ETV Bharat / sports

సన్​రైజర్స్ హైదరాబాద్​కు షాక్​! - జట్టుకు అతడు గుడ్​బై - IPL 2025 DALE STEYN

సన్​రైజర్స్​ హైదరాబాద్​ జట్టును వీడనున్న బౌలింగ్ కోచ్!

Sunrisers Hyderabad IPL 2025
Sunrisers Hyderabad IPL 2025 (source ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 17, 2024, 9:59 AM IST

IPL 2025 Dale Steyn to leave Sunrisers Hyderabad : ఐపీఎల్‌ 2025 సీజ‌న్​కు ముందు సన్‌ రైజర్స్ హైద‌రాబాద్​కు షాక్ త‌గిలింది. ఎస్ఆర్ హెచ్ బౌలింగ్ కోచ్ ప‌ద‌విని వదిలేస్తున్నట్లు దక్షిణాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్ ప్రకటించాడు. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా స్టెయిన్ వెల్లడించాడు. అయితే సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఎస్ఆర్‌హెచ్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ బౌలింగ్ కోచ్​గా మాత్రం కొన‌సాగ‌నున్న‌ట్లు తెలిపాడు.

"ఐపీఎల్‌లో రెండేళ్ల పాటు బౌలింగ్ కోచ్​గా పనిచేసే అవ‌కాశ‌మిచ్చినందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్​కు ధన్యవాదాలు. ఇక ఐపీఎల్​లో ఎస్ఆర్‌ హెచ్‌తో నా ప్ర‌యాణం ముగించాల‌ని నిర్ణ‌యించుకున్నాను. అయితే ద‌క్షిణాఫ్రికాలో జ‌రిగే ఎస్ఏ20లో మాత్రం సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్​తో కలిసి పని చేస్తాను. ఈస్టర్న్ కేప్​ను వరుసగా మూడోసారి విజేతగా నిలిపేందకు ప్రయత్నిస్తాను. " అని రాసుకొచ్చాడు.

బౌలింగ్ కోచ్‌గా ఫ్రాంక్లిన్‌ - డేల్ స్టెయిన్ ఐపీఎల్‌ 2024 సీజ‌న్​కు వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో దూర‌మ‌య్యాడు. అత‌డి స్ధానంలో తాత్కాలిక బౌలింగ్ కోచ్​గా న్యూజిలాండ్ మాజీ ఆల్ రౌండర్ జేమ్స్ ఫ్రాంక్లిన్‌ ను ఎస్ఆర్‌ హెచ్ నియ‌మించింది. అయితే ఫ్రాంక్లిన్ హెడ్ కోచ్ డేనియల్ వెట్టోరితో కలిసి 2024 సీజన్​లో పనిచేశాడు. ఇద్దరూ న్యూజిలాండ్ దిగ్గజాలు కలిసి ఎస్ఆర్ హెచ్​ను ఫైనల్​కు చేర్చారు. అయితే ఇప్పుడు స్టెయిన్ బౌలింగ్ కోచ్ పదవికి గుడ్ బై చెప్పడం వల్ల, ఫ్రాంక్లిన్ ఎస్ఆర్​హెచ్ రెగ్యూల‌ర్ బౌలింగ్ కోచ్​గా నియామకమయ్యే అవకాశం ఉంది.

అతడికే మరోసారి అవకాశం - గత సీజన్​లో హైదారాబాద్​ జట్టు ఎస్ఆర్ హెచ్ బౌలింగ్ కోచ్ ఫ్లాంక్లిన్ నేతృత్వంలో అదరగొట్టింది. ఎటువంటి అంచనాల లేకుండా దిగిన జట్టు ఫైనల్​కు దూసుకెళ్లింది. ఫైనల్​లో కాస్త తడబడి కప్పును చేజార్చుకుంది. అందుకే ఫ్రాంక్లిన్​ను బౌలింగ్ కోచ్​గా ఎస్ఆర్ హెచ్ కొనసాగించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

కెరీర్ పరంగా - డేల్ స్టెయిన్ ఐపీఎల్​లో ప్లేయర్​గా ఎస్ఆర్ హెచ్ సహా పలు ఫ్రాంచైజీలకు ఆడాడు. 95 మ్యాచుల్లో 97 వికెట్లు పడగొట్టాడు. అలాగే అంతర్జాతీయ కెరీర్​లో దక్షిణాఫ్రికా జట్టుకు వెన్నుముకగా నిలిచాడు. 93 టెస్టుల్లో 439 వికెట్లు తీశాడు. 125 వన్డేల్లో 196 వికెట్లు తీశాడు. 47 ట్వంటీల్లో 64 మందిని ఔట్ చేశాడు.

SRH రిటెన్షన్ లిస్ట్ రెడీ - ఆ ప్లేయర్ కోసం ఏకంగా రూ.23 కోట్లు!

హమ్మయ్య తొలి టెస్ట్ ప్రారంభం - తుది జట్టులో ఆ ఇద్దరికి అవకాశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.