ETV Bharat / sports

అప్పుడే జూనియర్ కోహ్లీ 'అకాయ్' రికార్డ్​ - పాకిస్థాన్‌లో ఫ్యాన్స్​ సంబరాలు!

Virat Kohli Son Celebrations : విరాట్ కోహ్లీ - అనుష్క దంపతులకు అబ్బాయి పుట్టిన సంగతి తెలిసిందే. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న విరాట్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. స్వీట్లు పంచుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

జూనియర్
జూనియర్
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 21, 2024, 11:49 AM IST

Virat Kohli Son Celebrations : టీమ్​ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి - హీరోయిన్ అనుష్క శర్మ దంపతులు మరో బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 15న అనుష్క శర్మ పండింటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని కోహ్లీ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. అతడికి అకాయ్ (Akaay) అని నామకరణం చేసినట్లు తెలిపారు. అయితే జూనియర్ విరాట్ అప్పుడే ఓ రికార్డును ఖాతాలో వేసేసుకున్నాడు!

ఆసియాలోనే అత్యంత వేగవంతంగా రికార్డ్ :​ ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లీ అకాయ్​ పుట్టాడంటూ పెట్టిన పోస్ట్ గంటలోనే ఐదు మిలియన్​కు పైగా లైకులను అందుకుంది. ఆసియాలోనే అత్యంత వేగంగా ఎక్కువగా లైకులను అందుకున్న పోస్ట్‌గా ఇది రికార్డు సృష్టించింది. దీంతో జూనియర్ కోహ్లి కూడా అప్పుడే రికార్డులను వేటాడం మొదలుపెట్టాడని విరాట్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తూ సంబరపడుతున్నారు. ప్రస్తుతానికి 'అకాయ్' పోస్ట్‌ను సుమారు ఎనిమిది మిలియన్లకుపైగా లైక్స్​ను అందుకుంది.

కాగా, ఈ పోస్ట్​లో ''ఫిబ్రవరి 15న మా అబ్బాయి అకాయ్‌ను ఈ లోకంలోకి స్వాగతించాం. మా జీవితంలోనే మధురమైన ఈ సమయంలో మీ ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటున్నాం. మా వ్యక్తిగత గోప్యతను గౌరవించండి' అంటూ జూనియర్ కోహ్లీ గురించి విరాట్ ఇన్‌‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. ఈ పోస్టే నెట్టింట్లో రికార్డు క్రియేట్ చేసింది.

పాకిస్థాన్​లో సంబరాలు : కోహ్లీ రెండో సారి తండ్రి అయ్యాడని తెలియడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్నఅతడి అభిమానుల సంబరాలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా కోహ్లీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే దాయాది దేశం పాకిస్థాన్‌లోనూ ఉన్న విరాట్​ అభిమానులు కొందరు స్వీట్స్ పంచుతూ సెలబ్రేషన్స్ చేసుకోవడం విశేషం. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

మరోవైపు అకాయ్ పేరుకు అర్థం గురించి కూడా సోషల్ మీడియాలో అభిమానులు తెగ సెర్చ్​ చేస్తున్నారు. సంస్కృతంలో అకాయ్ అంటే 'అమరుడు', 'చిరంజీవుడు' అనే అర్థం వస్తుంది. హిందీలో 'కాయ్‌' అంటే శరీరమని, 'అకాయ్‌' అంటే భౌతిక శరీరానికి మించినవాడు అని అంటున్నారు. మరోవైపు టర్కీ భాషలో ఈ పదానికి 'ప్రకాశిస్తున్న చంద్రుడు' అనే అర్థం కూడా వస్తుంది. కాగా, గతంలో కోహ్లి-అనుష్క తమ కుమార్తె వామికకు దుర్గాదేవి అని అర్థం వచ్చేలా 'వామిక' అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే.

అకాయ్‌ : కోహ్లీ - అనుష్క కొడుకు పేరుకు అర్థమేంటో తెలుసా?

మరోసారి తండ్రైన విరాట్- బాబు పేరేంటో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.