ETV Bharat / sports

అత్యాచారం కేసులో సందీప్​కు ఊరట- క్రికెటర్​ను నిర్దోషిగా తేల్చిన హై కోర్టు - Sandeep Lamichhane - SANDEEP LAMICHHANE

Sandeep Lamichhane: నేపాల్ క్రికెటర్ సందీప్ లామిచ్చెన్​కు అత్యాచారం కేసులో ఊరట లభించింది. ఈ కేసులో అతడిని నిర్దోషిగా తేలుస్తూ నేపాల్ హై కోర్టు తీర్పునిచ్చింది.

Sandeep Lamichhane
Sandeep Lamichhane (Source: Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : May 15, 2024, 6:09 PM IST

Updated : May 15, 2024, 6:37 PM IST

Sandeep Lamichhane: అత్యాచారం కేసులో నేపాల్ క్రికెటర్ సందీప్ లామిచ్చెన్​కు ఆ దేశ హైకోర్టులో ఊరట లభించింది. జిల్లా కోర్టు ఇచ్చిన ఎనిమిదేళ్ల జైలు శిక్ష తీర్పును తోసిపుచ్చింది. సందీప్​ను నిర్దోషిగా ప్రకటించింది. బుధవారం ఈ మేరకు తీర్పునిచ్చింది. 2022లో కాఠ్ మాండూలోని ఓ హోటల్​లో సందీప్‌ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ మైనర్‌ కోర్టును ఆశ్రయించింది.

దీనిపై విచారణ చేపట్టిన నేపాల్ జిల్లా కోర్టు 2024 జనవరిలో సందీప్​కు ఎనిమిదేళ్ల జైలు శిక్షతోపాటు జరిమానా విధించింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ సందీప్ హై కోర్టును ఆశ్రయించాడు. తాజాగా విచారణ చేపట్టిన జస్టిస్​ సూర్య దర్శన్, దేవ్ భట్టా డివిజన్ బెంచ్, గతంలో జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. ఈ కేసులో సందీప్​ను నిర్దోషిగా తేల్చింది.

ఇదీ కేసు: 2022 ఆగస్టు 21న కాఠ్ మాండూ, భక్తపూర్​లో తనను పలు ప్రాంతాల్లో తిప్పి అదే రోజు రాత్రి కాఠ్​ మాండు సినమంగల్​లోని ఓ హోటల్​కు తీసుకొచ్చి అక్కడే అత్యాచారం చేసినట్లు నేపాల్​కు చెందిన ఓ 17 ఏళ్ల మైనర్ ఆరోపించింది. అతడిపై అక్కడి పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన అధికారులు అతడ్ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. నేపాల్​ కోర్టు కూడా అరెస్ట్ వారెంట్​ జారీ చేసింది. దీంతో నేపాల్ క్రికెట్ బోర్డు సందీప్​పై వేటు వేసింది. ఇక గతేడాది కరీబియన్ ప్రీమియర్ లీగ్​ పూర్తి చేసుకొని నేపాల్​కు తిరిగి వచ్చిన సందీప్​ను పోలీసులు ఎయిర్​ పోర్టులోనే అదుపులోకి తీసుకున్నారు. 2022 నవంబర్​లో అతడ్ని జైలుకు తరలించాలని కోర్టు ఆదేశించింది. అయితే హై కోర్టుకు వెళ్లి సందీప్ బెయిల్ తెచ్చుకున్నాడు.

2024 T20 World Cup: జూన్​లో ప్రారంభంకానున్న 2024 టీ20 వరల్డ్​కప్ ఎంపికకు సందీప్ అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే నేపాల్ ఇప్పటికే 15మందితో కూడిన జట్టును ప్రకటించింది. కాగా, ఐసీసీ నిబంధనల ప్రకారం జట్టులో మార్పులు చేసుకునేందుకు ఈనెల 25వరకు అవకాశం ఉంది. దీంతో సందీప్ పొట్టి ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకునే ఛాన్స్ ఉంది.

మైనర్​పై అత్యాచారం కేసులో తీర్పు - దోషిగా నేపాల్ క్రికెట్​ ప్లేయర్​

క్రికెటర్ సందీప్​కు 8 ఏళ్ల జైలు శిక్ష- మైనర్​పై అత్యాచారం కేసులో నేపాల్ కోర్టు తీర్పు

Last Updated : May 15, 2024, 6:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.