Dussehra Holidays 2024: విద్యార్థులకు సెలవులు అంటే చాలా ఇష్టం. ఎప్పుడెప్పుడు స్కూల్‌కి హలీడేస్ వస్తాయా, ఎప్పుడెప్పుడు అమ్మమ్మ, నానమ్మ ఊరు వెళ్లి ఎంజాయ్ చేద్దామా అని ఆలోచిస్తుంటారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు దసరా సెలవులను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరి దసరా హలీడేస్ ఎప్పటి నుంచి ఎప్పటివరకు? మళ్లీ స్కూళ్లు ఎప్పుడు మొదలవుతాయో ఈ స్టోరీలో చూద్దాం.
వేసవి సెలవుల్లో క్రికెట్ సందడి - కళకళలాడుతున్న క్రీడా మైదానాలు - Summer Coaching Camp In Nellore
రాష్ట్రంలో విద్యాసంస్థలకు దసరా పండగ నేపథ్యంలో అక్టోబర్ 3 నుంచి 13 వరకు సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత అక్టోబర్ 4 నుంచి 13 వరకు సెలవులు ప్రకటించాలని ఉన్నత విద్యాధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలో ఉపాధ్యాయ సంఘాల నుంచి పెద్దఎత్తున అభ్యర్ధనలు వచ్చాయి. దీంతో సెలవులను అక్టోబర్ 3 నుంచి 13 వరకు మార్పు చేశారు. మళ్లీ అక్టోబర్ 14న స్కూళ్లు తిరిగి పునః ప్రారంభం కానున్నాయి. పాఠశాలకు సెలవులు ప్రకటిస్తూ విద్యా శాఖ డైరెక్టర్ విజయ్ రామరాజు ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రంలో ఎడతెరపిలేని వర్షాలు - ఈ జిల్లాల్లోని స్కూళ్లకు సెలవులు - SCHOOL HOLIDAYS DUE TO RAINS