ETV Bharat / state

తాడేపల్లిలో రెచ్చిపోయిన ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరులు - Rk Followers Trying to Occupy Land

Alla Ramakrishna Reddy Followers Trying to Occupy Land: రాష్ట్రంలో వైఎస్సార్​సీపీ నేతల భూకబ్జాలు ఆగడం లేదు. తాజాగా మాజీ వైఎస్సార్​సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరులు తాడేపల్లిలోని ఓ స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించగా బాధితులు తీవ్రంగా ప్రతిఘటించారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కబ్జాకోరులను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు.

rk_followers_trying_to_occupy_land
rk_followers_trying_to_occupy_land (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 28, 2024, 5:31 PM IST

Alla Ramakrishna Reddy Followers Trying to Occupy Land: అధికారంలో లేకపోయినా వైఎస్సార్​సీపీ నాయకుల భూ కబ్జాలు ఆగడం లేదు. తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరి మాజీ శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరులు తాడేపల్లిలోని ఓ స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించగా బాధితులు తీవ్రంగా ప్రతిఘటించారు. తాడేపల్లిలోని పాత టోల్​గేట్​ పక్కనే సుమతి అనే మహిళకు 40 సెంట్లు స్థలం ఉంది. దీనిని ఆక్రమించేందుకు అదే ప్రాంతానికి చెందిన బుర్రముక్క సాంబిరెడ్డి, వెంకటప్పరెడ్డి గత కొంతకాలంగా యత్నిస్తున్నారు. సాంబిరెడ్డి తన మనుషులు నానాజీ, నరేంద్ర, నాగలక్ష్మిలను సుమతి ఇంటిపైకి పంపించారు. వారి ఇంట్లోని సామాన్లను చెల్లాచెదురుగా పడేసి భయభ్రాంతులకు గురి చేశారు.

ఈ స్థలాన్ని తమకు విక్రయించాలని ఒత్తిడి చేశారు. అంతలో సమాచారం తెలుసుకున్న స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు సుమతి ఇంటికి చేరుకున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా వాళ్లు వచ్చి దాడికి యత్నించిన వారిని అదుపులోకి తీసుకొని స్టేషన్​కి తరలించారు. గత కొంతకాలంగా తమ ఇంటిని ఖాళీ చేయాలంటూ మాజీ ఎమ్మెల్యే ఆర్కే ప్రధాన అనుచరులు బుర్రముక్కు సాంబిరెడ్డి మనుషులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితురాలు సుమతి వాపోయారు. వైఎస్సార్​సీపీ హాయంలో స్థలం ఖాళీ చేయనందుకు తనపై 11 కేసులు పెట్టారని సుమతి వాపోయారు.

వైసీపీ కబ్జా కోరల్లో ఉన్న గుడివాడ కళాక్షేత్ర భవనానికి త్వరలో విముక్తి - Kalakshetram Occupy

రైతులకు సంకటంగా అధికారుల అలసత్వం - Officers Neglect Repairing Drains

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.