Virat Kohli ICC Awards: టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసి ఆదివారానికి 16ఏళ్లు పూర్తైంది. 2008 ఆగస్టు 18న శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌తో విరాట్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అంతే ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. క్రికెట్ ప్రపంచంలోనే రన్ మెషీన్‌గా పేరుతెచ్చుకొని టన్నుల కొద్ది పరుగులు సాధించి టీమ్ఇండియాకు అనేక చిరస్మరణీయ విజయాలు అందించాడు.
వన్డే, టీ20, టెస్టు ఇలా ఫార్మాట్‌తో సంబంధం లేకుండా, ప్రత్యర్థి ఎవరైనా సరే సెంచరీ బాదడమే తన లక్ష్యంగా బరిలోకి దిగే విరాట్ 16ఏళ్లలో అనేక రికార్డులను తుడిచిపెట్టాడు. ఈ క్రమంలోనే వన్డేల్లో క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ సెంచరీల (49)ను అధిగమించిన విరాట్ (50) సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ రికార్డులతోపాటు విరాట్ ప్రతిష్ఠాత్మకమైన ఐసీసీ అవార్డులను సైతం దక్కించుకున్నాడు. మరి తన కెరీర్లో దక్కించుకున్న ఐసీసీ అవార్డులేంటో చూద్దాం.
Levels, not just vibes. ❤️🔥
— Royal Challengers Bengaluru (@RCBTweets) August 18, 2024
Pure main character energy and the silverwares speak for themselves. 🫡#PlayBold #ViratKohli #16YearsOfViratKohli pic.twitter.com/HsF34ORSeA
ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్: ఈ ప్రతిష్ఠాత్మకమైన అవార్డును విరాట్ ఇప్పటివరకు నాలుగుసార్లు అందుకున్నాడు. 2012, 2017, 2018, 2023 సంవత్సరాల్లో విరాట్ ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచాడు.
ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్: విరాట్ 2017, 2018 వరుస సంవత్సరాల్లో ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచాడు. ఈ రెండు సంవత్సరాల్లో మూడు ఫార్మాట్లలో రాణించిన విరాట్ ఈ అత్యున్నత అవార్డు దక్కించుకున్నాడు.
ఐసీసీ టెస్టు ప్లేయర్ ఆఫ్ ది ఇయర్: సుదీర్ఘ ఓవర్ల క్రికెట్లోనూ విరాట్ తన మార్క్ చూపించుకున్నాడు. ఈ క్రమంలోనే కోహ్లీ 2018లో టెస్టు ప్లేయర్ ఆఫ్ ది అవార్డు అందుకున్నాడు. ఆ ఏడాది విరాట్ కెప్టెన్సీ, బ్యాటింగ్‌కు గాను ఈ అవార్డు దక్కింది.
ఐసీసీ స్పిరిట్ ఆఫ్ ది క్రికెట్ అవార్డ్: పరుగుల వరద పారించడంలోనే కాదు మైదానంలో స్పోర్ట్స్‌మెన్ షిప్ ప్రదర్శించడంలోనూ విరాట్ కోహ్లీకి సాటిలేదు. 2019 వరల్డ్‌కప్‌లో మ్యాచ్ సందర్భంగా స్టేడియంలోని ప్రేక్షకులు ఆసీస్ బ్యాటర్ స్టీవ్ స్మిత్‌ను గేలి చేస్తుండంగా అలా చేయవద్దని విరాట్ ఆడియెన్స్‌ని వారించాడు. దీంతో అతడి గేమ్ స్పిరిట్కుగాను అదే ఏడాది ఐసీసీ స్పిరిట్ ఆఫ్ ది క్రికెట్ అవార్డ్ దక్కించుకున్నాడు.
ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది డికేడ్: 2011-2020 మధ్య కాలం ఓ దశాబ్దంపాటు క్రికెట్లో విరాట్ తనదైన ముద్ర వేశాడు. ఈ పదేళ్ల కాలంలో టీమ్ఇండియాకు అనేక విజయాలు అందించాడు. దశాబ్దంపాటు క్రికెట్లో రాణించిన విరాట్ క్రికెటర్ ఆఫ్ ది డికేడ్ అవార్డు సొంతం చేసుకున్నాడు.
ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్: తన నిలకడైన ప్రదర్శనతో విరాట్ పలుమార్లు వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ జట్టులో చోటు సాధించాడు.
ఐసీసీ టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్: 2017 టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్ జట్టులో విరాట్ స్థానం దక్కించుకున్నాడు.
Gautam Gambhir talking about Virat Kohli.
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 18, 2024
- The GOAT completes 16 years! 🐐pic.twitter.com/DoU0FNKUpi
Levels, not just vibes. ❤️🔥
— Royal Challengers Bengaluru (@RCBTweets) August 18, 2024
Pure main character energy and the silverwares speak for themselves. 🫡#PlayBold #ViratKohli #16YearsOfViratKohli pic.twitter.com/HsF34ORSeA
'మునుపటికి ఇప్పటికీ తేడా ఉంది - అతడు చాలా పరిణితి చెందాడు' - Virat Kohli Amit Mishra Issue