RCB vs GG WPL 2024: మహిళల ప్రీమియర్ లీగ్ రెండో సీజన్‌లో గుజరాత్ జెయింట్స్ జట్టు ఎట్టకేలకు విజయం నమోదు చేసింది. టోర్నీలో ఆడిన ఐదో మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 19 పరుగుల తేడాతో ఓడించి తొలి విజయాన్ని నమోదు చేసింది. 200 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 180 పరుగులు మాత్రమే చేసింది. జార్జియా వేర్‌హమ్ (48 పరుగులు), రిచా ఘోశ్ (30 పరుగుల) రాణించారు. గుజరాత్ బౌలర్లలో ఆష్లీ గార్డ్నర్ 2, క్యాథ్రిన్ బ్రేస్, తనుజా కన్వర్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో నాలుగు రనౌట్లు నమోదవ్వడం గమనార్హం. భారీ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న గుజరాత్ బ్యాటర్ హెత్ మూనీ (85*)కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
భారీ లక్ష్య ఛేదనలో ఆర్సీబీకి నాలుగో ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఫుల్ ఫామ్‌లో ఉన్న తెలుగమ్మాయి సబ్బినేని మేఘన (4) స్వస్ప స్కోరుకే వెనుదిరిగింది. ఆ తర్వాత కెప్టెన్ స్మృతి మంధాన (24 పరుగులు), ఎల్లీస్ పెర్రీ (24 పరుగులు), సోఫీ డివైన్ (23 పరుగులు) భారీ స్కోర్లు చేయడంలో విఫలమయ్యారు. ఆఖర్లో జార్జియా వేర్‌హమ్ బౌండరీలతో మెరుపులు మెరిపించి, గుజరాత్‌ను కాస్త ఆందోళనకు గురి చేసింది. కానీ, 19 ఓవర్ చివరి బంతికి జార్జియా రనౌట్ కావడం వల్ల గుజరాత్ ఊపిరిపీల్చుకుంది.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు లారా వోల్వార్డ్ట్ (76; 45 బంతుల్లో 13 ఫోర్లు), బెత్ మూనీ (85*; 51 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్) బౌండరీలతో విరుచుకుపడ్డారు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే వోల్వార్డ్ట్, బెత్ మూనీ ఎడాపెడా బౌండరీల వర్షం కురిపించారు. దీంతో ఐదు ఓవర్లకే స్కోరు 54/0కి చేరింది. తర్వాత కూడా వీరి దూకుడు కొనసాగింది. పెర్రీ బౌలింగ్‌లో వోల్వార్డ్ట్ వరుసగా మూడు ఫోర్లు బాది అర్ధ శతకం (32 బంతుల్లో) పూర్తి చేసుకుంది. మూనీ సైతం 32 బంతుల్లోనే 50 పరుగుల మార్కును అందుకుంది. ఆర్సీబీ బౌలర్లలో సోఫియా, జార్జియా వేర్‌హమ్ చెరో వికెట్ పడగొట్టారు.
-
With that 19-run by Gujarat Giants, here's how the Points Table looks after Match 1⃣3⃣ of #TATAWPL 2024 🙌#GGvRCB pic.twitter.com/W4hOGz9olg
— Women's Premier League (WPL) (@wplt20) March 6, 2024
షబ్నిమ్ వరల్డ్ రికార్డ్- మహిళల క్రికెట్లో ఫాస్టెస్ట్ బంతి