Andhra Pradesh Elections 2024 Polling: నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం ప్యాపిలిలో ఎస్సై జగదీశ్వర్ రెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్యాపిలి పోలింగ్ కేంద్రం వద్ద మార్కెట్ యార్డ్ ఛైర్మన్ నారాయణమూర్తిపై ఎస్సై చేయి చేసుకున్నారు. దీంతో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల జోక్యంతో వివాదం కొద్దిసేపటికి సద్దుమణిగింది. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ మార్కెట్ యార్డ్ ఛైర్మన్‌ను పరామర్శించి ఎస్సై తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనవసరంగా తమ వారిపై చేయి చేసుకుంటే సహించనని సుజాతమ్మ హెచ్చరించారు.
స్వతంత్ర అభ్యర్థిపై వైఎస్సార్సీపీ దాడి: నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలోని బేతంచెర్ల పట్టణంలో స్వతంత్ర అభ్యర్థి పీఎన్ బాబుపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఇనుప రాడ్లతో కారు అద్దాలు ధ్వంసం చేశారు. బుగ్గన కారు వెనక వెళ్తున్న పీఎన్ బాబు కారు అద్దాలు ధ్వంసం చేశారు. మావెంట రావద్దంటూ పరుష పదజాలంతో హెచ్చరించారు. మంత్రి బుగ్గన ఇంటి మార్గంలో వెళుతుండగా, ఈ మార్గంలో ఎలా వస్తావంటూ స్వయంగా మంత్రి బుగ్గనే కులం పేరుతో దూషించారని బాబు ఆరోపించారు. ఈ మేరకు బేతంచర్ల పోలీస్ స్టేషన్లో పీఎన్ బాబు ఫిర్యాదు చేశారు. డోన్ నియోజకవర్గంలో ఎన్నికలు ఏకపక్షంగా జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.
ఓటరును కొట్టిన ఎమ్మెల్యే - ఎమ్మెల్యేను తిరిగి కొట్టిన ఓటర్ - MLA Beat Voter
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిపై కేసు నమోదు: కర్నూలు జిల్లా ఆదోని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సాయి ప్రసాద్ రెడ్డిపై కేసు నమోదైంది. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఓటర్ స్లిప్‌లపై తన ఫోటో ఉన్న స్లిప్‌ను పంపిణీ చేశారు. ఫోటోతో ముద్రణ వలన ఓటర్లు ప్రభావితం ఆవకాశం ఉంది. ఓట్ స్లిప్‌లు సామాజిక మధ్యమంలో వైరల్‌గా మారాయి. పురపాలక కమిషనర్ రామ చంద్రారెడ్డి ఫిర్యాదుతో పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామని సీఐ గోపి తెలిపారు.
ఉమ్మడి కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి మండలం మల్లేపల్లిలో టీడీపీ కార్యకర్తపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడి చేశారు. శ్రీశైలం నియోజకవర్గం బండి ఆత్మకూరు మండలం జి.లింగాపురంలో టీడీపీ - వైసీపీ ఏజెంట్ల మధ్య ఘర్షణ జరిగింది. ఆదోనిలో ఓటరు స్లిప్‌లపై తన పొటో ముద్రించి పంపిణీ చేస్తున్నారని, వైసీపీ అభ్యర్థి సాయి ప్రసాద్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.
శ్రీశైలం నియోజకవర్గంలో ఘర్షణ: నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో ఏజెంట్ల మధ్య ఘర్షణ తలెత్తింది. బండి ఆత్మకూరు మండలం జి. లింగాపురంలో టీడీపీ, వైఎస్సార్సీపీ ఏజెంట్ల మధ్య ఘర్షణ జరిగింది. అదే విధంగా బనగానపల్లి నియోజకవర్గం అవుకు మండలం రామవరంలో టీడీపీ- వైసీపీ ఏజెంట్ల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు ఇరువురిని బయటకు పంపించారు.
వైఎస్సార్సీపీ నేతల బెదిరింపులు - భయాందోళనలో ఓటర్లు - clashes in ap elections