General Election Results in Visakha District : సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌లో తెలుగుదేశం పార్టీ నేతలు రెట్టింపు మెజార్టీతో గెలుపొందారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని 15 స్థానాల్లో ఓట్ల లెక్కింపు జరిగింది. కూటమి నేతలను గెలుపు వరించింది. గాజువాక టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్‌నాథ్‌పై విజయం సాధించారు.
భీమిలిలో వైసీపీ అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావుపై టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు గెలిచారు. విశాఖ తూర్పు టీడీపీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణపై విజయం సాధించారు. విశాఖ పశ్చిమలో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్‌పై టీడీపీ అభ్యర్థి గణబాబు గెలిచారు. విశాఖ సౌత్‌లో వైఎస్సార్సీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్‌పై జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాసయాదవ్ గెలుపొందారు. విశాఖ నార్త్‌లో వైఎస్సార్సీపీ అభ్యర్థి కేకే రాజుపై బీజేపీ అభ్యర్థి పి. విష్ణుకుమార్ రాజు గణబాబు మెజారిటీతో గెలుపొందారు. చోడవరంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి కరణం ధర్మశ్రీపై టీడీపీ అభ్యర్థి కె.ఎస్.ఎన్.ఎస్ రాజు విజయం సాధించారు.
విజయనగరంలో దూసుకెళ్తున్న కూటమి అభ్యర్థులు - AP Election 2024
మాడుగుల నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఈర్లె అనూరాధపై టీడీపీ అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తి గెలిచారు. ఎలమంచిలిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి యు.వి రమణమూర్తి రాజుపై జనసేన అభ్యర్థి విజయకుమార్ గెలిచారు. పాయకరావుపేటలో వైఎస్సార్సీపీ అభ్యర్థి కంబాల జోగులుపై అభ్యర్థి వంగలపూడి అనిత విజయకేతనం ఎగరవేశారు. నర్సీపట్నంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర గణేశ్‌పై టీడీపీ అభ్యర్థి చింతకాయల అయ్యన్నపాత్రుడు గెలుపొందారు.
పెందుర్తిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌పై జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్‌బాబు విజయం సాధించారు. అనకాపల్లిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి మలసాల భరత్‌కుమార్‌పై జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ గెలిచారు. పాడేరులో వైఎస్సార్సీపీ అభ్యర్థి మత్స్యరాస విశ్వేశ్వరరాజు గెలుపొందారు. అరకు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి రేగం మత్స్యలింగం గెలిచారు.
కడపలో గెలుపెవరిది? అన్నీ పోయినా సొంత జిల్లా అయినా చేజిక్కేనా? - Kadapa Election Results 2024
విశాఖ నగరం ఋషికొండలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసంపై తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడింది. రుషికొండ వద్ద జరుగుతున్న కట్టడాల వైపు సెక్యూరిటీ సిబ్బంది ఇప్పటివరకు ఎవరిని అనుమతించ లేదు. అయితే ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఓట్ల లెక్కింపులో టీడీపీ కూటమి ముందంజలో ఉన్న నేపథ్యంలో టీడీపీ శ్రేణులు సీఎం నివాసంపై పార్టీ జెండాను ఎగురవేశారు. మరోవైపు ఇప్పటికే కూటమి నేతలు గెలుపు ఖాయం కావడంతో జనసేన, టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.