T20 World Cup Most Runs: 2024 టీ20 వరల్డ్‌కప్‌కు రంగం సిద్ధమవుతోంది. ఈ 9వ ఎడిషన్ టోర్నీకి అమెరికా, వెస్టిండీస్ దేశాలు ఆతిథ్యమివ్వనున్నాయి. ప్రతిష్ఠాత్మకమైన ఈ టోర్నమెంట్‌కు మరో 3 రోజుల్లో తెరలేవనుంది. ఈ మేరకు టోర్నీలో పాల్గొననున్న ఆయా దేశాలు ఇప్పటికే జట్లను ప్రకటించి, అమెరికా పయనమవుతున్నాయి. తొలిసారి టోర్నీలో అత్యధికంగా 20 జట్లు పాల్గొననున్నాయి. ఈ క్రమంలో అన్ని జట్లు టైటిల్‌పై కన్నేశాయి.
కానీ, టాప్ జట్లు భారత్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ దేశాలు టైటిల్ ఫేవరెట్లుగా బరిలోకి దిగనున్నాయి. అయితే ఇప్పటివరకు జరిగిన 8 ఎడిషన్లలో టీమ్ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో అందరికంటే ముందున్నాడు. మరి ఈ పొట్టికప్ టోర్నీలో ఇప్పటివరకు అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్లపై ఓ లుక్కేద్దాం.
- విరాట్ కోహ్లీ: టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ ఈ లిస్ట్‌లో అందరికంటే ముందున్నాడు. విరాట్ ఇప్పటివరకు 25ఇన్నింగ్స్‌లో 1141 పరుగులు చేశాడు. ఇందులో 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 89*.
- మహేల జయవర్దనే: శ్రీలంక లెజెండరీ మహేల జయవర్దనే ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. 31 ఇన్నింగ్స్‌లు ఆడిన జయవర్దనే 1016 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ సహా, 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 100.
- క్రిల్ గేల్: యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ టీ20 వరల్డ్‌కప్‌లో తనదైన మార్క్ చూపించాడు. పొట్టికప్ టోర్నీలో వెస్టిండీస్ తరఫున 31 ఇన్నింగ్స్ ఆడిన గేల్ 965 పరుగులు సాధించాడు. ఇందులో 2 శతకాలు, 7 అర్ధ శతకాలు ఉన్నాయి. కాగా, గేల్ వరల్డ్‌కప్‌లో ఏకంగా 63 సిక్స్‌లు బాదడం విశేషం. అత్యధిక స్కోర్ 117.
- రోహిత్ శర్మ: టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటివరకు జరిగిన అన్ని టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో ఆడాడు. 36 ఇన్నింగ్స్‌లలో రోహిత్ 963 పరుగులు చేసి ఈ జాబితాలో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. భారత్ తరఫున విరాట్ తర్వాత అత్యధిక పరుగులు సాధించింది రోహిత్ శర్మే.
- తిలకరత్నె దిల్షాన్: శ్రీలంక మాజీ ప్లేయర్ తిలకరత్నె దిల్షాన్ ఈ లిస్ట్‌లో 5న ప్లేస్‌లో ఉన్నాడు. దిల్షాన్ ఇప్పటివరకు 34 ఇన్నింగ్స్‌లో 897 పరుగులు సాధించాడు. ఇందులో 6 అర్ధ శతకాలు ఉన్నాయి.
టీ20 ప్రపంచకప్‌లో టాప్- 5 టీమ్ఇండియా బ్యాటర్లు
- విరాట్ కోహ్లీ- 1141 పరుగులు
- రోహిత్ శర్మ- 963 పరుగులు
- యువరాజ్ సింగ్- 593 పరుగులు
- ఎమ్ ఎస్ ధోనీ- 529 పరుగులు
- గౌతమ్ గంభీర్- 524 పరుగులు
55 మ్యాచ్‌లు, 20 జట్లు - టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ డీటెయిల్స్ ఇవే - T20 WORLD CUP 2024