ETV Bharat / state

'ఇబ్బందులకు గురి చేస్తున్నారు - కాపాడండి' - సౌదీలో ఏపీ మహిళ సెల్ఫీ వీడియో - Telugu Woman Facing Problems Saudi

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 6, 2024, 7:48 AM IST

Updated : Aug 6, 2024, 10:04 AM IST

Telugu Woman Facing Problems in Saudi : ఉపాధి కోసం ఏపీకి చెందిన ఓ మహిళ సౌదీకి వెళ్లింది. అక్కడ ఆమె తీవ్ర ఇబ్బందులు పడుతోంది. పని ఇచ్చిన యజమానులు సదరు మహిళను చిత్ర హింసలకు గురి చేస్తున్నారు. ఈ మేరకు బాధితురాలు తన బాధలను వివరిస్తూ పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్​గా మారింది. అయితే ఈ విషయం నారా లోకేశ్​ దృష్టికెళ్లగా స్వదేశానికి తీసుకొస్తామని ఎక్స్ వేదికగా ప్రకటించారు.

Telugu Woman Facing Problems in Saudi
Telugu Woman Facing Problems in Saudi (ETV Bharat)

Annamayya Woman Facing Difficulties in Dubai : పొట్టకూటి కోసం, ఉపాధి దొరికితే కుటుంబానికి అండగా ఉండొచ్చనే ఆశ వారిది. అందుకు పుట్టిన ప్రాంతాన్ని, అయిన వారిని దూరంగా ఉండటానికైనా మనసు చంపుకొని సిద్ధం అవుతారు వారంతా. స్వదేశంలో ఉపాధి కరవై అప్పులు చేసి ఎడారి దేశాల బాట పటడుతున్నారు. ఉద్యోగం పేరుతో వెళ్లిన మనవారి పాస్​పోర్టులను అక్కడి పని ఇచ్చిన యజమానులు లాగేసుకుంటున్నారు. ఆ తర్వాత వారు తమ అసలు రూపాన్ని బయటపెడుతున్నారు.

Annamayya Woman Tortured in Saudi : మనవారి అక్కడి కడుపు నిండా తిండి పెట్టకుండా, కంటినిండా నిద్రపోనివ్వకుండా చిత్ర హింసలు గురి చేస్తున్న ఘటనలు కోకొల్లలు. అక్కడ బాధితులకు నా అనే వారు లేకపోవడంతో యజమానులు వారికి నరకం చూపిస్తున్నారు. ఆ బాధలు భరించలేక సొంతురుకు వెళ్తామంటే గదిలో బంధించి చిత్రహింసలు గురి చేస్తున్నారు. దీంతో మనవారు కన్న బిడ్డలను, పుట్టిన ఊరును గుర్తుతెచ్చుకొని కుమిలిపోతున్నారు. ఆ బాధలను భరించలేక స్వదేశంలోని తమవారికి ఫోన్ చేసి తమను కాపాడాలని వేడుకుంటున్నారు.

తాజాగా ఏపీకి చెందిన ఓ మహిళ కూడా బిడ్డల భవిష్యత్ బాగుండాలని అనుకుంది. ఉద్యోగం చేస్తే నాలుగు రాళ్లు సంపాదించి కుటుంబానికి అండగా ఉండొచ్చని ఆశపడింది. అందుకోసం అందరినీ వదిలి పరాయి దేశానికి వెళ్లింది. కానీ అక్కడ ఆమె ఆశలు అడియాశలుగా మారాయి. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లి మండలానికి చెందిన హసీనా బీ, హసన్ వల్లి దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి అబ్దుల్లా, అబ్దుల్లా వాజీ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Annamayya Woman Viral Video : హసీనా బీ తమ సమీప బంధువుల సహకారంతో కొద్దిరోజుల క్రితం బతుకుదెరువు కోసం సౌదీకి వెళ్లింది. అక్కడ ఓ ఇంట్లో పనికి కుదిరింది. కొద్దికాలం సజావుగా సాగిన అనంతరం ఆ ఇంటి యజమానులు ఆమె ఇబ్బందులకు గురి చేయడం మొదలు పెట్టారు. దీంతో తన ఆవేదనను వీడియో రూపంలో పోస్ట్ చేసింది. ఇప్పుడు అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్​గా మారింది

అక్కడ ఓ ఇంట్లో పని చేస్తున్నానని హసీనా బీ వీడియోలో తెలిపింది. పనిభారం పెరిగి, తిండి సరిగా లేక అనారోగ్యానికి గురయ్యానంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తన పరిస్థితి బాగాలేకపోయినా పని చేయమని ఒత్తిడి తెస్తున్నారని కన్నీరు పెట్టుకుంది. కడుపు నిండా తిండి లేదని, కంటినిండా కునుకు లేదని వాపోయింది. ఇదేంటని ప్రశ్నిస్తే చిత్ర హింసలకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఏం చేయాలో తెలియడం లేదని కుమిలి కుమిలి ఏడ్చింది.

Lokesh on Annamayya Woman Problem : ప్రభుత్వం, అధికారులు స్పందించి తనను స్వదేశానికి రప్పించే ఏర్పాటు చేయాలని హసీనా బీ కోరింది. ఈ మేరకు సెల్ఫీ వీడియో తీసుకుని కుటంబ సభ్యులు, బంధువులకు పంపించింది. హసీనా బీ పరిస్థితిని ఆమె భర్త భర్త హసన్ వల్లి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని తన భార్యను క్షేమంగా స్వగ్రామానికి తీసుకురావాలని ఆయన వేడుకుంటున్నాడు. ఈ విషయాన్ని ఓ నెటిజన్ ఎక్స్ వేదికగా​ మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన హసీనా బీని స్వదేశానికి తీసుకొస్తామని చెప్పారు. ఈ మేరకు మంత్రి ఎక్స్​లో ప్రకటించారు.

రాష్ట్రానికి రాలేననుకున్నా- లోకేశ్ సాయంతో ప్రాణాలతో తిరిగొచ్చా: గల్ఫ్ బాధితుడు వీరేంద్ర - Lokesh saved Virendra Kumar

మరోసారి మంచిమనసు చాటుకున్న మంత్రి లోకేశ్‌ - ఓమన్‌లో చిక్కుకున్న మహిళకు భరోసా

Last Updated : Aug 6, 2024, 10:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.