ETV Bharat / sports

'ఆ రోజు వినేశ్ ఫొగాట్​ చనిపోతుందని అనుకున్నా!'- కోచ్ సంచలన వ్యాఖ్యలు - Vinesh Phogat Olympics - VINESH PHOGAT OLYMPICS

Vinesh Phogat Paris Olympics: ఒలింపింక్స్​లో ఫైనల్​కు ముందు బరువు తగ్గే ప్రక్రియలో వినేశ్ చేసిన సాధనల గురించి ఆమె కోచ్ చెప్పారు. ఓ దశలో ఆమె చనిపోతుందేమోనని తాను భయపడినట్లు పేర్కొన్నారు.

Vinesh Phogat
Vinesh Phogat (Source: ANI)
author img

By ETV Bharat Sports Team

Published : Aug 16, 2024, 2:40 PM IST

Vinesh Phogat Paris Olympics : పారిస్ ఒలింపిక్స్‌లో అనర్హతకు గురైన వినేశ్‌ ఫొగాట్ ఫైనల్​​ ముందు రోజు రాత్రి బరువు తగ్గించేందుకు చేసిన ప్రయత్నాల గురించి ఆమె కోచ్ వోలర్ అకోస్ చెప్పారు. బరువు తగ్గించే ప్రక్రియలో ఆమె తీవ్రంగా శ్రమించిందని చెప్పిన అకోస్, ఓ దశలో ఆమె ప్రాణాల గురించి భయపడ్డామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వినేశ్ బరువు తగ్గించే ప్రక్రియలో ఆ రోజు టీమ్​లోని ప్రతి సభ్యుడు ప్రయత్నించారని చెప్పుకొచ్చారు.

'వినేశ్ సెమీఫైనల్ తర్వాత 2.7 కిలోల బరువు ఎక్కువగా ఉంది. దీంతో మేం బరువు తగ్గే ప్రక్రియ ప్రారంభించాం. తొలుత 1 గంట 20 నిమిషాలు వ్యాయామం చేయించాం. అప్పుడు 1.2కేజీలు తగ్గింది. అప్పటికీ ఇంకా 1.5కేజీలు అదనంగా ఉంది. ఇక 50 నిమిషాల ఆవిరి స్నానం తర్వాత ఆమె శరీరంపై చెమట చుక్క కూడా కనిపించలేదు. అర్ధరాత్రి నుంచి ఉదయం 5:30 దాకా ఆమె వేర్వేరు సాధనలు చేసింది. దీంతో ఓపిక క్షీణించి ఆమె కింద పడిపోయింది. అయినప్పటికీ మళ్లీ ఆమెను పైకి లేపి సాధన చేయించాం. కానీ, ఆ సమయంలో తన ప్రాణాలకు ప్రమాదం జరుగుతుందేమో అనిపించింది' అని అకోస్ తన హంగేరీ భాషలో ట్వీట్​లో రాసుకొచ్చాడు. అయితే తర్వాత అకోస్ ఆ ట్వీట్​ను డిలీట్ చేశారు.

అయితే ఆ రాత్రి హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ గురించి కూడా అకోస్ వివరించారు. 'కోచ్ మీరెం బాధపడకండి. నేను వరల్డ్​ నెం.1 రెజ్లర్​ (సుసాకీ)ని ఓడించాను. ఈ గెలుపుతో నా లక్ష్యాన్ని సాధించినట్లే. ప్రపంచంలో అత్యత్తమ రెజ్లర్​గా నన్ను నేను నిరూపించుకున్నాను. పతకాలు కేవలం వస్తువులే. ప్రదర్శన ఎప్పటికీ నిలిచిపోతుంది' అని వినేశ్ తనతో చెప్పినట్లు తెలిపారు.

కాగా, తనపై అనర్హతను సవాల్ చేస్తూ వినేశ్ కోర్టు ఆఫ్‌ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (కాస్)ను ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన కాస్ రీసెంట్​గా ఆమె అప్పీలును తిరస్కరించింది. దీంతో ఆమెకు నిరాశే మిలిగింది.

వినేశ్ తీర్పుపై 'వాయిదాల మీద వాయిదాలు'- నెటిజన్లు ఫైర్! - Paris Olympics 2024

వినేశ్ ఫొగాట్ అప్పీల్‌పై తీర్పు వాయిదా - Vinesh Phogat Paris Olympics 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.