Alliance Leaders Election Campaign in AP : రాష్ట్ర వ్యాప్తంగా కూటమి అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. అభ్యర్థులతో పాటు వారి కుటుంబసభ్యులూ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. జగన్ అరాచక పాలన అంతం కావాలంటే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. అదే సమయంలో వైఎస్సార్సీపీ నుంచి తెలుగుదేశంలోకి చేరికలు పెద్దఎత్తున కొనసాగుతున్నాయి.
Guntur District : గుంటూరు జిల్లా మేడికొండూరు మండలంలో తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్‌కుమార్‌తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. విజయవాడ 2వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ సతీమణి అనురాధ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెదప్రోలులో వైఎస్సార్సీపీకి చెందిన కొందరు జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో పసుపు కండువా కప్పుకున్నారు. చీరాల టీడీపీ అభ్యర్థి ఎం.ఎం. కొండయ్యకు మద్దతుగా ఆయన కుమారుడు గౌరీ అమర్నాథ్ బాపట్ల జిల్లా వేటపాలెం, రామన్నపేటలో ఎన్నికల ప్రచారం చేశారు. రేపల్లె మండలం మోర్లవారిపాలెంలో వైఎస్సార్సీపీకి చెందిన 10కుటుంబాలు తెలుగుదేశంలో చేరాయి. అద్దంకి నియోజవర్గంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్, ఆయన సతీమణి, కుమారులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏలూరి సాంబశివరావు పర్చూరు నియోజకవర్గంలో ప్రచారం చేపట్టి ఓట్లు అభ్యర్థించారు.
Srikakulam District : ఎంపీ రామ్మోహన్ నాయుడు, టీడీపీ అభ్యర్థి గోండు శంకర్ కలిసి శ్రీకాకుళంలో ఎన్నికల ప్రచార ర్యాలీ నిర్వహించారు. గోండు శంకర్ సతీమణి ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ఇచ్ఛాపురం నియోజకవర్గం తేలుకుంచిలో టీడీపీ అభ్యర్థి బెందాళం అశోక్ ఇంటింటా ప్రచారం చేశారు. నిడదవోలు నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్ కుమార్తె రంగప్రియ తన తండ్రికి ఓటు వేయాలని కోరారు. అత్తిలి మండలంలో టీడీపీ అభ్యర్థి అరిమిల్లి రాధాకృష్ణ, ఎంపీ అభ్యర్థి భూపతిరాజుతో కలిసి రోడ్‌షో చేశారు. గిద్దలూరు నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థి శ్రీనివాసులరెడ్డి, టీడీపీ అభ్యర్థి అశోక్‌రెడ్డి కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు.
Kurnool District : కర్నూలు జిల్లా ఆదోని మండలంలో బీజేపీ అభ్యర్థి పీవీ పార్థసారథి ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. కర్నూలు 8వ వార్డు ఖండేరిలో టీజీ భరత్ ఎన్నికల ప్రచారం నిర్వహించి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఎమ్మిగనూరులో ముస్లింల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కూటమి అభ్యర్థులు తమకు మద్దతు ఇవ్వాలని ముస్లింలను కోరారు. వైఎస్సార్ జిల్లా కమలాపురం మండలం జంగం పల్లెలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పుత్తా చైతన్య రెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రచారం చేశారు. నెల్లూరు జిల్లా కోవూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి కనిగిరి రిజర్వాయర్ కట్టలను పరిశీలించారు. కట్టపై వైఎస్సార్సీపీ నేతల అక్రమ తవ్వకాలను ప్రజలకు చూపించి వివరించారు. నెల్లూరు టీడీపీ ఎంపీ అభ‌్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విస్తృత ప్రచారం చేస్తూ దూసుకెళ్తున్నారు. ఆయన సమక్షంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం కాకుపల్లిలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జోరుగా ప్రచారం చేశారు. ప్రచారంలో పలువురు నృత్యాలతో సందడి చేశారు.
'వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రం అధోగతి'- ఎన్నికల ప్రచారంలో కూటమి అభ్యర్థులు - ELECTION CAMPAIGN
Anantapur District : అనంతపురం జిల్లా విడపనకల్లు మండలంలోని గ్రామాల్లో తెలుగుదేశం అభ్యర్థి పయ్యావుల కేశవ్ రోడ్ షో నిర్వహించారు. కూటమి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ప్రజలకు సూపర్ సిక్స్ పథకాల కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతపురంలో వైఎస్సార్సీపీకి చెందిన 250 కుటుంబాలు తెలుగుదేశంలో చేరాయి. వారికి టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పసుపు కండువా కప్పారు. సత్యసాయి జిల్లా ధర్మవరం మారుతి రాఘవేంద్ర కళ్యాణమండపంలో చేనేత ఆత్మీయ సదస్సులో బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ పాల్గొని జగన్‌ను ఇంటికి పంపేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉండాలన్నారు. కదిరి వైఎస్సార్సీపీకి చెందిన 100 కుటుంబాలు టీడీపీ అభ్యర్థి కందికుంట సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. కదిరి మండలంలో కందికుంట ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కదిరి 34వ వార్డులో వెంకటప్రసాద్ సతీమణి యశోదా దేవి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
Tirupati District : తిరుపతి జిల్లా బాలాయపల్లి మండలంలో తెలుగుదేశం అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. విశాఖ భీమిలి నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు రోడ్ షో నిర్వహించారు. రాజాం నియోజకవర్గం సంతకవిటి మండలంలో టీడీపీ అభ్యర్థి కోండ్రు మురళీమోహన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.