CM Chandrababu inspected Bhogapuram Airport: కూటమిపై ఓట్ల వర్షం కురిపించిన ఉత్తరాంధ్ర ప్రజల రుణం తీర్చుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తనపై ఎంతో నమ్మకం పెట్టుకుని అండగా నిలిచి వారిని ఉత్తరాంధ్రను అభివృద్ధికి చిరునామాగా మార్చి ఇక్కడి ప్రజల రుణం తీర్చుకుంటామన్నారు. భోగాపురం విమానాశ్రయం పనులు పరిశీలించిన చంద్రబాబు ఉత్తరాంధ్రకు ఈ ఎయిర్‌పోర్టు చాలా కీలకంగా మారుతుందన్నారు. భవిష్యత్‌లో విశాఖ, శ్రీకాకుళం కూడా కలిసిపోతాయని స్పష్టం చేశారు.
రెండేళ్లలో భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తుందన్నారు. విశాఖ నుంచి భోగాపురం వరకు బీచ్ రోడ్డు కూడా నిర్మిస్తామన్న ఆయన, అటు శ్రీకాకుళం నుంచి భోగాపురం వరకు కూడా బీచ్‌రోడ్డు వస్తుందన్నారు. ఇప్పుడు ఉన్న జాతీయ రహదారికి, ఈ బీచ్‌రోడ్డుకు మధ్య ఉన్న ప్రాంతం మొత్తం ఇండస్ట్రీయల్ హబ్‌గా అభివృద్ధి చెందుతుందని ఉత్తరాంధ్ర రూపురేఖలే మారిపోతాయని సీఎం తెలిపారు. ఇది ఎన్నో ఏళ్లనాటి తనకలని చెప్పుకొచ్చారు.
విశాఖ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు భోగాపురం విమానాశ్రయ పనులను పరిశీలించారు. మొదట ఏరీయల్ వ్యూ ద్వారా పనులను పరిశీలించిన సీఎం, అనంతరం నిర్మాణ సంస్థలు జీఎమ్మార్, ఎల్అండ్టీ ప్రతినిధులు, అధికారులతో సీఎం సమీక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి విజయనగరం జిల్లాకు వచ్చిన చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం లభించింది. హెలిప్యాడ్ వద్ద మంత్రులు రామ్మోహన్ నాయుడు, సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు ఘనస్వాగతం పలికారు.
విశాఖకు మెట్రో: విమానాశ్రయ పనుల పరిశీలన అనంతరం సీఎం, పనుల పురోగతి, చేప్టటాల్సిన పనులు, సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై జీఎమ్మార్, ఎల్ అండ్ టీ సంస్థల ప్రతినిధులతో సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 2023 నాటికే భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి రావాల్సి ఉన్నా గత ప్రభుత్వ వైఖరి వల్ల సాధ్యపడలేదన్నారు. విశాఖకు మెట్రో కూడా వస్తుందని దీన్ని విమానాశ్రయానికి అనుసంధానం చేస్తామని చెప్పారు.
పట్టాలెక్కుతున్న పురోగతి- ఎన్డీయే ప్రభుత్వంతో రహదారులకు మోక్షం - Widening of National Highway 44
రాష్ట్రంలో మరో ఐదు విమానాశ్రయాలు : భోగాపురం ఎయిర్‌పోర్టుకు సమాంతరంగా మరో 5-6 ఎయిర్‌పోర్టులు వస్తాయని సీఎం తెలిపారు. భోగాపురం విమానాశ్రయంతోపాటు దొనకొండ, దగదర్తి, కుప్పం, నాగార్జునసాగర్ వద్ద విమానాశ్రయాలు నిర్మిస్తామన్నారు. కాకినాడ - అమలాపురం మధ్య మరో విమానాశ్రయం రానున్నట్లు తెలిపారు. ఒక్కో విమానాశ్రయం నిర్మాణానికి 800 నుంచి వెయ్యి ఎకరాల వరకు అవసరమవుతుందని అధికారులు తెలుపగా, వెంటనే ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. జాతీయ రహదారుల తరహాలో పీపీపీ మోడళ్లలో ఎయిర్‌పోర్టులు నిర్మించాలని ముఖ్యమంత్రి సూచించారు. వయోబిల్టి గ్యాప్ ఫండింగ్ ప్రభుత్వం ఇస్తుందని హామీ ఇచ్చారు.
2026 జూన్ నాటికి భోగాపురం పూర్తవుతుందని నిర్మాణ సంస్థల ప్రతినిధులు అంటున్నారని, తాను ఇంకా ముందే పూర్తి చేయమంటున్నానని సీఎం తెలిపారు. 2026 జూన్ 30న వచ్చి దీనిని ఆపరేషన్ చేయాలని, అందుకు పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. ఎన్డీఏ కూటమికి ఉత్తరాంధ్ర ప్రజలు బ్రహ్మరథం పట్టారని, అందుకే జిల్లాల పర్యటనలో మొదటగా ఉత్తరాంధ్రకే వచ్చానన్నారు.
"రైట్, రైట్" మహిళలకు ఉచిత బస్సుపై చంద్రబాబు కసరత్తు-అమలు ఎప్పట్నుంచంటే? - free bus for women