ETV Bharat / state

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - రాష్ట్రానికి వర్ష సూచన ! - Rains Alert in AP - RAINS ALERT IN AP

Another Low Pressure is Expected: ఇప్పటికే వర్షాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు అమరావతి వాతావరణ విభాగం​ మరో షాకింగ్​​ న్యూస్​ చెప్పింది. సెప్టెంబర్ 5వ తేదీ నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్లు వెల్లడించింది. రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Rains in Andhra Pradesh
Rains in Andhra Pradesh (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 3, 2024, 7:33 PM IST

Weather Report For Rains in Andhra Pradesh : రాష్ట్ర ప్రజలకు అమరావతి వాతావరణ విభాగం మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే వర్షాలు, వరదలతో సతమతమవుతున్న ప్రజలకు మరో అల్పపీడనం ఏర్పడనుండటంతో దిగులు చెందుతున్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సెప్టెంబర్ 5, 6 తేదీల్లో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ విభాగం వెల్లడించింది. కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకుని ఏర్పడనున్న అల్పపీడన ప్రభావంతో ఏపీలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాజస్థాన్​లోని జైసల్మెర్ నుంచి విదర్భ మీదుగా రామగుండం, కళింగపట్నం నుంచి తూర్పు మధ్య బంగాళాఖాతం వరకూ రుతుపవన ద్రోణి కొనసాగుతోంది.

రాష్ట్ర ప్రజలకు మరో షాక్ - సెప్టెంబర్ 5 నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం! - Another low pressure in ap

మధ్య విదర్భ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైన అల్పపీడనం ప్రస్తుతం బలహీనపడి పశ్చిమ విదర్భ పరిసర ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీనికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 3.1 కి.మీ ఎత్తు వరకు ఆవర్తించి ఉందని వివరించారు. కోస్తాంధ్ర, యానాం పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టం నుంచి 3.1 నుంచి 5.8 కి.మీ వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ విభాగం పేర్కొంది.

రాష్ట్రంలో మూడు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లాయి. కొన్ని చోట్ల జాతీయ రహదారులపై వరద కారణంగా రాకపోకలు నిలిపివేశారు. భారీ వర్షాల కారణంగా మున్నేరు, బుడ్డమేరు కట్టలకు గండి పడి ఉద్ధృతంగా ప్రవహించాయి. దాంతో విజయవాడ నరగంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రభుత్వం అన్ని విధిలా సహయక చర్యలు చేపట్టి వారికి ఆహారం, త్రాగునీరు వంటివి అందించింది.

రాష్ట్రంపై వాయుగుండం ప్రభావం - దక్షిణ కోస్తాలో రికార్డు స్థాయిలో వర్షాలు - AP Weather Updates 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.