ETV Bharat / state

'జగన్‌ అరాచక పాలన అంతం చేయడానికి ప్రజలంతా సిద్ధమవ్వాలి' ప్రచారంలో దూకుడు పెంచిన కూటమి అభ్యర్థులు - Alliance leaders Campaign

Alliance Leaders Election Campaign in AP : ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూటమి అభ్యర్థులు ప్రచారంలో దూకుడు పెంచారు. కుటుంబ సభ్యులతో కలిసి ఇంటింటికీ వెళ్లి సూపర్​ సిక్స్​ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లును అభ్యర్థిస్తున్నారు. జగన్​ అరాచక పాలన అంతం చేయడానికి ప్రజలంతా సిద్ధమవ్వాలని సూచింస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వంతో సాధ్యమవుతుందని ప్రజలకు తెలియజేస్తున్నారు.

election_campaign
election_campaign (Etv Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 4, 2024, 8:21 AM IST

'జగన్‌ అరాచక పాలన అంతం చేయడానికి ప్రజలంతా సిద్ధమవ్వాలి' ప్రచారంలో దూకుడు పెంచిన కూటమి అభ్యర్థులు (Etv Bharat)

Alliance Leaders Election Campaign in AP : పోలింగ్ తేదీ దగ్గరపడుతుండటంతో రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. కూటమి అభ్యర్థులతో పాటు వారి కుటుంబసభ్యులూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి మేనిఫెస్టోలో పెట్టిన పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. కూటమి అభ్యర్థులకు ప్రజలకు బ్రహ్మరథం పడుతున్నారు. వైఎస్సార్సీపీ నుంచి తెలుగుదేశంలోకి చేరికలు జోరుగా సాగుతున్నాయి.

Krishna District : కృష్ణా జిల్లా నాగాయలంకలో జనసేన అభ్యర్థి మండలి బుద్ధ ప్రసాద్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి జనం పెద్దఎత్తున తరలివచ్చారు. పురవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించి ఓట్లు అభ్యర్థించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో తెలుగుదేశం అభ్యర్థి వంసత వెంకట కృష్ణప్రసాద్‌ సతీమణి శిరీష ఇంటింటా ప్రచారం చేశారు. కంచికచర్ల, వీరులపాడు మండలం సర్పంచ్‌లు టీడీపీ అభ్యర్థి తంగిరాల సౌమ్య సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. అనంతరం సౌమ్య రోడ్‌ షో నిర్వహించగా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. విజయవాడ 21వ డివిజన్‌లో వైఎస్సార్సీపీ అభ్యర్థి దేవినేని అవినాష్‌ విస్తృతంగా ప్రచారం చేశారు. విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి బొండా ఉమ కుమారుడు సిద్ధార్థ ఇంటింటికీ వెళ్లి మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. కూటమి మేనిఫెస్టోకి స్పందన వస్తోందని సిద్ధార్థ తెలిపారు. విజయవాడ మార్కెట్‌లో బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ప్రచారం చేశారు. విజయవాడ 4వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్‌ రావు భార్య అనురాధ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

'జగన్‌ ఓడించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉండాలి'-జోరుగా కూటమి అభ్యర్థుల ఎన్నికల ప్రచారం - Alliance Candidates Campaign

Bapatla District : బాపట్ల జిల్లా కొండమూరులో టీడీపీ ఎంపీ అభ్యర్థి టి. కృష్ణ ప్రసాద్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పల్నాడు జిల్లా నకరికల్లు మండలంలో టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ప్రజల నుంచి ఘన స్వాగతం లభించింది. సూపర్‌ సిక్స్ పథకాలను కన్నా ప్రజలకు వివరించారు. చిలకలూరిపేట 19వ వార్డులో టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు కుమార్తె స్వాతి, ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు సోదరి రుద్రమదేవితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలో టీడీపీ అభ్యర్థి ఆనం విస్తృతంగా ప్రచారం చేశారు.

