Telangana DSc Exam 2024 Applications : వచ్చే నెల 17వ తేదీ నుంచి ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు 2,79,956 మంది దరఖాస్తులు చేసుకున్నారు. అంటే ఒక్కో పోస్టుకు సుమారు 25 మంది పోటీ పడుతున్నారు. మొత్తం 11,062 పోస్టుల భర్తీకి విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. డీఈడీ, బీఈడీ పూర్తి చేసి టెట్ ఉత్తీర్ణులైన వారు సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ), స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) రెండు పోస్టులకు దరఖాస్తు చేస్తారు. అలాగే బీఈడీ పూర్తి చేసి టెట్ పాసైన వారు ఎస్ఏలోనే రెండు సబ్జెక్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దీని ప్రకారం డీఎస్సీకి పోటీపడే అభ్యర్థుల సంఖ్య 2 లక్షల వరకే ఉంటుందని విద్యాశాఖ అంచనా వేసింది. అత్యధికంగా హైదరాబాద్ జిల్లా నుంచి 27,027 ఆ తర్వాత నల్గొండ నుంచి 15,610 దరఖాస్తులు వచ్చాయి. నాన్‌లోకల్ కోటా(ఐదు శాతం) కింద ఇతర జిల్లాల వారు సైతం హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. దీంతో అక్కడ అధికంగా దరఖాస్తులు అందాయని భావిస్తున్నారు.
మేడ్చల్ జిల్లాలో అతి తక్కువగా 2,265 దరఖాస్తులు వచ్చాయి. దీని తర్వాత జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి 2,828 దరఖాస్తులు అందాయని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన వెల్లడించారు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశంతో 23,919 మంది ఫీజు చెల్లించకుండానే దరఖాస్తు చేశారు.
తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల - రిజల్ట్స్ ఇలా చెక్ చేస్కోండి - TELANGANA TET RESULTS RELEASED 2024
త్వరలో డీఎస్సీ అనుబంధ నోటిఫికేషన్ - లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు జారీ!