Allu Arjun petition in AP HC : ఏపీ హైకోర్టులో సినీనటుడు అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల సమయంలో నంద్యాలలో తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని పిటిషన్లో ఆయన కోరారు. సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉండగా అనుమతి లేకుండా జనసమీకరణ చేపట్టారంటూ అల్లు అర్జున్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను ధర్మాసనం విచారణకు స్వీకరించింది. దీనిపై నేడు విచారణ జరగనుంది.
అసలేం జరిగిదంటే : మే 11న అల్లు అర్జున్ నంద్యాల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డి మద్దతుగా నంద్యాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎలాంటి అనుమతులూ తీసుకోకుండా భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలో సెక్షన్ 30, 144 అమల్లో ఉన్నప్పటికీ వేల మందితో ర్యాలీ నిర్వహించడం పెను దుమారాన్నే రేపింది. దీనిపై కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నంద్యాల టూటౌన్ పోలీసులు అల్లు అర్జున్ సహా శిల్పా రవిపై కేసు నమోదు చేశారు. ఆ రోజు ఎన్నికల కోడ్‌ను అమలు చేయడంలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఉదంతంలో ఇద్దరు కానిస్టేబుళ్లపై పోలీసు ఉన్నతాధికారులు వేటు వేశారు.
సినీనటుడు అల్లు అర్జున్‌పై నంద్యాలలో కేసు నమోదు - Case Registered Against Allu Arjun