ETV Bharat / state

YUVA - ఆర్గానిక్‌ పుట్టగొడుగులు ఎగుమతులతో స్వయం ఉపాధి సృష్టించుకున్న ఔత్సాహికురాలు - Women Cultivating Mushroom in Mahabubabad - WOMEN CULTIVATING MUSHROOM IN MAHABUBABAD

Women Cultivating Mushroom in Mahabubabad : అయినవాళ్లందరికి దూరంగా ఎక్కడో నగరంలో ఉంటూ 20, 30 వేలకు పని చేసుకుని బతికే కంటే సొంతూరిలోనే ఉంటూ అదే ఆదాయం సంపాదించుకుంటే ఎలా ఉంటుంది? అచ్చం అలాంటి ఆలోచనే చేసిందా యువతి. తన నిర్ణయానికి భర్త ప్రోత్సాహం తోడైంది. ఇంట్లోనే ఉంటూ స్వయం ఉపాధితో సంపాదిస్తోంది. అనుకున్నట్లే ప్రయత్నాలు చేసి ప్రతి నెల మంచి ఆదాయమూ అందుకుంటోంది, మహబూబూబాద్ జిల్లాకు చెందిన యామిని. తన సక్సెస్‌ స్టోరీనే ఇది.

Woman from Mahabubabad Cultivating Mushrooms
Women Cultivating Mushroom in Mahabubabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 10, 2024, 2:55 PM IST

YUVA - ఆర్గానిక్‌ పుట్టగొడుగులు- ఆన్​లైన్​లో ఎగుమతలు - స్వయం ఉపాధి సృష్టించుకున్న ఔత్సాహికురాలు (ETV Bharat)

Woman from Mahabubabad Cultivating Mushrooms : చదువుకున్న రంగంలోనే ఉద్యోగం సాధించడం గగనం అవుతోన్న ఈ రోజుల్లో అదే రంగంలో వ్యాపారమంటే మమూలు విషయం కాదు. కానీ, ఈ యువతి తనకున్న జ్ఞానానికి కొంచెం పెట్టుబడిని కలగలిపి పుట్టగొడుగుల వ్యాపారం చేస్తోంది. ఆన్‌లైన్‌ వేదికగా మహా నగరాలకు ఎగుమతి చేస్తూ మంచి లాభాలు అందుకుంటోంది. ఈమె పేరు యామిని. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు స్వస్థలం. బయో కెమిస్ట్రీలో పీజీ చేసింది. ఓ పల్లె దవాఖానాలో విధులు నిర్వర్తిస్తున్న చందుతో ఏడాదిన్నర క్రితం వివాహమైంది. అయితే ఏదో ఒక ప్రైవేటు ఉద్యోగం కాక రోగులకు తన వంతు సాయంగా నిలుస్తూ స్వయం ఉపాధి పొందాలన్నది యామిని కోరిక. అలా పుట్టగొడుగుల పెంపకంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది.

బయో కెమిస్ట్రీలో పీజీ చేసినప్పుడే పుట్టగొడుల సాగు లక్ష్యంగా పెట్టుకుంది యామిని. మెళుకువలు నేర్చుకోవడానికి బెంగుళూరు ఐఐహెచ్ఐర్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకుంది. పైగా ఫైబర్, కాల్షియం వంటి ప్రోటీన్స్‌ పుట్టగొడుగుల్లో అధికంగా ఉండటంతో వైద్యులు దీన్నే రిఫర్ చేస్తున్నారు. అందుకే ఆరోగ్యకరమైన మిల్కీ మష్రూమ్ వెరైటీ ఏపీకే2 విత్తనాలను తీసుకువచ్చి ఇంట్లోనే సాగు చేస్తున్న అంటోంది యామిని. చదువుకుంటూనే స్వయం ఉపాధిగా పుట్టగొడుగులను పెంచుతోంది. తద్వారా మరికొంత మంది మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. ఉద్యోగం చేస్తూ వేరొకరి కోసం ఇబ్బందులు పడేకంటే, వ్యాపారం చేస్తూ అత్మగౌరవంతో బతకడం మేలంటోంది ఈ ఔత్సాహికురాలు.

వ్యాపారం మెుదలు పెట్టిన తొలినాళ్లలో ఇబ్బందులు : ఇంట్లోనే పుట్టగొడుగులను పెంచడం వల్ల అధిక సమయం కేటాయిస్తున్నామని, అందుకు కుటుంబసభ్యుల సహకారం అందుతోందని చెబుతోంది యామిని. వ్యాపారం మెుదలు పెట్టిన తొలినాళ్లలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది యామిని. క్రమంగా మెళుకువలు నేర్చుకుని సాగుపై పట్టు సంపాదించింది. మంచి ఆదాయం అందుకుంది. ప్రస్తుతం మిల్కి మష్రూమ్ పుట్టగొడుగులకు మార్కెట్‌లో కిలో400 నుంచి 450 రూపాయల వరకు ధర పలుకుతోందని చెబుతోంది. హైదరాబాద్‌, బెంగళూరు మహా నగరాలకు ఎగుమతి చేస్తూ అధిక లాభాలు పొందుతోంది.

మార్కెట్​లో డిమాండ్‌ ఉన్న తెలుగు రాష్ట్రాల్లో పుట్టగొడుల పెంపకం పెద్దగా లేదంటున్నాడు యామిని భర్త చందు. తమని చూసి చాలా మంది ముందుకు వస్తున్నారని, అయితే యూట్యూబ్​లో చూసి సాగు ప్రయత్నాలు చేస్తే విఫలం అవుతారని అంటున్నాడు. ఉన్నత చదువు చదువుకుని ఎందుకమ్మ నీకు ఇదంతా అన్నారు. కానీ పట్టుదల, భర్త ప్రోత్సాహంతో ముందుకు వెళ్లింది యామిని. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల నుంచి మంచి ఆదరణ వస్తోంది. ఆర్గానిక్‌ పుట్టగొడుగుల వ్యాపారం మరింత విస్తరించాలన్నదే లక్ష్యమని, దేశంలోని ప్రధాన నగరాలతో పాటు విదేశాలకూ ఎగుమతి చేయాలనుకుంటున్నట్లు యామిని చెబుతోంది.

'పీజీలో బయో కెమిస్ట్రీ చేశా. ఇదంతా సబ్జెక్టులో ఉంది. దీంతో దీనిపై నాకు అవగాహన వచ్చింది. నా భర్త సపోర్ట్​తో వ్యాపారం మొదలు పెట్టాను. నా లాగా ఇంట్లో ఉన్న మహిళలకు కూడా స్వయం ఉపాధి కల్పించవచ్చని అనుకున్నాను. ఎక్కడో ఉద్యోగం చేసే దానికంటే మనమే స్వయం ఉపాధి చేసుకుంటే మంచిది'- యామిని , పుట్టగొడుగుల పెంపకందారు

YUVA - తొలి సినిమాతోనే మెప్పించిన యువ దర్శకుడు - 12 ఏళ్ల తర్వాత కలను సాకారం చేసుకున్న మెదక్ కుర్రాడు - Yuva on Movie Director Prashanth Reddy

YUVA : పేదింటి పెన్సిల్​ ఆర్టిస్టు - డ్రాయింగ్‌తో చిత్రాలకు ప్రాణం పోస్తున్న యువకుడు - pencil artist ganesh

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.