ETV Bharat / state

ఈ 21 రోజులు పెళ్లిళ్ల పండగే - మండపాలు అదిరిపోవాలా! ఊరేగింపులు మోగిపోవాలా!

రెండు నెలల్లో మంచి ముహూర్తాలు - మండపాలు, క్యాటరింగ్‌ నిర్వాహకులు, ఫొట్రోగాఫర్లకు గిరాకీ

wedding_season
wedding_season (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 31, 2024, 12:42 PM IST

Wedding Season : వివాహ సుముహూర్తాలకు వేళయ్యింది. దీపావళి పండుగ ముగిసిన వెంటనే శుభఘడియలు ప్రారంభం కానున్నాయి. వివాహాది గృహ ప్రవేశాలు వంటి శుభకార్యాలు నిర్వహించేందుకు ఇప్పటికే ఎవరికి వారు ఏర్పాట్లలో తలమునకలయ్యారు. మూడు నెలలుగా ఎదురుచూస్తున్న పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది. సుదీర్ఘ విరామానంతరం మూడుముళ్ల బంధానికి శుభ ఘడియలు ముందుకు రావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో బాజాలు మోగనున్నాయి.

వివాహాది శుభకార్యాలకు ఆగస్టు తర్వాత నవంబర్​లో మంచి ముహూర్తాలు ఉన్నట్లు వేద పండితులు చెబుతున్నారు. వెలుగుదివ్వెల పండగ దీపావళి పండుగ ముగిసిన వెంటనే భాజా భజంత్రీలు మోగనున్నాయి. పెళ్లిళ్లతో పాటు గృహ ప్రవేశ కార్యక్రమాలు నిర్వహించేందుకు పండితులు ముహూర్తాలు పెట్టించేశారు. గత మూడు నెలలుగా శుభ ముహూర్తాలు లేకపోవడంతో ఆ సందడి తగ్గిపోయింది.

Pratidhwani: అసలేమిటీ పంచాంగం.. ఎందుకంత ప్రాముఖ్యం ?

ఆగస్టులో మొదలైన శ్రావణ మాసం సెప్టెంబర్ 3తో ముగిసింది. ఈ నేపథ్యంలో మూడున్నర నెలలుగా ఎంతగానో వేచి చూస్తున్నవారంతా ఏర్పాట్లలో తలమునకలయ్యారు. శుభ ముహూర్తాల్లో తమకు అనుకూల తేదీలను ఖరారు చేసుకుని పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, శంకుస్థాపన కార్యక్రమాలకు సన్నద్ధమయ్యారు.

రానున్న రెండు నెలల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు తెలిపారు. 60 రోజుల్లో వాయిద్యాలు, మండపాలు, క్యాటరింగ్‌ నిర్వాహకులు, ఫొట్రోగాఫర్లకు చేతినిండా పని దొరకనుంది. ఇప్పటికే పలువురు ముందస్తు బుకింగ్​లు చెల్లించి శుభకార్యాలకు అవసరమైన ఫంక్షన్ హాళ్లు, క్యాటరింగ్ వాళ్లని బుక్‌ చేసుకుంటున్నారు.

మార్కెట్ కళకళ ...
వసతులను బట్టి ఫంక్షన్‌ హాళ్ల ఒక్కరోజు అద్దె రూ.40 వేల నుంచి రూ.3 లక్షల వరకు ఉంది. పెళ్లిళ్ల సీజన్‌ నేపథ్యంలో యజమానులు వాటి ధరలు అమాంతం పెంచేశారు. ఇదిలా ఉండగా ఓ వైపు పెళ్లిళ్ల సీజన్, మరోవైపు ధన్​తేరాస్ దీవాళీ కావడం వస్త్ర, బంగారు వ్యాపారులకు కలిసొచ్చింది. దుకాణాలు కొనుగోలుదారులతో సందడిగా మారాయి. ఇదే ఒరవడి రెండు నెలల పాటు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని దుకాణాలతో పాటు కొంతమంది ప్రజలు విజయవాడ, విశాఖ, హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లి అవసరమైన వాటిని కొనుగోలు చేస్తున్నారు.

60 రోజుల్లో 21 శుభముహూర్తాలు...
నవంబరు, డిసెంబరు నెలల్లో 21 సుముహూర్తాలు ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు. ఆయా రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షలాదిగా వివాహాలు జరుగుతాయని అంచనా. డిసెంబరు వరకు అన్నిరకాల వేడుకలకు మంచి ముహూర్తాలున్నాయని, ప్రధానంగా వివాహాలు అధికంగా జరగనున్నాయని పురోహితులు తెలిపారు.

సుముహూర్తాల తేదీలివే..

  • నవంబర్‌ నెలలో 3, 7, 8, 9, 10, 13, 14, 15, 16, 17తేదీల్లో మొత్తం పది రోజులు ముహూర్తాలున్నాయి.
  • డిసెంబర్‌ నెలలో 5, 6, 7, 8, 9, 10, 13, 14, 15, 18, 26 తేదీల్లో మొత్తం 11 ముహూర్తాలు ఉన్నాయి.

పంచాంగంలో చెప్పిన గ్రహ ఫలితాలు మార్చుకోవడానికి అవకాశం ఉందా..?

మూఢం అంటే ఏంటి? - ఆ రోజుల్లో ఈ పనులు అస్సలే చేయకూడదు! - కానీ అవి చేయొచ్చట! - Importance of Moudyami 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.