ETV Bharat / sports

'టీమ్​ఇండియాను అంత తేలిగ్గా తీసుకోవద్దు'- ఆసీస్​కు బుమ్రా వార్నింగ్! - BORDER GAVASKAR TROPHY

భారత్- ఆసీస్ మధ్య తొలి టెస్టు! - భారత్​ను తక్కువ అంచనా వేయొద్దన్న బుమ్రా

Jasprit Bumrah Border Gavaskar Trophy
Jasprit Bumrah (Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Nov 21, 2024, 1:08 PM IST

Jasprit Bumrah Border Gavaskar Trophy : బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో భాగంగా రేపటి (నవంబరు 22) నుంచి ఆస్ట్రేలియాతో భారత్ తొలి టెస్టు ఆడనుంది. రోహిత్ శర్మ గైర్హాజరీతో కెప్టెన్​గా జస్ప్రీత్ బుమ్రా జట్టును నడిపించనున్నాడు. ఈ క్రమంలో కెప్టెన్సీ, భారత జట్టుపై విలేకరుల సమావేశంలో బుమ్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమ్ ఇండియాను తేలికగా తీసుకోవద్దని ఆసీస్​ను హెచ్చరించాడు.

న్యూజిలాండ్‌తో సిరీస్ గురించి బుమ్రా ఏమన్నాడంటే?
అయితే ఇటీవలె న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో ఓటమి ప్రభావం బోర్డర్ గావస్కర్ ట్రోఫీపై ఏమాత్రం ఉండదని బుమ్రా అన్నాడు. "మీరు ఒక సిరీస్‌ గెలిచినా కూడా తర్వాత సిరీస్‌లో మొదటి నుంచి మొదలుపెట్టాల్సిందే. ఓడినా కూడా తిరిగి మొదటి నుంచి ప్రారంభించాల్సి ఉంటుంది. భారత్‌లో ఓటమి తాలుకా నిరుత్సాహాన్ని నేను ఇక్కడికి తీసుకురాలేదు. అయితే ఆ సిరీస్‌ నుంచి నేర్చుకొన్న కొన్ని అంశాలు మాత్రం కచ్చితంగా ఉన్నాయి. కానీ, అవి భిన్నమైన పరిస్థితులు, ఇక్కడ మా ఫలితాలు కూడా అందుకు భిన్నంగానే ఉన్నాయి. ఇక ఈ ట్రోఫీ కోసం ఇప్పటికే మేము తుది జట్టును నిర్ణయించాము. రేపు ఆట ప్రారంభానికి ముందు దాన్ని వెల్లడిస్తాం" అని బుమ్ర వివరించాడు.

కెప్టెన్సీలో నాదైన శైలి ఉంటుంది
మిగతా కెప్టెన్లతో పోల్చుకుంటే తన శైలి చాలా భిన్నంగా ఉంటుందని బుమ్రా పేర్కొన్నాడు. "కెప్టెన్సీ అనేది ఓ గౌరవం లాంటిది. నాకంటూ ఓ సొంత శైలి ఉంది. ఇక విరాట్‌, రోహిత్‌ కెప్టెన్సీలు కూడా చాలా భిన్నంగా ఉంటాయి. నేను బాధ్యతలు తీసుకోవడాన్ని చాలా ఇష్టపడతాను. నేను గతంలోనే రోహిత్‌తో ఈ విషయం గురించి మాట్లాడాను. కానీ, ఇక్కడికి వచ్చిన తర్వాత కెప్టెన్సీపై మరింత క్లారిటీ వచ్చింది. ఓ పేసర్​ కెప్టెన్​గానూ ఉండాలని నేను ఎప్పుడూ చెబుతుంటాను. మైదానంలో వారి ట్రిక్‌లు చాలా డిఫరెంట్​గా ఉంటాయి. పాట్‌ కమిన్స్‌ అద్భుతంగా రాణించాడు. కపిల్‌దేవ్‌ సహా గతంలో చాలామంది ఉన్నారు. ఈ కొత్త సంప్రదాయానికి ఇది ప్రారంభం అని ఆశిస్తున్నాను" అని తన అభిప్రాయాలను బుమ్రా చెప్పుకొచ్చాడు.

'టీమ్​ఇండియా సిద్ధంగా ఉంది'
బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో ఆడడం కోసం భారత జట్టు పూర్తిగా సిద్ధంగా ఉందని బుమ్రా తెలిపాడు. సిరీస్ ప్రారంభానికి ముందే ఆస్ట్రేలియాకు రావడం వల్ల ప్రాక్టీస్​కు మంచి సమయం దొరికిందని పేర్కొన్నాడు. భారత జట్టుపై పూర్తి నమ్మకం ఉందని, పరిస్థితులు ఎలా ఉన్నా రాణిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. భారత జట్టు ఆసీస్ సిరీస్ కోసం తీవ్రంగా శ్రమించి సిద్ధమైందని వెల్లడించాడు. ప్రస్తుతం ఆటగాళ్లు మానసికంగా బలంగా ఉండటంపై దృష్టిసారిస్తున్నారని తెలిపాడు.

షమీ వస్తాడు!
"షమీ టీమ్​లో అంతర్భాగంగా ఉన్నాడు. టీమ్ మేనేజ్​మెంట్ అన్నింటిని నిశితంగా గమనిస్తోంది. అంతా సవ్యంగా జరిగితే త్వరలోనే జట్టులోకి షమీ వస్తాడు. కోహ్లీకి నేను ఎలాంటి ఇన్​పుట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అతని తర్వాతే నేను అరంగేట్రం చేశాను. కోహ్లీపై నాకు పూర్తి నమ్మకం ఉంది. మేము మా ప్లేయింగ్ 11ను ఖరారు చేశాం. రేపు ఉదయం మ్యాచ్ ప్రారంభానికి ముందు మీకు తెలుస్తుంది. పేసర్లు కెప్టెన్లుగా ఉండాలని నేను భావిస్తాను. ఎందుకంటే వారు వ్యూహాత్మకంగా ఆలోచిస్తారు. పాట్ కమిన్స్ ఆసీస్​ను అద్భుతంగా నడిపిస్తున్నారు. కపిల్ దేవ్ సహా చాలా మంది జట్టును విజయపథంలో నడిపించిన సందర్భాలు ఉన్నాయి." అని బుమ్రా వ్యాఖ్యానించాడు.

బోర్డర్ గావస్కర్ ట్రోఫీ - మనోళ్ల ముందున్న 12 భారీ రికార్డులివే

టీమ్ ఇండియాను వెంటాడుతోన్న ఆ సమస్య - బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో వాళ్లకు కఠిన పరీక్షే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.