USA vs Canada T20 World Cup: 2024 టీ20 వరల్డ్‌కప్ తొలి మ్యాచే క్రికెట్ ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చింది. యూఎస్ఏ- కెనడా మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్ క్రీడాప్రియులకు మజానిచ్చింది. ఈ మ్యాచ్‌లో అద్భుతంగా పోరాడిన అమెరికా (యూఎస్ఏ) 7 వికెట్ల తేడాతో విజయం సాధించి బోణీ కొట్టింది. కెనడా నిర్దేశించిన 195 పరుగుల భారీ టార్గెట్‌ను అమెరికా 17.4 ఓవర్లలోనే కేవలం 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
29ఏళ్ల అరోన్ జోన్స్ మెరుపు ఇన్నింగ్స్ (94 పరుగులు; 40 బంతుల్లో: 4x4, 10x6)తో జట్టుకు అలవోకగా విజయాన్ని అందించాడు. ఈ క్రమంలో జోన్స్ పలు రికార్డులు బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో జోన్స్ 94 పరుగులు చేశాడు. ఛేజింగ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన నాన్ ఓపెనర్‌గా జోన్స్ రికార్డు నెలకొల్పాడు. ఇక అత్యధిక సిక్సర్లు బాదిన నాన్ ఓపెనర్ రికార్డునూ జోన్స్ తనపేరిట లిఖించుకున్నాడు.
ఈ రికార్డు ఇదివరకు సౌతాఫ్రికా ప్లేయర్ రెలీ రొస్సో (8) పేరిట ఉండేది. ఇక టీ20 వరల్డ్‌కప్ ఇన్నింగ్స్‌లో ఓవరాల్‌గా అత్యధిక సిక్స్‌లు బాదిన రెండో ప్లేయర్‌గా నిలిచాడు. ఈ లిస్ట్‌లో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ (11) టాప్‌లో ఉన్నాడు. గేల్ తర్వాత 10 సిక్స్‌లతో జోన్స్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. వీళ్ల తర్వాత రోసో (8), యువరాజ్ సింగ్ (7), డేవిడ్ వార్నర్ (7) ఉన్నారు.
మ్యాచ్ అనంతరం తన మెరుపు ఇన్నింగ్స్ గురించి జోన్స్ మాట్లాడాడు. తమ జట్టు ఒత్తిడిలో ఉండడమే తనను అత్యుత్తమంగా రాణించేలా చేస్తుందని అన్నాడు. 'ఈ విజయం గురించి మాటల్లో చెప్పలేను. మా జట్టు గెలవడం సంతోషంగా ఉంది. 200 పరుగుల కంటే తక్కువ టార్గెట్ కచ్చితంగా ఛేజ్ చేయవచ్చని నేను నమ్ముతా. మేము ఈ టోర్నీలో అగ్రెసివ్ క్రికెట్ ఆడాలనుకున్నాం. అందుకు తగ్గట్లుగానే ప్రాక్టీస్ చేశాం. ఇక నిజం చెప్పాలంటే మా జట్టు ఒత్తిడిలో ఉండడమే నన్ను అత్యుత్తమంగా రాణించేలా చేస్తుంది' అని జోన్స్ అన్నాడు.
ఆతిథ్య జట్టు అదరహో - తొలి T20 మ్యాచ్‌లో యూఎస్ గెలుపు - T20 World Cup 2024