ETV Bharat / state

ప్రతి పథకంపై ప్రజాభిప్రాయం తప్పనిసరన్న సీఎం- ప్రభుత్వంలో కీలకం కానున్న ఐవీఆర్ఎస్ - IVRS SURVEY IN AP

ఐవీఆర్‌ఎస్‌ విధానాన్ని విస్తృతంగా ఉపయోగించాలన్న సీఎం చంద్రబాబు

IVRS Survey in AP
IVRS Survey in AP (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 1, 2024, 2:29 PM IST

IVRS Survey in AP : ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, పౌరసేవలపై ప్రజల నుంచి నిరంతర ఫీడ్ బ్యాక్​ తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఇందులో భాగంగా మెరుగైన సేవల కోసం నేరుగా లబ్ధిదారుల నుంచి అభిప్రాయ సేకరణ జరపాలని అధికారుల్ని ఆదేశించారు. ఈ మేరకు ఐవీఆర్ఎస్ విధానాన్ని విస్తృతంగా ఉపయోగించాలని చెప్పారు. ఏ అంశంపైనైనా ప్రజలు చెప్పిందే ఫైనల్ అని స్పష్టం చేశారు. నాణ్యమైన సేవల కోసం ఖచ్చితమైన అభిప్రాయం చెప్పాలని ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు, చేపట్టే కార్యక్రమాలు, తీసుకునే నిర్ణయాలపై ప్రజాభిప్రాయ సేకరణ ప్రకారం ముందుకు వెళ్లాలని సర్కార్ నిర్ణయించింది. ప్రజలకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించేందుకు వారి అభిప్రాయాల మేరకు నడుచుకోనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇందుకనుగుణంగా ఇకపై ప్రభుత్వం అమలు చేసే పథకాలపై ఐవీఆర్ఎస్ ఫోన్లు చేయడం ద్వారా ఆయా కార్యక్రమాల అమలు తీరును తెలుసుకోనున్నారు.

లబ్ధిదారుల నుంచి అభిప్రాయాల సేకరణ : ఈ క్రమంలో లబ్ధిదారులకే నేరుగా కంప్యూటర్ బేస్డ్ ఫోన్ ​కాల్స్ ద్వారా ఆ పథకం వల్ల ప్రయోజనం, దాని అమలు, సేవల్లో నాణ్యత వంటి అంశాలపై ఫీడ్ బ్యాక్​ను ప్రభుత్వం సేకరించనుంది. వాటిపై ప్రజలు ఇచ్చే రేటింగ్ ఆధారంగా సర్కార్ మార్పులు చేర్పులు చేసుకొని పనిచేయనుంది. ఇంటింటికీ పింఛన్లు, దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ వంటి పథకాలకు సంబంధించి ఈ ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు. పింఛను సక్రమంగా ఇంటి వద్దనే అందుతుందా? లేదా? దీపం పథకం ఉచిత గ్యాస్ సిలిండర్ పొందడంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? వంటి ప్రశ్నల ద్వారా లబ్ధిదారుల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు.

పథకాలతో పాటు ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పాలసీల అమలుపైనా ప్రజాభిప్రాయాన్ని ఐవీఆర్ఎస్ ద్వారా సర్కార్ తెలుసుకోనుంది. ఉచిత ఇసుక విధానం అమలు, నూతన మద్యం పాలసీ, అమ్మకాలపైనా ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు. పథకాలు, కార్యక్రమాలతో పాటు రానున్న రోజుల్లో రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్ వంటి పలు కీలక శాఖల్లో ప్రజలు పొందుతున్న పౌరసేవలపై కూడా ఐవీఆర్ఎస్ ద్వారా సమాచారం సేకరించనున్నారు. ఈ సమాచారంలో ప్రజలు ఎక్కడైనా అసంతృప్తి వ్యక్తం చేస్తే వాటికి గల కారణాలు విశ్లేషించి సేవలను మరింత మెరుగుపరుస్తారు.

Chnadrababu on IVRS Survey : ఈ క్రమంలో ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల్లో కూడా బాధ్యత పెంచి మంచి సేవలు ప్రజలకు అందేలా చేయాలని సర్కార్ భావిస్తోంది. ప్రజలు చెప్పిందే ఫైనల్ అనే విషయం ప్రాతిపదికన పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఫోన్​కాల్స్​కి ప్రజలు ఓపిగ్గా తమ అభిప్రాయాలు చెప్పాలని కోరారు. ఈ ఫోన్ కాల్స్​కి ప్రజలు వెచ్చించే ఒకటి రెండు నిమిషాల సమయంతో సర్కార్ నుంచి ఉత్తమ సేవలు పొందే అవకాశం ఏర్పడుతుందని వివరించారు. దీనికి ప్రజలు తమ వంతుగా సహకరించాలని చెప్పారు. మంచి పాలనకు, నాణ్యమైన ప్రభుత్వ సేవలు అందించే కార్యక్రమంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని చంద్రబాబు ఆకాంక్షించారు.

ఐవీఆర్ఎస్ విధానం ద్వారా వచ్చే ఖచ్చితమైన అభిప్రాయాలను తెలుసుకోవడంపై గతంలోనూ తెలుగుదేశం ప్రభుత్వం ప్రయోగం చేసింది. అయితే ముఖ్యమంత్రి మెప్పు కోసం కొందరు అధికారులు ప్రజల వాస్తవ అభిప్రాయాలను తెలియనివ్వకుండా జాగ్రత్త పడ్డారు. అంతా బాగుంది అనే రీతిలో తప్పుడు సమాచారం ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలాంటివి పునరావృతం కాకుండా పటిష్ట వ్యవస్థ ద్వారా దీనిని జరిపితే మంచి ఫలితాలు వస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సార్వత్రిక ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థుల ఖరారు విషయంలో చంద్రబాబు ఇదే విధానాన్ని పాటించారు. విజయవాడ వరదల సమయంలో ప్రజలకు ప్రభుత్వం నుంచి అందే సాయంపైనా కాల్స్ ద్వారా సమాచారం తీసుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల్లో దీన్ని విరివిగా వాడేందుకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఖచ్చితమైన సమాచారం ఇచ్చే అధికారులనే ఈ టీమ్ లో నియమిస్తే ఫలితాలు బాగుంటాయన్నది విశ్లేషకుల మాట.

2047 నాటికి రాష్ట్రం నెంబర్‌వన్​గా ఎదగాలి - చదువుకున్న యువతే ఆస్తి: చంద్రబాబు

ఇసుకపై ఫిర్యాదులొస్తే సహించం - ప్రజల నుంచి సూచనలు స్వీకరణ: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.