ETV Bharat / state

నెల్లూరులో విజృంభిస్తున్న డయేరియా- పదుల సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరిక - 21 students affected by diarrhea

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 25, 2024, 8:18 PM IST

Updated : Jun 25, 2024, 10:50 PM IST

21 Students Affected by Diarrhea in Nellore District : నెల్లూరు జిల్లాలో డయేరియా బారినపడుతున్న రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. తాజాగా గూడూరు మండలంలోని ఓ హస్టల్ విద్యార్ధులు డయేరియా బారినపడ్డారు. వాంతులు, విరోచనాలతో నెల్లూరు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులల్లో చికిత్స పొందుతున్నారు.

21 Students Affected by Diarrhea in Nellore District
21 Students Affected by Diarrhea in Nellore District (ETV Bharat)

21 Students Affected by Diarrhea in Nellore District : నెల్లూరు జిల్లాలో డయేరియా బారినపడుతున్న రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. తాజాగా గూడూరు మండలం చెన్నూరు గిరిజన గృహంలో 21 మంది విద్యార్ధులు డయేరియా బారినపడ్డారు. వాంతులు, విరోచనాలతో నెల్లూరు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులల్లో చికిత్స పొందుతున్నారు. హాస్టల్​లో విద్యార్థులకు శుద్ధి చేసిన నీరు, నాణ్యమైన భోజనం అందించాలని ప్రభుత్వం ఆదేశించినా అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. తాగునీటి వల్ల డయేరియా వ్యాపించిందా, విషపూరిత ఆహారం వల్ల విద్యార్ధులు అనారోగ్య పాలయ్యారా అనే విషయం ఇంతవరకు వెల్లడి కాలేదు. అయితే తాగునీరు కలుషితంతోనే తమ పిల్లలు డయేరియా బారినపడ్డారని తల్లిదండ్రులు చెబుతున్నారు.

పవన్ ఆదేశాలతో అధికారుల్లో కదలిక - డయేరియా నివారణపై చర్యలు - Diarrhea Prevention Measures

జిల్లాలో పల్లెలతో పాటు పట్టణాల్లో తాగునీరు కలుషితం అవుతున్నా పట్టించుకునే వారు కరవయ్యారు. అయిదేళ్ల వైసీపీ పాలనలో నీటి పథకాల నిర్వహణకు సరిగా నిధులు విదల్చలేదు. ట్యాంకుల శుభ్రత, పైపులైన్ల మరమ్మతులను గాలికొదిలేసింది. చాలాచోట్ల పైపులు మురుగు కాలువల్లోనే ఉన్నాయి. ఫలితంగా తాగునీరు కలుషితమై జనం డయేరియా బారిన పడుతున్నారు. డయేరియా ప్రబలేందుకు ప్రధాన కారణం అపరిశుభ్రత, అధ్వాన పారిశుద్ధ్యం.

నెల్లూరునగరం, పట్టణాలు, గ్రామాల్లో పైపులైన్ల లీకేజీలు, గొట్టాల్లోకి మురుగు చేరడం వల్ల తాగునీరు కలుషితమవుతోందని ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. నీరు రంగుమారడంతో పాటు దుర్వాసన వస్తోందని వాపోతున్నారు. తాగునీటిని శుద్ధి చేయకుండానే కుళాయిల ద్వారా సరఫరా చేస్తూ ప్రజారోగ్యంతో యంత్రాంగం చెలగాటమాడుతోంది. పైపులైన్లు, కుళాయిలు, ఇతరత్రా మరమ్మతులు చేపట్టాల్సి ఉండగా నిర్లక్ష్యం వ్యవహరించడం ప్రజలకు శాపంగా మారుతోంది. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొన్నా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టడాన్ని అధికారులు విస్మరించారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కొమ్మనపల్లిలో ప్రబలిన అతిసారం - ఒకరు మృతి, 50 మందికి అస్వస్థత - Woman Dead Diarrhea in Kommanapalli

"ఒకవైపు ప్రభుత్వం శుద్ధి చేసిన నీటిని, నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందించాలని ఆదేశాలిచ్చిన అధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. జిల్లాలో అధిక సంఖ్యలో డయేరియా కేసులు వెలుగులోకి వస్తున్న అధికారులు ఇంకా క్షేత్రస్థాయిలో పనిచేయటం లేదు. చెన్నూరు హాస్టల్​లో 21 మంది విద్యార్థులు డయేరియా బారినపడ్డామే ఇందుకు నిదర్శనం. విధినిర్వాహణలో నిర్లక్ష్యం వహించిన అధికారులను వెంటనే సస్పెండే చేయాలి." -పెంచలయ్య, యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

గత ప్రభుత్వ హయాంలో పంచాయతీ నిధులు దారి మళ్లించడంతో పారిశుద్ధ్య పనులు కష్టమయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లోని నీళ్ల ట్యాంకులను శుభ్రం చేసిన దాఖలాల్లేవు. వాటిలో చెత్తాచెదారం, వ్యర్థాలు పేరుకుపోయి తాగునీరు దుర్వాసన వస్తోందని, కుళాయిల్లో మలినాలు వస్తున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్యాంకుల నుంచి సరఫరా అయిన కలుషిత నీటిని తాగడం వల్లే అతిసారం ప్రబలుతోందని ప్రజలు చెబుతున్నారు.

గత ప్రభుత్వం విధానాలతోనే డయేరియా వ్యాప్తి- ఆర్ధిక సంఘం నిధులను దుర్వినియోగం వల్లే ఈ దుస్థితి: మంత్రి సత్యకుమార్​

Last Updated : Jun 25, 2024, 10:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.