ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు - ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు - గణతంత్ర దినోత్సవ వేడుకలు

75th Republic Day Celebrations In AP: 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో జాతీయ జెండా ఠీవిగా ఎగిరింది. సైనికులు చేసిన సాహస కృత్యాలు ఒళ్లు గగుర్పాటుకు గురి చేశాయి. గణతంత్ర దినోత్సవంలో ప్రభుత్వ శకటాలతో పాటు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

75th Republic Day Celebrations In AP
75th Republic Day Celebrations In AP
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 26, 2024, 10:24 PM IST

75th Republic Day Celebrations In AP: రాష్ట్రమంతా గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది. మువ్వన్నెల జాతీయ జెండా రెపరెపలతో ఊరూవాడా మురిసింది. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో త్రివర్ణ పతాకం ఠీవిగా ఎగిరింది. 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. రాజ్యాంగ రూపకల్పనకు పాటుపడిన మహనీయుల సేవలను, కృషిని స్మరించుకున్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో 400 మీటర్ల జాతీయ జెండా ప్రదర్శన ఆకట్టుకుంది. విజయనగరం పోలీస్ పరేడ్ మైదానంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో వివిధ శాఖల ఆధ్వర్యంలో శకటాల ప్రదర్శన జరిగింది. కాకినాడ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో కలెక్టర్ కృతికా శుక్లా త్రివర్ణ పతకాన్ని ఆవిష్కరించారు. విద్యార్థుల సాంస్కృతి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

బైక్​లపై మహిళ సైనికుల ప్రదర్శన అదుర్స్​- నారీమణుల పరేడ్​ ఫొటోలు చూశారా?

Flag Hostings In All Districts: ఏలూరు జిల్లా భోగాపురంలో 235 అడుగుల ఎత్తైన భారీ జాతీయ జెండా ఆవిష్కరణ జరిగింది. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాల్లో గణతంత్ర దిన వేడుకలు ఘనంగా జరిగాయి. కర్నూలు పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని జిల్లా కలెక్టర్ సృజన ఆవిష్కరించారు. నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.కడప పోలీసు పరేడ్ మైదానంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవంలో ప్రభుత్వ శకటాలతో పాటు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనంలోనూ వేడుకలు ఘనంగా జరిగాయి. తితిదే ఈఓ ధర్మారెడ్డి జాతీయపతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. అనంతపురం జిల్లా శింగనమల మండలంలోని సంజీవరెడ్డి విద్యానికేతన్ పాఠశాలలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ప్రపంచ రికార్డు సాధనకు చిన్నారుల యత్నం - మువ్వన్నెల జెండాతో ఏకధాటిగా స్కేటింగ్

Flag Hosting in Ananthapur: అనంతపురం జిల్లా శింగనమల మండలంలోని చిన్నమట్లగొందిలో సంజీవరాయ విద్యానికేతన్ పాఠశాలలో 75వ గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆనాటి మహనీయుల ఫలితంగానే నేడు గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని ఉపాధ్యాయిలు పేర్కొన్నారు

చిరంజీవికి పద్మ విభూషణ్‌ - అల్లు అర్జున్‌, రామ్​చరణ్​ ఏమన్నారంటే?

Flag Hosting in Prakasam District: ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ జెండా ఆవిష్కరించారు. సత్యసాయి జిల్లా కలెక్టర్‌ అరుణ్‌ బాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం అందుకున్నారు. కార్యక్రమాల్లో పలువురు రాజకీయ నాయకులు పాల్గొని గణతంత్ర వేడుకల్ని తిలకించారు. విద్యార్థులు, కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.నెల్లూరు పోలీస్‌ పెరేడ్‌ మైదానంలో జిల్లా కలెక్టర్‌ హరినారాయణ్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. S.P. తిరుమలేశ్వరరెడ్డితో కలసి పరేడ్‌ను వీక్షించారు. కలెక్టర్‌ కార్యాలయంలో జాయింట్‌ కలెక్టర్ కూర్మనాథ్‌ జాతీయ పతాకానికి వందనం చేశారు.

ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు- జెండా ఆవిష్కరించిన గవర్నర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.