Offers On Ind Vs Eng Test Hyd Match Tickets : జనవరి 25 నుంచి మార్చి 11 వరకు జరిగే 5 టెస్టుల సుదీర్ఘ సరీస్ కోసం ఇంగ్లాండ్-భారత్ జట్లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇందులో భాగంగా ఈనెల 25 నుంచి 29 వరకు తొలి టెస్టు హైదరాబాద్‌లో ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న రెండు టీమ్స్ ప్రాక్టీస్ మ్యాచ్‌లతో బిజీగా గడుపుతున్నాయి. మ్యాచ్‌ను వీక్షించేందుకు అవసరమైన టికెట్ల విక్రయాలను జనవరి 18నుంచే ప్రారంభించింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ). ఈ నేపథ్యంలో 5 రోజులపాటు సాగనున్న మొదటి టెస్టు మ్యాచ్ టికెట్లపై పలు రకాల ఆఫర్లను ప్రకటించింది.
3 రోజుల టికెట్ ధరతో 5 రోజులు
5 రోజుల పాటు జరగనున్న తొలి టెస్టు మ్యాచ్ టికెట్ ధరలను కనిష్ఠంగా రూ.200 నుంచి గరిష్ఠంగా రూ.4,000 వరకు నిర్ణయించింది హెచ్‌సీఏ. ప్యాకేజీ రూపంలో తక్కువ ధరకే టికెట్లు
- రూ.200(ఒక్కరోజుకు) టికెట్ 5 రోజులకు కలిపి కేవలం రూ.600కే లభిస్తున్నాయి.
- రూ.1000 (ఒక్కరోజుకు) టికెట్ 5 రోజులకు కలిపి కేవలం రూ.3వేలకే అందుబాటులో ఉంచారు.
- రూ.1250 (ఒక్కరోజుకు) టికెట్ 5 రోజులకు కలిపి కేవలం రూ.3750.
- రూ.3,000 (ఒక్కరోజుకు) టికెట్ 5 రోజులకు కలిపి కేవలం రూ.12వేలు.
- రూ.4,000 (ఒక్కరోజుకు) టికెట్ 5 రోజులకు కలిపి కేవలం రూ.16,000.
సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్స్‌తో పాటు ఇన్‌సైడర్.ఇన్ అనే వెబ్‌సైట్‌లో, పేటీఎం, పేటీఎంఇన్‌సైడర్ మొబైల్ యాప్‌లోనూ టికెట్లను కొనుగోలు చేయవచ్చు.
విద్యార్థులకు ప్రవేశం ఉచితం
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఈ మ్యాచ్‌లను ఉచితంగానే చూపించనున్నారు. ముందస్తుగా దరఖాస్తు చేసుకున్న పాఠశాలలకు మాత్రమే ఈ అవకాశం లభించనుంది. ప్రతిరోజు 5వేల మంది విద్యార్థులకు మ్యాచ్‌లను చూసేందుకు ఛాన్స్ ఇవ్వనున్నారు. వీరికి ఉచితంగానే భోజన సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు నిర్వాహకులు.
రిపబ్లిక్ డే సందర్భంగా వారికి ఫ్రీ
జవనరి 26న రిపబ్లిక్ డేను పురస్కరించుకొని ఆర్మీ, నేవీ అధికారులకు ఈ టెస్ట్ మ్యాచ్‌ను ఉచితంగానే చూసేందుకు అవకాశం కల్పించారు. వీరు తమ కుటుంబ సభ్యులతో కలిసి మ్యాచ్‌ను ఉచితంగా చూడవచ్చు.
వరుణ్ తేజ్‌కు ఆ సమస్య ఉంది! : లావణ్య త్రిపాఠి
వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్ ఔట్- ఆంధ్ర కుర్రోడికి ఛాన్స్ దక్కేనా?