ETV Bharat / sports

గవర్నమెంట్ స్కూల్​లో కమిన్స్- పిల్లలతో క్రికెట్- వీడియో చూశారా? - IPL 2024 - IPL 2024

Pat Cummins IPL 2024: సన్​రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలుగు క్రికెట్ అభిమానుల మన్ననలు పొందాడు. తాజాగా అతడు హైదరాబాద్​లోని ఓ ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి అక్కడి విద్యార్థులతో కాసేపు సరదాగా గడిపాడు.

Pat Cummins IPL 2024
Pat Cummins IPL 2024 (Source: Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : May 17, 2024, 5:03 PM IST

Updated : May 17, 2024, 5:10 PM IST

Pat Cummins IPL 2024: సన్​రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలుగు క్రికెట్ ఫ్యాన్స్​కు రోజు రోజుకు దగ్గరవుతున్నాడు. ప్రస్తుత సీజన్​లో జట్టును విజయవంతంగా నడిపిస్తూ, అభిమానుల మన్ననలు పొందుతున్న కమిన్స్​ తాజాగా మరోసారి అందరి మనసు దోచేశాడు. కమిన్స్​ హైదరాబాద్​లో శుక్రవారం ఓ ప్రభుత్వ పాఠశాలకు వెళ్లాడు. అక్కడి విద్యార్థులతో కాసేపు సరదాగా గడిపాడు.

పాఠశాల గ్రౌండ్​లో పిల్లలతో కలిసి కమిన్స్​ క్రికెట్ ఆడాడు. కొంతమంది పిల్లలు కమిన్స్​కు బౌలింగ్ చేశారు. తర్వాత కమిన్స్​ వికెట్ కీపింగ్ చేస్తూ ఆకట్టుకున్నాడు. ఇక తమతో కలిసి కమిన్స్ క్రికెట్ ఆడడం పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్​గా మారింది. పిల్లలతో కలిసి క్రికెట్ ఆడిన కమిన్స్​పై ప్రశంసలు కురిపిస్తున్నారు. 'పిల్లలను అతడికి అప్పగిస్తే, స్కూల్ టోర్నీలు కూడా గెలిపిస్తాడు', 'కమిన్స్ ​లాంటి ఛాంపియన్​తో క్రికెట్ ఆడడం పిల్లలకు ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకం'​ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

2024 ఐపీఎల్​లో ప్యాట్ కమిన్స్​ సారథ్యంలోని సన్​రైజర్స్​ హైదరాబాద్​ జట్టు అదరగొడుతోంది. ఈ సీజన్​లో సన్​రైజర్స్​ ఎలాంటి బెదురు లేకుండా ఆడడానికి కారణం జట్టు కెప్టెన్ కమిన్సే అనడంలో సందేహం లేదు. ఈ సీజన్​లో ఇప్పటివరకు 13మ్యాచ్​లు ఆడగా ఏడింట్లో నెగ్గి, 5 ఓడింది. ఒక మ్యాచ్​ రద్దైంది. దీంతో 15 పాయింట్లతో ఉన్న సన్​రైజర్స్ మూడో స్థానంలో కొనసాగుతోంది. ఆఖరి లీగ్​ మ్యాచ్​లోనూ గెలిస్తే టాప్- 2కు చేరుకుంటుంది. ఇక కమిన్స్ కెప్టెన్సీలో సన్​రైజర్స్ ఈ సీజన్​ ఛాంపియన్​గా నిలుస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

ఇక ప్రస్తుత సీజన్​లో సన్​రైజర్స్ జట్టు ఐపీఎల్​లో అనేక రికార్డులు సృష్టించింది. ఐపీఎల్​లో అత్యధిక టాప్- 2 స్కోర్ (287, 277 పరుగులు) సన్​రైజర్స్​ పేరిటే ఉన్నాయి. మూడుసార్లు 260+ స్కోర్లు నమోదు చేసి ఔరా అనిపించింది. ఈ క్రమంలో సన్​రైజర్స్ ఇప్పటివరకు 13 మ్యాచ్​ల్లో కలిపి 146 సిక్స్​లు బాదింది. సింగిల్ సీజన్​లో ఓ టీమ్ బాదిన అత్యధిక సిక్స్​లు కూడా ఇవే.

రిలాక్స్​ మోడ్​లో కమిన్స్​- గ్యాప్​లో దుబాయ్ ట్రిప్- SRH ఫ్యాన్స్ టెన్షన్! - IPL 2024

58 బంతుల్లోనే 166 ఉఫ్‌ - సన్​రైజర్స్​ ఖాతాలో రికార్డులే రికార్డులు - IPL 2024 LSG VS SRH

Last Updated : May 17, 2024, 5:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.