ETV Bharat / state

వైఎస్సార్సీపీ కబంధ హస్తాల నుంచి ఏసీఏకి త్వరలో విముక్తి - నూతన అధ్యక్షుడిగా ఎవరంటే? - ACA freed from YSRCP

ACA freed from YSRCP: వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుటుంబ కబంధ హస్తాల నుంచి ఆంధ్రాక్రికెట్ అసోసియేషన్‌కు విముక్తి కల్పించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఏసీఏ నూతన అధ్యక్షుడిగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఎన్నికయ్యే అవకాశం ఉంది. బీసీసీఐ నుంచి ఏటా ఏసీఏ కి వచ్చే నిధుల్లో సాయిరెడ్డి బంధుగణం అవినీతికి పాల్పడిందనే ఆరోపణలు ఉన్నాయి.

ACA freed from YSRCP
ACA freed from YSRCP (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 18, 2024, 9:17 AM IST

ACA freed from YSRCP: జగన్‌ అధికారం, పలుకుబడిని అడ్డంపెట్టుకుని, ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌(ఏసీఏ)ను గత ఐదేళ్లూ తన జేబు సంస్థగా మార్చుకున్నారు. వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. సాయిరెడ్డి అల్లుడి అన్న, దిల్లీ మద్యం కుంభకోణంలో నిందితుడు, అరబిందో డైరెక్టర్‌ శరత్‌చంద్రారెడ్డి రెండు దఫాలుగా ఏసీఏ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఉపాధ్యక్షుడిగా సాయిరెడ్డి అల్లుడు రోహిత్‌రెడ్డి, కార్యదర్శిగా సాయిరెడ్డికి అత్యంత సన్నిహితుడు, విశాఖకు చెందిన వస్త్రవ్యాపారి గోపీనాథ్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు.

ఏసీఏ కోశాధికారిగానూ తన ఆడిటర్‌నే నియమించారు విజయసాయిరెడ్డి. పేరుకే శరత్‌చంద్రారెడ్డి, మోహిత్‌రెడ్డి అధ్యక్ష, ఉపాధ్యక్షులు. కానీ, ఏసీఏని నడిపించేంది గోపీనాథ్‌రెడ్డే. 2022 నవంబరులో ప్రస్తుత అపెక్స్‌ కౌన్సిల్‌ ఏర్పాటైంది. ఆ ఎన్నికల్లో ఒక్కో పోస్టుకు ఒక్కరే నామినేషన్‌ వేసేలా ‘మేనేజ్‌’ చేశారు. 2019 ఎన్నికల ముందు వరకూ విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న ఏసీఏ కార్యాలయాన్ని జగన్‌ మెప్పుపొందేదుకు సాయిరెడ్డి తన మనుషుల ద్వారా విశాఖకు మార్చేశారు.

సాయిరెడ్డి కుటుంబ సభ్యుల పెత్తనం నుంచి ఏసీఏకు విముక్తి లభించనుంది. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాలతో సాయిరెడ్డి బంధుగణంతో నిండిన ప్రస్తుత అపెక్స్‌ కౌన్సిల్‌ మొత్తం రాజీనామా చేయనుంది. ఈ నెల 21న జరిగే సమావేశంలో నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. ఆ తర్వాత ప్రత్యేక సర్వసభ్య సమావేశం ఏర్పాటుచేసి కొత్త అపెక్స్ కౌన్సిల్‌ కోసం ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటిస్తారు. ఇదంతా జరగడానికి 40 రోజుల సమయం పడుతుందని అంచనా. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఏసీఏ అధ్యక్ష ఎన్నికల బరిలో దిగే అవకాశం ఉంది. జిల్లా క్రికెట్‌ సంఘాలు, వివిధ క్లబ్‌లు ఆయన అభ్యర్థిత్వం వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.

క్రికెటర్లు కూడా రాష్ట్రం నుంచి పారిపోవాల్సిందేనా? - వైసీపీ దెబ్బకు హనుమ విహారి ఔట్

ఏసీఏని గుప్పిట్లో పెట్టుకుని గోపీనాథ్‌రెడ్డి నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. సాధారణంగా ఏ రాష్ట్ర రంజీ జట్టులోనైనా 15 మందే ఉంటారు. కానీ ఆంధ్రా రంజీ జట్టుల 17 మంది ఉండేలా మార్పులు చేశారు. వారిలో 15 మందినే సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేస్తుందని, మిగతా ఇద్దర్నీ గోపీనాథ్‌రెడ్డి తన కోటాలో నామినేట్ చేసేవారని సమాచారం. బీసీసీఐ ఏటా ఇచ్చే దాదాపు 100 కోట్ల రూపాయల నిధులనూ ఇష్టానుసారం ఖర్చుపెట్టేశారు.

ఏసీఏలో నిధుల దుర్వినియోగంపై పలు కేసులు పడటంతో అవి తేలేవరకూ ఉద్యోగుల జీతాలు, మ్యాచ్‌ల నిర్వహణకు మాత్రమే నిధులు ఖర్చుచేయాలని హైకోర్టు కూడా ఆదేశించింది. జగన్‌ మెప్పు కోసం ఏసీఏ కార్యదర్శి గోపీనాథ్‌రెడ్డి కడపలో క్రికెట్‌ స్టేడియం అభివృద్ధికి 20 కోట్లు ఖర్చుపెట్టినట్టు తెలుస్తోంది! ఇక ఆంధ్రా ప్రీమియర్‌ లీగ్‌ వల్ల రెండు సీజన్లలో నష్టం వచ్చినా లెక్కచేయకుండా ఈ నెలలోనే మూడో సీజన్‌ నిర్వహించారు. ఏపీఎల్​లోని మూడు జట్లలో గోపీనాథ్‌రెడ్డికి వాటాలున్నాయనే ఆరోపణలున్నాయి.

రాయలసీమ కింగ్స్‌ సీఈవో గోపీనాథ్‌రెడ్డికి బావమరిదియ. ఇక విశాఖ క్రికెట్‌ స్టేడియానికి అంతర్జాతీయ మ్యాచ్‌లు కేటాయించినప్పుడల్లా గోపీనాథ్‌రెడ్డి బృందం టికెట్లను బ్లాక్‌లో విక్రయించి కోట్లు కొల్లగొట్టారనే ఆరోపణలున్నాయి. 2019 నాటికి ఏసీఏలో 120 కోట్ల రూపాయల వరకూ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లుంటే ఇప్పుడు 20 కోట్లేమిగిలాయి. జగన్‌ మెప్పు కోసం గోపీనాథ్‌రెడ్డి చేయని పనంటూలేదు. ఏసీఏ నిధులతో విశాఖ స్టేడియంలో వైఎస్సార్ కాంస్యవిగ్రహం ఏర్పాటుచేశారు. క్రికెట్‌ ప్రపంచకప్‌ సమయంలో బీచ్‌రోడ్డులో ఏసీఏ ఖర్చుతో భారీ తెరలపై జగన్‌ చిత్రాలను ప్రదర్శించారు.

ఏసీఏ ముసుగులో కోట్ల రూపాయలు దోచుకున్నారు: పీతల మూర్తి యాదవ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.