Pragyan Ojha ODI Format : ప్రస్తుతం టీ20 క్రికెట్ పీరియడ్ నడుస్తోంది. ఎక్కువ మంది క్రికెట్ అభిమానులు ధనాధన్ ఇన్నింగ్స్‌లు చూడటానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే క్రమంగా టెస్ట్‌లు, వన్డే క్రికెట్‌కు ఆదరణ తగ్గిపోతోంది. ఈ విషయంపై చాలా కాలంగా చర్చలు కూడా నడుస్తున్నాయి. తాజాగా ఈ అంశంపై భారత మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా తన ఆలోచనలు షేర్ చేసుకున్నాడు. వన్డే ఫార్మాట్‌ను మరింత ఎక్సైటింగ్‌గా మార్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు.
ఈటీవీ భారత్‌కు ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో, వన్డే క్రికెట్ దాని ఔచిత్యాన్ని కోల్పోతుందా? అనే ప్రశ్నకు స్పందించాడు. వన్డే క్రికెట్ ఆదరణ కోల్పోతుందని అంగీకరిస్తూ, మరింత ఆకర్షణీయంగా మార్చడానికి కొన్ని సూచనలు చేశాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
- పునర్నిర్మాణం అవసరం
T20 క్రికెట్‌ను ప్రోత్సహించడం లేదా టెస్ట్ క్రికెట్‌పై మాత్రమే దృష్టి పెట్టడం వల్ల వన్డేలకు ఆదరణ తగ్గడం లేదని ప్రజ్ఞాన్ ఓజా నొక్కిచెప్పాడు. టెస్ట్ క్రికెట్‌కు ఎప్పుడూ ప్రేక్షకులు ఉంటారు. ఆ సెగ్మెంట్ వేరు. అయితే టీ20 ఫార్మాట్ ఇంట్రడ్యూస్ చేయడం, ప్రజలు తమ ప్రొఫెషనల్, పర్సనల్ షెడ్యూల్స్‌తో బిజీ అయిపోవడం వల్ల వన్డేలకు ఆదరణ తగ్గింది. వన్డేలను చాలా లెంతీగా ఫీల్ అవుతున్నారు.’ అని ఓజా పేర్కొన్నాడు. - వన్డేలు ఆకర్షణ తిరిగి రావాలంటే కొన్ని మార్పులు అసరమని తెలిపాడు. ‘వన్డే క్రికెట్‌లో కొన్ని మార్పులు తీసుకురావాలి. ద్వైపాక్షిక సిరీస్‌ల కన్నా, టైటాన్ కప్ వంటి మల్టినేషన్ టోర్నమెంట్స్ నిర్వహించాలి. కాస్త ఆసక్తికరంగా మార్చాలి.’ అని తెలిపాడు.
- పెద్ద ఈవెంట్స్ అవసరం
వన్డేలకు ఆదరణ పెంచడానికి బిగ్ ఈవెంట్స్ నిర్వహించడం అవసరమని ఓజా పేర్కొన్నాడు. ‘టీ20 క్రికెట్ అభిమానుల కోణం నుంచి ఆసక్తికరంగా ఉంటుంది. అలానే వన్డే క్రికెట్‌పై కూడా ప్రజలు ఆసక్తి చూపడం, గేమ్‌ను ఫాలో అవ్వడం ప్రారంభించిన తర్వాత ఆ ఫార్మాట్ కూడా పుంజుకుంటుంది. ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీని ఎక్కువ మంది ఫాలో అవుతారు. కాబట్టి, ఇలాంటి బిగ్ ఈవెంట్స్ ప్లాన్ చేయాలి.’ అని పేర్కొన్నాడు. - రేపటి నుంచే టీ20 సిరీస్
శ్రీలంకలో జులై 27 నుంచి మూడు T20Iల సిరీస్ మొదలు కానుంది. కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కొత్త కోచ్ గంభీర్ నేతృత్వంలో టీమ్ ఇండియా సిద్ధమవుతోంది. ఈ సిరీస్ తర్వాత రోహిత్ కెప్టెన్సీలో ఇండియా మూడు వన్డేల సిరీస్ ఆడుతుంది.
రాత్రి 7 గంటల నుంచి టీ20 మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇంగ్లీష్‌లో సోనీ స్పోర్ట్స్ టెన్ 5, సోనీ స్పోర్ట్స్ టెన్ 1, హిందీలో సోనీ స్పోర్ట్స్ టెన్ 3, తమిళం, తెలుగులో సోనీ స్పోర్ట్స్ టెన్ 4 ఛానెల్లో ప్రత్యక్ష ప్రసారాన్ని చూడవచ్చు. సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఈ సిరీస్ అఫిషియల్ బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరిస్తోంది.
వేర్వేరు క్రీడలు - ఒకటే లక్ష్యం - ఆఖరి పోరులో ముగ్గురూ పసిడి కొడుతారా? - Paris Olympics 2024
పారిస్ ఒలింపిక్స్‌లో కాంట్రవర్సీ- ఆ అథ్లెట్ ఎంపికపై IOC ఫైర్ - Paris Olympics 2024