IPL 2024 Qualifier 1 Shreyas Iyer : ఐపీఎల్ 2024లో కీలక దశ మొదలైంది. ఫైనల్ ఆడే అవకాశం కోసం నాలుగు జట్లు తలపడుతున్నాయి. పాయింట్స్ టేబుల్లో 20 పాయింట్లతో టాప్ పొజిషన్‌లో ఉన్న KKR, 17 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న SRH మే 21న మొదటి క్వాలిఫైయర్ ఆడుతోంది. ఈ పోరులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరుతుంది. అయితే ఈ నేపథ్యంలో కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ స్ట్రాంగ్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు
బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తాం! - మొదటి క్వాలిఫైయర్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతోంది. ఈ కీలక మ్యాచ్‌కు ముందు స్టార్ స్పోర్ట్స్ వీడియోలో శ్రేయాస్ అయ్యర్ మాట్లాడుతూ - ‘మీకు బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అందించాలనే ఆశతో మేము పోరాడుతాం. ఇప్పటి వరకు అన్ని మ్యాచ్‌లకు సపోర్ట్ చేశారు. అలానే ఈ మ్యాచ్‌కు కూడా స్టేడియం అట్మాస్ఫియర్‌ను ఎలక్ట్రిఫైయింగ్‌గా ఉంచండి. ఎప్పటిలానే ప్లేయర్స్‌ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం.’ అని చెప్పాడు.
అయ్యర్, కేకేఆర్‌లోని ఓవర్సీస్, డొమెస్టిక్ ట్యాలెంటెడ్ ప్లేయర్‌ల కాంబినేషన్ గురించి కూడా మాట్లాడాడు. 'టీమ్‌లోని అందరు ప్లేయర్‌లు యూనిక్. వారి కెరీర్‌లో వారికి అపారమైన అనుభవం ఉంది. గత కొన్నేళ్లుగా వారు తమ టీమ్‌లకు ఆడిన తీరు అద్భుతం. ఇలాంటి పెర్‌ఫార్మెన్స్‌లే మ్యాచ్‌ల తర్వాత మనమందరం ఎప్పుడూ ఆరాధించే విషయం. కెప్టెన్‌గా నేను అదృష్టవంతుడిని. నా టీమ్‌లో అత్యంత ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉన్నారు. వారికి చాలా స్కిల్, పొటెన్షియల్ ఉంది.' అని చెప్పాడు.
గెలుపు గురించే ఆలోచన - చివరిగా స్ట్రాంగ్ స్టేట్‌మెంట్‌తో వీడియో ముగించాడు. కేవలం గెలుపుపై మాత్రమే ఫోకస్ చేస్తున్నానని, ఇంకేం ఆలోచించడం లేదని చెప్పాడు అయ్యర్. 'నేను ఎదురు చూస్తున్న మూడు విషయాలు విన్, విన్, విన్.' అని పేర్కొన్నాడు.
కేకేఆర్ టీమ్ ఎఫర్ట్ - అయ్యర్ కెప్టెన్సీలోని కోల్‌కతా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన మొదటి జట్టుగా నిలిచింది. లీగ్ స్టేజ్‌లో చివరి రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దైనా కేకేఆర్ అగ్రస్థానానికి ఎలాంటి ముప్పు రాలేదు. దీన్ని బట్టి ఈ సీజన్‌లో కేకేఆర్ ఎంత దూకుడుగా ఆడిందో అర్థం చేసుకోవచ్చు. ఒకరిపై ఆధారపడకుండా టీమ్ ఎఫర్ట్‌ను నమ్ముకుంది, ఆశించిన ఫలితాలు అందుకుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌లో ఐదుగురు బౌలర్లు 10 కంటే ఎక్కువ వికెట్లు తీయడం గమనార్హం. ప్రత్యర్థులను కట్టడి చేయడంలో అందరూ తమ వంతు పాత్ర పోషించారు. వరుణ్ చక్రవర్తి 18 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. పర్పుల్ క్యాప్‌ను గెలుచుకునే అవకాశం కూడా లేకపోలేదు. అలా ఇప్పటికీ రెండు సార్లు టైటిల్ గెలిచిన కేకేఆర్ మూడో విజయంపై కన్నేసింది.
అతడిని ఒప్పించేందుకు ధోనీ సాయం కోరిన బీసీసీఐ - ఎందుకంటే? - Team India Head Coach BCCI
వరల్డ్‌కప్ జట్టు ప్లేయర్స్ లేకుండానే ఐపీఎల్ టాప్-2 టీమ్స్! - T20 World cup 2024