Paris Paralympics 2024 : ఫ్యాషన్ నగరి పారిస్‌లో మరో ప్రపంచ క్రీడా సంబరానికి తెరలేసింది. పారాలింపిక్స్ 2024 క్రీడలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. గ్యాలరీలన్నీ క్రీడాభిమానులతో నిండిపోయాయి. ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు క్రీడాభిమానులను బాగా అలరించాయి. ఆకట్టుకునే కళా ప్రదర్శనలు, అబ్బురపరిచే కళాకారుల విన్యాసాలతో ఈ వేడుక కన్నులవిందుగా సాగింది. ఈ వేడుకల్లో దివ్యాంగ క్రీడాకారులే కాకుండా పలువురు దివ్యాంగ కళాకారులు కూడా తమ కళను ప్రదర్శించారు. నేల మీదే కాదు గాల్లోనూ అనేక విన్యాసాలు సాగాయి. ఫ్రాన్స్ జెండాలోని మూడు రంగుల్ని 8 విమానాల ద్వారా విడుదల చేస్తూ ఆకాశంలో చేసిన ఎయిర్ షో వీక్షకుల్ని విశేషంగా కట్టిపడేసింది.
💙🤍❤️#Paralympics pic.twitter.com/NI3X4c0P09
— Paralympic Games (@Paralympics) August 28, 2024
అయితే ఈ కార్యక్రమాన్ని కూడా స్టేడియంలో కాకుండా బయటే నిర్వహించారు. రీసెంట్గా పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవాన్ని సెన్ నదిలో నిర్వహించగా, ఇప్పుడు పారాలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకలను కూడా తొలిసారి బహిరంగ ప్రదేశంలో డిలా కాంకార్డ్ వేదికగా నిర్వహించారు. అథ్లెట్ల పరేడ్‌ను ఛాంప్స్ ఎలీసీస్ నుంచి ప్లేస్ డిలా కాంకార్డ్ వరకు సాగింది.
టోక్యో పారాలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ విన్నర్ సుమిత్ ఆంటిల్(జావెలిన్ త్రో), ఆసియా పారా క్రీడల్లో సిల్వర్ మెడల్ విన్నర్ భాగ్యశ్రీ జాదవ్ (షాట్‌పుట్) భారత పతాకధారులుగా వ్యవహరించారు.
11 రోజుల పాటు ఈ పారిస్ పారాలింపిక్స్ సాగనుంది. సెప్టెంబరు 8న ముగింపు వేడుకలు నిర్వహిస్తారు. 22 క్రీడల్లో 4 వేల మందికి పైగా పారా వీరులు పోటీ పడుతున్నారు. భారత్ నుంచి 84 మంది అథ్లెట్లు బరిలో దిగారు. తొలిరోజు ట్రాక్ సైక్లింగ్, టేబుల్ టెన్నిస్, తైక్వాండో, పతకాంశాలు జరుగబోతున్నాయి. ఇప్పటికే ఈ పారాలింపిక్స్ కోసం 20 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయట.
What a moment for Nantenin Keita, Charles-Antoine Kouakou, Fabien Lamirault, Elodie Lorandi and Alexis Hanquiquant 🔥#Paralympics pic.twitter.com/vW7zMlIQ9y
— Paralympic Games (@Paralympics) August 28, 2024
ప్రస్తుతం పారిస్‌లో జరుగుతున్నది 17వ పారాలింపిక్స్ కావడం విశేషం. 1960లో మొదటి పారాలింపిక్స్‌ను ఇక్కడ నిర్వహించారు. పారాలింపిక్స్‌ల్లో భారత్‌కు ఇప్పటివరకు 31 పతకాలు వచ్చాయి. అత్యధికంగా అథ్లెటిక్స్‌లో 18 వచ్చాయి. అందులో నాలుగు స్వర్ణాలు, తొమ్మిది రజతాలు, 5 కాంస్యాలు ఉన్నాయి.
ఈ మెగా వేడుకలకో మార్షల్ ఆర్ట్స్ లెజెండ్, స్టార్ యాక్టర్ జాకీ చాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయన పారాలింపిక్స్ జ్యోతితో కనిపించి సందడి చేశారు. ఇంకా ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మెక్రాన్, చెక్ రిపబ్లిక్ అధ్యక్షుడు పీటర్ పావెల్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, జర్మనీ ప్రెసిడెంట్ ఫ్రాంక్ వాల్టర్ స్టెయిన్‌మీర్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
140 కోట్ల భారతీయుల ఆకాంక్ష - ఈ పారాలింపిక్స్ సందర్భంగా భారత పారా అథ్లెట్లను ప్రోత్సాహించేలా మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోదీ. వారికి అభినందనలు తెలిపారు. ‘మన అథ్లెట్లు ఉత్తమ ప్రదర్శన చేయాలని, ఇది 140 కోట్ల భారతీయులు ఆకాంక్ష అని అన్నారు. ప్రతి ఒక్క అథ్లెట్ ధైర్యం, సంకల్పం మన దేశానికి స్ఫూర్తి వనరు అని పేర్కొన్నారు.
Yes, that is a car covered in Phryges driving through the streets of Paris.
— Paralympic Games (@Paralympics) August 28, 2024
Here's a closer look 👀
📸: Maja Hitij | Getty Images pic.twitter.com/rG3ScgNqFX
పారిస్‌లో మళ్లీ పండగ షురూ - 168 దేశాలు, 4400 మంది అథ్లెట్లతో! - Paris Paralympics 2024
ఫాదర్ ఆఫ్ సౌత్ ఇండియన్ క్రికెట్ ఎవరో తెలుసా? - Buchi Babu Cricket Tournament