జగన్​ మళ్లీ గెలిస్తే ఎవరి భూములు మిగలవు - హెచ్చరించిన సినీనటుడు శివాజీ - Hero Shivaji Election Campaign

Srikakulam District : శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల, రణస్థలం మండలాల్లో బీజేపీ అభ్యర్థి ఈశ్వరరావు భారీ ర్యాలీ నిర్వహించారు. లావేరు మండలం గోవిందపురంలోని వైఎస్సార్సీపీకి చెందిన 108 కుటుంబాలు బీజేపీలో చేరాయి. కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడికిలో టీడీపీ అభ్యర్థి బండారు సత్యానందరావుకు ప్రజలు ఘనస్వాగతం పలికారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో టీడీపీ అభ్యర్థి చింతకాయల అయ్యన్నపాత్రుడుకి మహిళలు మంగళహారతులు పట్టారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలంలో జనసేన అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ రోడ్‌ షో నిర్వహించారు. ఏలూరు జిల్లా ఉంగుటూరులో జనసేన అభ‌్యర్థి పత్సమట్ల ధర్మరాజు భారీ ర్యాలీ నిర్వహించారు. ఏలూరులో గౌడ సమాఖ్య నేతలు ఆత్మీయ సమావేశానికి ఆచంట టీడీపీ అభ్యర్థి పితాని సత్యనారాయణ హాజరై బీసీ ద్రోహి జగన్‌ను ఇంటికి పంపాలన్నారు.

'ఎన్నికల్లో జగన్‌ సర్కారును తరిమికొట్టాలి'- గెలుపే లక్ష్యంగా కూటమి అభ్యర్థుల ప్రచారం - Alliance Leaders Election Campaign

Kurnool District : కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి నల్లగోని రాఘవేంద్రరెడ్డి రోడ్‌ షో నిర్వహించి ఓట్లు అభ్యర్థించారు. కర్నూలు 49వ వార్డులో తెలుగుదేశం అభ్యర్థి టీజీ భరత్ ఇంటింటా ప్రచారం చేశారు. భరత్‌కు కాలనీవాసులు ఘనస్వాగతం పలికారు. ఎమ్మిగనూరు మండలంలో టీడీపీ అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి భారీ రోడ్‌ షో నిర్వహించారు. ప్రజలు బ్రహ్మరథం పట్టారు. నంద్యాల జిల్లా డోన్ మండలంలో టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్సార్ జిల్లా కమలాపురం నియోజకవర్గం చెన్నూరులో వైఎస్సార్సీపీకి చెందిన 100 కుటుంబాలు కూటమి అభ్యర్థి పుత్తా చైతన్య రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. అనంతరం చెన్నూరులో ఆయన భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. తిరుపతి జిల్లా శిరసనంబేడులో వైఎస్సార్సీపీ నాయకులు టీడీపీలో చేరారు.

Anantapuram District : అనంతపురం జిల్లా సెట్టూరు మండలంలో తెలుగుదేశం అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు రోడ్‌ షో నిర్వహించారు. ఆయా గ్రామాల్లో మహిళలు సురేంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. రాయదుర్గంలో ముస్లిం మహిళల ఆత్మీయ సమావేశంలో టీడీపీ అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు, ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ, శాసనమండలి మాజీ ఛైర్మన్ షరీఫ్ హాజరయ్యారు. ముస్లిం మైనారిటీల సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యమవుతుందన్నారు. సత్యసాయి జిల్లా తలుపుల మండలంలోని గ్రామాల్లో టీడీపీ ఎంపీ బీకే పార్థసారథి, ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్‌ కలిసి భారీ రోడ్ షో నిర్వహించారు. సూపర్‌ సిక్స్ పథకాలకు ప్రజల్లో అనూహ్య స్పందన వస్తోందన్నా. ఎన్నికల్లో జగన్‌ను ఓడించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.