AP Election Campaign : ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారాలు చేస్తున్నారు. అటు అధికార వైసీపీ, ఇటు కూటమి అభ్యర్థులు నియోజకవర్గాల్లో ఇంటింటికీ తిరిగి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. అధికార వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వలసలు ఊపందుకున్నాయి.
Anantapur District : కళ్యాణదుర్గం ఎన్డీఏ అభ్యర్థి సురేంద్రబాబు ఆధ్వర్యంలో దళితుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పులివెందుల నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. కర్నూలు తెలుగుదేశం అభ్యర్థి టీజీ భరత్ సైకిల్ తొక్కుకుంటూ ఇంటింటి ప్రచారం చేశారు. పాణ్యం అభ్యర్థి గౌరు చరిత గడివేములలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
Nellore District : నెల్లూరు జిల్లా ఉదయగిరి తెలుగుదేశం అభ్యర్థి కాకర్ల సురేష్ ముస్లింలతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. తర్వాత ఇంటింటికి తిరుగుతూ సూపర్ సిక్స్ పథకాలు వివరించారు. నెల్లూరులో మాజీమంత్రి నారాయణ, ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఆర్యవైశ్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. గుంటూరులో తెలుగుదేశం, జనసేన శ్రేణులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి గుంటూరు తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
తాగునీటి సమస్యపై మహిళల నిరసన సెగ- ఎట్టకేలకు బస్సు దిగొచ్చిన సీఎం జగన్ - Women Protest CM Jagan
Guntur District : గుంటూరు జిల్లా తెనాలి మండలం తేలప్రోలులో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ముస్లిం సోదరులకు రంజాన్ తోఫాను అందజేశారు. కృష్ణా జిల్లా చినముత్తేవి మొవ్వ మండలంలో తెలుగుదేశం అభ్యర్థి వర్లకుమార్ రాజా ఎన్నికల ప్రచారం చేశారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు ఆధ్వర్యంలో జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్‌కు టీడీపీ కార్యకర్తలు, నాయకులతో పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేశారు. విజయనగరం టీడీపీ అభ్యర్థి అదితి మహాలక్ష్మి గజపతిరాజు వైసీపీ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి పోటాపోటీగా ఎన్నికల ప్రచారం చేశారు.
'స్టీల్ ఫ్యాక్టరీ పరిరక్షిస్తాం- షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తాం' ఎన్నికల ప్రచారంలో కూటమి జోరు - Election Campaign In AP
Mangalagiri : వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వలసల వెల్లువ కొనసాగుతోంది. మంగళగిరి నియోజకవర్గానికి చెందిన సుమారు 130 కుటుంబాలు, కొందరు ముఖ్య నేతలు వైసీపీని వీడి నారా లోకేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశంలో చేరారు. విజయనగరం జిల్లా సంతకవిటి మండలానికి చెందిన వైసీపీ నాయకులతో పాటు సుమారు 400 కుటుంబాలు తెలుగుదేశంలోకి చేరాయి. మాజీమంత్రి కొండ్రు మురళి వీరిని పార్టీలోకి ఆహ్వానించారు.
Tirupati District : తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం అగరాల పంచాయతీకి చెందిన వంద కుంటుంబాలు ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ఆధ్వర్యంలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి వైసీపీ అసమ్మతి నాయకుడు కాకర్ల రంగానాథ్ తెలుగుదేశంలో చేరారు. అనుచరులతో కలిసి ర్యాలీగా జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటికి చేరుకుని పార్టీ కండువా కప్పుకున్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంలో కొందరు యువకులు తెలుగుదేశం, జనసేనలోకి చేరారు. కూటమి అభ్యర్థి సొంగా రోషన్‌కుమార్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.