ETV Bharat / sports

గోల్డ్​ విన్నర్​ అర్షద్​ నదీమ్‌కు జాక్‌పాట్‌ - బంగారు కిరీటంతో సత్కారం, రూ.5 కోట్లు ప్రైజ్‌మనీ - Paris Olympics 2024 Arshad Nadeem - PARIS OLYMPICS 2024 ARSHAD NADEEM

Paris Olympics 2024 Arshad Nadeem Prize Money : పారిస్ ఒలింపిక్స్‌లో జావెలిన్‌ త్రోలో గోల్ట్ మెడల్ సాధించిన పాకిస్థాన్‌ అథ్లెట్‌ అర్షద్‌ నదీమ్‌ పై ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. అతడికి స్వదేశానికి చేరుకోగానే గ్రాండ్ వెల్ కమ్ చెప్పేందుకు పాక్ సిద్ధమవుతోంది. మరోవైపు, అర్షద్‌కు పాక్ సర్కార్ భారీగా రివార్డును ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఎంతో తెలుసా?

source Associated Press
Paris Olympics 2024 Arshad Nadeem (source Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Aug 10, 2024, 9:19 PM IST

Paris Olympics 2024 Arshad Nadeem Prize Money : పాకిస్థాన్​ అథ్లెట్​ అర్షద్​ నదీమ్ పారిస్ ఒలింపిక్స్​ జావెలిన్ త్రో గోల్డ్ మెడల్ సాధించి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఫైనల్​లో ఏకంగా 92.97 మీటర్ల దూరం ఈటెను విసిరి పసిడిని ముద్దాడ్డాడు. దీంతో ఒలింపిక్స్‌లో పాకిస్థాన్ 40 ఏళ్ల స్వర్ణ పతకం నిరీక్షణకు తెరదించాడు. దీంతో అర్షద్​ నదీమ్‌పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. అలాగే అర్షద్ ను పాక్ క్రికెటర్లు, సెలబ్రిటీలు అభినందిస్తున్నారు. ఇదే సమయంలో అర్షద్‌కు పాక్ ప్రభుత్వం భారీ నజరానా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఎంతంటే?

రివార్డుల వెల్లువ - పారిస్ ఒలింపిక్స్ గోల్ట్ మెడల్ విజేత అర్షద్‌ను పాక్‌ ప్రభుత్వం ఘనంగా సత్కరించేందుకు సిద్ధమవుతోందని తెలుస్తోంది. ఇందులో భాగంగా అతడికి భారీగా రివార్డులు, అవార్డులను ప్రకటించనున్నారట. నదీమ్‌కు 150 మిలియన్‌ పాకిస్థాన్‌ రూపాయల (రూ.4.5 కోట్లు) కన్నా ఎక్కువ మొత్తం అందుకోనున్నట్లు సమాచారం.

ఇందులో సింధ్‌ ముఖ్యమంత్రి ప్రకటించిన 50 మిలియన్‌ పాకిస్థాన్ రూపాయలు, పంజాబ్‌ ముఖ్యమంత్రి మరియం నవాజ్‌ ప్రకటించిన PKR 100 మిలియన్లు, పంజాబ్‌ గవర్నర్‌ సర్దార్‌ సలీం హైదర్‌ ఖాన్‌ PKR 2 మిలియన్‌ రివార్డులు ఉన్నాయి. అలాగే అర్షద్ నదీమ్‌ ప్రతిభను మెచ్చిన ప్రముఖ పాకిస్థాన్‌ సింగర్‌ అలీ జఫర్‌ PKR 1 మిలియన్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఇంతే మొత్తాన్ని నదీమ్‌కు తన ఫౌండేషన్‌ ద్వారా ఇవ్వనున్నట్లు క్రికెటర్‌ అహ్మద్‌ షాదాజ్‌ వెల్లడించారు.

మరిన్ని సత్కారాలు - మరోవైపు, నదీమ్‌ స్వదేశానికి చేరుకోగానే అతడిని బంగారు కిరీటంతో సత్కరించనున్నట్లు సింధ్‌ ప్రభుత్వం ప్రకటించింది. అలాగే అర్షద్‌ నదీమ్‌ ప్రతిభకు గుర్తింపుగా అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించాలని పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీ ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు అక్కడి రేడియో పాకిస్థాన్‌ వెల్లడించింది.

స్పోర్ట్స్ స్టేడియానికి అర్షద్ పేరు - మరోవైపు, సుక్కురులోని కొత్త స్పోర్ట్స్‌ స్టేడియానికి నదీమ్‌ పేరు పెట్టనున్నట్లు అధికారులు ప్రకటించారు. మరోవైపు, కరాచీలో అర్షద్‌ నదీమ్‌ అథ్లెటిక్స్‌ అకాడమీని ప్రారంభించనున్నట్లు నగర మేయర్‌ ముర్తుజా వహబ్‌ వెల్లడించారు. నదీమ్‌కు సోలార్‌ ఎనర్జీ సిస్టమ్‌ను అందించనున్నట్లు అక్కడి ప్రముఖ సోలార్‌ ఎనర్జీ కంపెనీ బీకన్‌ ఎనర్జీ ప్రకటించింది.

కష్టాలను ఎదురొడ్డి గోల్ట్ మెడల్ - ఒక వైపు ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా, మరోవైపు శిక్షణ కష్టాలను దాటి అర్షద్‌ నదీమ్‌ గోల్ట్ మెడల్ కొట్టాడు. పారిస్‌ ఒలింపిక్స్‌లో 92.97 మీటర్లు జావెలిన్‌ విసిరి పాకిస్థాన్‌కు పతకాన్నిఅందించాడు. ఇక వ్యక్తిగత విభాగంలో ఆ దేశం నుంచి స్వర్ణ పతకం గెలిచిన తొలి అథ్లెట్‌ అర్షదే. దీంతో అతడిపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. అర్షద్‌కు స్వదేశంలో ఘనంగా స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు.

గోల్డ్​ విన్నర్​ నదీమ్​కు రూ.42 లక్షలు ప్రైజ్​ మనీ, నీరజ్​కు ఎంతో తెలుసా?

డైట్​ దొరికేది కాదు, తుప్పు పరికరాలతో ప్రాక్టీస్! - ఒలింపిక్స్ గోల్డ్​ విన్నర్​ అర్షద్​ నదీమ్ జర్నీ - Paris Olympics 2024 Arshad Nadeem

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.