ETV Bharat / state

'రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కూటమితోనే సాధ్యం'- గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ప్రచారం - Alliance Leaders - ALLIANCE LEADERS

Alliance Leaders Election Campaign : ఎన్నికలు సమీపిస్తున్న వేళ వివిధ పార్టీల నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇంటింటికీ తిరుగుతూ తమకు ఓట్లు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. అధికారంలోకి వస్తే నియోజకవర్గాల్ని అభివృద్ధి చేసి చూపిస్తామని హామీలు ఇస్తున్నారు

tdp_campaign
tdp_campaign
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 27, 2024, 4:23 PM IST

Alliance Leaders Election Campaign in AP : వైఎస్సార్‌ జిల్లా కడప నియోజకవర్గం కూటమి అభ్యర్థి మాధవి ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. కడపలోని ఆకుల వీధిలోని ఇంటింటా తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, సూపర్‌ సిక్స్‌ పథకాల ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే రానున్న అయిదేళ్ల కాలంలో కడప నగరం రూపురేఖలు మార్చేస్తానని మాధవి తెలిపారు. ప్రొద్దుటూరులో టీడీపీ అభ్యర్థి వరదరాజుల రెడ్డి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మే 13న జరిగే ఎన్నికల్లో సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Konaseema District : కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని లంక గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దాట్ల బుచ్చి బాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని దాట్ల బుచ్చిబాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో తెలుగుదేశం అభ్యర్థి కాలవ శ్రీనివాసులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి సూపర్ సిక్స్ కరపత్రాలు పంపిణీ చేస్తూ టీడీపీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. వైసీపీ ఐదేళ్లలో పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. ప్రజల కష్టాలు తీరాలన్న, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన నాయకత్వం అవసరమని పేర్కొన్నారు

తెలుగుదేశం పార్టీ విజయం కోసం ప్రవాసాంధ్రుల ప్రచారం - NRI Election Campaign For Tdp

East Godavari : తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం సీతారామపురంలో కూటమి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. కూటమి అధికారంలోకి రాగానే సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ కుయుక్తుల రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల్లో కూటమి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాజమండ్రి పేపర్​ మిల్​ కార్మికుల సమస్యలను వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసిదని కూటమి అభ్యర్థి ఆదిరెడ్డి వాసు ఎన్నికల ప్రచారంలో భాగంగా పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేపర్​ మిల్​ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

Srikakulam : శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలోని పలు గ్రామాల్లో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రచారం నిర్వహించారు. వైసీపీ పాలనపై అన్ని వర్గాల ప్రజల్లోనూ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉందని ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. ఎన్నికల వరకు కార్యకర్తలందరూ సమర్థవంతంగా పని చేయాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కూటమిని గెలిపించాలని కోరారు.

'ఎన్నికల్లో జగన్‌ సర్కారును తరిమికొట్టాలి'- గెలుపే లక్ష్యంగా కూటమి అభ్యర్థుల ప్రచారం - Alliance Leaders Election Campaign

NTR District : ఎన్టీఆర్ జిల్లా నందిగామలో కూటమి అభ్యర్ధి తంగిరాల సౌమ్య ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మహిళలు సౌమ్యకు హారతులు ఇచ్చి అభిమానం చాటుతున్నారు. ప్రచారంలో భాగంగా దోశలు వేసి ఆకట్టుకున్నారు. సైకిల్ గుర్తుపై ఓట్లేసి ఎమ్మెల్యేగా తనను, విజయవాడ ఎంపీగా కేసినేని శివనాథ్‌ను గెలిపించాలని సౌమ్య కోరారు. సైకో పోవాలి సైకిల్ రావాలంటూ నినాదాలు చేశారు. అరాచక ప్రభుత్వానికి అంతం పాడాలని కోరారు. ప్రజల ఆదరాభిమానులే తనకు శ్రీరామరక్ష అంటూ జగ్గయ్యపేట నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి శ్రీరామ్​ రాజగోపాల్​ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుస్తూ టీడీపీ అధికారంలోకి వస్తే జరిగే మేలును, చంద్రబాబు పాలన రాష్ట్రానికి ఎంత అవసరమో ఓటర్లుకు వివరిస్తున్నారు

West Godavari : పశ్చిమగోదావరి జిల్లా తణుకు కూటమి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ ఎన్నికల ప్రచారం జోరుగా సాగిస్తున్నారు. తణుకులోని జంగం చెరువు, వేమవరం ప్రాంతాల్లో పర్యటిస్తూ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. వృద్ధులకు ,వికలాంగులకు పింఛన్ల పంపిణీ చేసే అవకాశం ఉన్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యం వహించటం దారణమన్నారు.

Annamayya District : అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి నల్లారి కిషోర్​ కుమార్​ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయిదేళ్ల వైసీపీ పాలనలో నిత్యావసర ధరలు, కరెంట్​ బిల్లులు పెరిగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడిన విషయాన్ని గుర్తు చేశారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం కూటమి అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మే13న జరిగే ఎన్నికల్లో సైకిల్​ గుర్తుకు ఓటు వేసి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని ప్రజలందరికి విజ్ఞప్తి చేశారు.

'రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కూటమితోనే సాధ్యం'- గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ప్రచారం

'సూపర్​ సిక్స్' పథకాల ఆకర్షణ - పార్టీని వీడుతున్న వైసీపీ శ్రేణులు - YSRCP Leaders Join In TDP

Visakha District : విశాఖ జిల్లా భీమునిపట్నంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వైసీపీ అయిదేళ్ల పాలనలో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని ధ్వజమెత్తారు. టీడీపీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. వైఎస్సార్​ చేనేత నేస్తం పథకం పేరుతో ముఖ్యమంత్రి చేనేత కార్మికులను మోసం చేశారని పెడన నియోజకవర్గ కూటమి అభ్యర్థి కాగిత కృష్ణ ప్రసాద్​ పేర్కొన్నారు. నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలు గుక్కెడు నీటి కోసం నానా అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో టీడీపీ అభ్యర్థి బేబీ నాయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మే 13న జరిగే ఎన్నికల్లో సైకిల్​ గుర్తుకు ఓటు వేసి కూటమి పార్టీని గెలిపించవలసిందిన కోరుకుంటున్నారు.

Srikakulam : శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం కొండములగాంలో కూటమి అభ్యర్థి ఈశ్వరరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక ఉపాధి కూలీలకు కేంద్రం ఇస్తున్న పథకాలను వివరించారు. తెలుగుదేశం హయాంలో నిర్మించిన ఇళ్లకు వైసీపీ రంగులు వేసి ప్రజలను మభ్యపెడుతుందని దుయ్యబెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి పేదవాడికి 2 సెంట్ల స్థలం, ఇళ్లు ఇస్తామని భరోసా ఇచ్చారు.

Vijayawada : విజయవాడ తూర్పు నియోజక వర్గంలో గద్దె రామ మోహన్​ ప్రజాదీవెన యాత్ర అనే పేరుతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ఘనత సీఎం జగన్​కే దక్కుతుందని పేర్కొన్నారు.విజయవాడ పట్టణంలోని 50వ డివిజన్​లో కూటమి అభ్యర్థి సుజనా చౌదరి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. పట్టణంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం పట్టణంలో ఉన్నా సమస్యలన్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

గెలుపే లక్ష్యంగా - కూటమి అభ్యర్థుల ఎన్నికల ప్రచారం - NDA Candidates Election Campaign

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.