రయోజనాల సంగతి దేవుడెరుగు ఉన్నవి కత్తిరించడంతో నాలుగేళ్లుగా ఆర్టీసీ ఉద్యోగులు తీవ్రంగా మథనపడిపోతున్నారు. అత్యవసర సేవల విభాగంలో ఉన్నందున ఒక్కోసారి ఆర్టీసీలోని డ్రైవర్లు, కండక్టర్లు రేయింబవళ్లు నిర్విరామంగా పనిచేయాల్సి ఉంటుంది. 8 నుంచి 16 గంటలపాటు అదనంగా విధులు నిర్వహిస్తూ ప్రయాణికుల్ని సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చుతారు.

ప్రయోజనాల్లో కోతపెట్టిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం : దీనికోసం ఆర్టీసీ ఉద్యోగులకు ప్రత్యేకంగా అలవెన్సులు, ప్రోత్సాహకాలను ఎన్నో ఏళ్లుగా అమలు చేస్తున్నారు. కార్పొరేషన్‌గా ఉన్నప్పటి నుంచి ఉన్న ఈ అలవెన్సులను విలీనం పేరు చెప్పి గత ప్రభుత్వం ఎత్తేసింది. 2020 జనవరి నుంచి ఆర్టీసీలోని 50,000 మంది ఉద్యోగుల్ని జగన్ సర్కార్, ప్రభుత్వంలో విలీనం చేసింది. వారందరికీ ఎన్నో ఏళ్లుగా వస్తోన్న ప్రయోజనాలను తొలగించింది.

దూర ప్రాంతాలకు బస్సులను నడిపే డ్రైవర్లు, కండక్టర్లకు నైటౌట్ అలవెన్సులను జగన్ ప్రభుత్వం రద్దు చేసింది. నాలుగేళ్లుగా అలవెన్సులు లేక ప్రయోజనాలు దక్కక ఆర్టీసీ ఉద్యోగులు అష్టకష్టాలు పడ్డారు. తమకు అలవెన్సులను పునరుద్దరించాలని ఉద్యోగ సంఘాలు ఎన్నో లేఖలు రాశారు. రోడ్డెక్కి ఆందోళనలు చేసినా పట్టించుకోలేదు. సంస్థ కోసం రేయింబవళ్లు పనిచేస్తున్న తమకు జగన్ సర్కార్ ఘోరంగా అన్యాయం చేసిందని కూటమి ప్రభుత్వమైనా న్యాయం చేయాలని సిబ్బంది కోరుతున్నారు.

"ఇవ్వాల్సిన నైటౌట్​లు, ఇక్రిమెంట్లు ఇవ్వాలి. రేయింబవళ్లు బస్సులు నడుపుతున్నాం. గత నాలుగు సంవత్సరాల నుంచి నైటౌట్ అలవెన్సులు ఇవ్వడం లేదు. చేతిలోని డబ్బులు ఖర్చు చేయాలని పరిస్థితి ఏర్పడింది. ఇందుకోసం అప్పులు చేయాల్సి వస్తోంది. వీటిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వమైనా మమల్ని ఆదుకోవాలని కోరుతున్నాం." - రామారావు, ఆర్టీసీ ఎన్‌ఎంయూ జోనల్ కార్యదర్శి, విజయావాడ

Jagan Government Neglect RTC : ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని సీఎం చంద్రబాబు సహా యువగళం పాదయాత్రలో లోకేశ్​ సైతం హామీ ఇచ్చారు. దీంతో అలవెన్సుల కోసం వారు ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇటీవల ముఖ్యమంత్రిని కలిసిన పలు ఉద్యోగ సంఘాల నేతలు, వైఎస్సార్సీపీ ప్రభుత్వం తమ పట్ల చేసిన ద్రోహాన్ని వివరించడం సహా ఆర్టీసీ ఉద్యోగులు కోల్పోయిన ప్రయోజనాలను ఇవ్వాలని చంద్రబాబును కోరారు. ఇందుకు చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. ఈ క్రమంలోనే నైటౌట్ అలవెన్సుల జారీకి చర్యలు తీసుకోవాలని సీఎం ఉన్నతాధికారుల్ని ఆదేశించారు. ఆతర్వాత వేగంగా కదిలిన ఫైల్​ అన్నివిభాగాల ఆమోదం పొంది ఆర్ధిక శాఖకు చేరుకుంది. ఆర్ధికశాఖ ఆ దస్త్రాన్ని ఆమోదిస్తే ఆర్టీసీ ఉద్యోగులకు నెల నెలా అలవెన్సులు జారీ ప్రారంభమవుతుంది. మరోవైపు వారికి గత సర్కార్ వేతన సవరణ బకాయిలనూ పెండింగ్‌లో పెట్టింది. పదవీ విరమణ చేసిన వారికి గ్రాట్యుటీ సహా పెండింగ్‌లో ఉన్న అలవెన్సులన్నింటినీ మంజూరు చేయాలని ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

జగన్​ హయాంలో కష్టాల ఊబిలో ఆర్టీసీ - కొత్త ప్రభుత్వం ఏం చేయనుంది! - YSRCP Govt Neglect RTC Buses

అవును అవి ఆర్టీసీ బస్సులే!- ప్రయాణమంటేనే భయపడుతున్న ప్రజలు - YSRCP Govt Neglect APSRTC

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.