Alliance Leaders Election Campaign in Andhra Pradesh: ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న తరుణంలో కూటమి అభ్యర్థులు ప్రచార జోరు పెంచారు. ఇంటింటికీ తిరుగుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వ తప్పుడు విధానాలను ఎండగడుతున్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం కూటమిని అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలకు వివరిస్తున్నారు. సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ఎన్నికల్లో కూటమికి అండగా నిలవాలని అభ్యర్థిస్తున్నారు. రాజధాని రైతులు సైతం అమరావతిని అభివృద్ధి చేసే నాయకుడికే పట్టం కట్టాలని ప్రచారం చేస్తున్నారు.
కుప్పంలో జోరుగా టీడీపీ ప్రచారం - బాబును లక్షఓట్ల మెజార్టీతో గెలిపిస్తామంటున్న శ్రేణులు
రాష్ట్రవ్యాప్తంగా ఎన్డీయే కూటమి అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి ఆంజనేయ వాగు సెంటర్ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకుని అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మైలవరం నియోజకవర్గం కూటమి అభ్యర్థి వసంతకృష్ణ ప్రసాద్ సమక్షంలో వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్దఎత్తున టీడీపీలో చేరారు. ఐక్యతతో పనిచేసి కూటమి విజయం కోసం ప్రతి ఒక్కరూ శ్రమించాలని కృష్ణప్రసాద్ సూచించారు. నందిగామలో కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్యతో కలిసి మాజీ మంత్రి దేవినేని ఉమ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి సూపర్ సిక్స్ పథకాలు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు.
రాష్ట్రంలో జోరందుకున్న టీడీపీ ప్రచారం- గెలుపే లక్ష్యంగా కూటమి అభ్యర్థుల ప్రచార పర్వం - Alliance Candidates campaign
అమరావతికి ద్రోహం చేసిన నాయకులకు ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలంటూ రాజధాని రైతులు ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గుంటూరు జిల్లా పొన్నికల్లు గ్రామంలో ఓటర్లను కలిసి రాజధాని అమరావతికి జరిగిన అన్యాయన్ని వివరించారు.
ప్రకాశం జిల్లా దర్శిలో టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి సూపర్ సిక్స్ పథకాలు వివరిస్తూ కూటమికి ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఎన్డీయే అభ్యర్థి సుగవాసి బాలసుబ్రమణ్యం ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో ప్రజలు విసిగిపోయారన్నారు. విశాఖ జిల్లాలో గంటా శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా గ్రామంలోని శ్రీరామ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన గంటా మత్స్యకార గ్రామాల్లో ప్రచారం నిర్వహించి వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా గార మండలం రాళ్లపేటలో వైఎస్సార్సీపీ పాలనతో విసుగు చెందిన 300 కుటుంబాలు కూటమి అభ్యర్థి గొండు శంకర్ సమక్షంలో టీడీపీ కండువాలు కప్పుకున్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని గ్రామస్థులు విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇంటింటికీ సూపర్ సిక్స్ పథకాలు- ప్రకాశంలో టీడీపీ నేతల ప్రచారం
శ్రీసత్యసాయి జిల్లా గాండ్లపెంట మండలంలో ఎన్డీయే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. అవినీతి ఊబిలో కూరుకుపోయిన వైఎస్సార్సీపీని ఇంటికి పంపి టీడీపీను గెలిపించాలని కోరారు. ఈనెల 12న కదిరిలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటించనున్నట్లు కందికుంట వెంకటప్రసాద్ తెలిపారు. బాలకృష్ణ సైకిల్ రావాలి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు కోరారు.