ETV Bharat / sports

సన్​రైజర్స్​ వర్సెస్​ కేకేఆర్ - బలాబలాలు, రికార్డులివే - IPL 2024 Qualifier 1

author img

By ETV Bharat Telugu Team

Published : May 20, 2024, 6:48 PM IST

IPL 2024 Qualifier 1 KKR VS SRH : మరో రోజులో ఐపీఎల్‌ 2024లో క్వాలిఫయర్ 1 మ్యాచ్ జరగనుంది. ఈ కీలక పోరులో కోల్‌కతాతో హైదరాబాద్‌ అమీతుమీ తేల్చుకోనుంది. ఈ సందర్భంగా ఇరు జట్ల బలబలాలను తెలుసుకుందాం.

The Associated Press
IPL 2024 Qualifier 1 KKR VS SRH (The Associated Press)

IPL 2024 Qualifier 1 KKR VS SRH : ఐపీఎల్‌ 17వ సీజన్‌లో లీగ్‌ స్టేజ్‌ పూర్తయింది. మరో నాలుగు మ్యాచుల్లో ఈ సీజన్‌ విజేత ఎవరో తేలిపోనుంది. మే 18న చెన్నైతో జరిగిన ఉత్కంఠ పోరులో విజయం సాధించిన ఆర్సీబీ ప్లేఆఫ్స్‌లో చివరి బెర్తును సొంతం చేసుకుంది. 20 పాయింట్లతో కేకేఆర్‌ మొదటి స్థానంలో నిలిచింది. సన్‌రైజర్స్‌, రాజస్థాన్‌ 17 పాయింట్లతో సమంగా ఉన్నా, నెట్‌ రన్‌ రేట్ ఎక్కువగా ఉండటంతో ఎస్‌ఆర్‌హెచ్‌ రెండో స్థానంలో, ఆర్‌ఆర్ మూడో స్థానంలో ఉన్నాయి.

మే 21న మంగళవారం అహ్మదాబాద్‌లో జరిగే క్వాలిఫయర్‌-1లో కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తలపడుతాయి. ఇందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌ చేరుతుంది. మే 22న ఇదే వేదికలో జరిగే ఎలిమినేటర్‌లో రాజస్థాన్‌ రాయల్స్, బెంగళూరు రాయల్‌ ఛాలెంజర్స్‌ తలపడతాయి. మే 24న చెన్నైలో క్వాలిఫయర్‌ 1లో ఓడిన జట్టు, ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టు క్వాలిఫయర్‌ 2 ఆడుతాయి. చివరిగా మే 26న చెన్నైలో ఫైనల్ జరుగుతుంది.

  • ఫైనల్ చేరే మొదటి జట్టు ఏది?
    క్వాలిఫయర్‌-1లో తలపడే సన్‌రైజర్స్‌, కోల్‌కతాలో ఎవరు గెలిస్తే వాళ్లు నేరుగా ఫైనల్‌ చేరుకుంటారు. ఈ రెండు టీమ్‌లకు ఐపీఎల్‌ టైటిల్‌ గెలిచిన చరిత్ర ఉంది. మొదట ఫైనల్‌ చేరే జట్టు ఏది? ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

    గతేడాది పాయింట్స్‌ టేబుల్‌లో అట్టడుగున నిలిచిన హైదరాబాద్‌ ఈ సారి ప్లేఆఫ్స్‌కు చేరడం గొప్పే? అని చాలా మంది అన్నారు. ఇలాంటి ఆరోపణలకు సంచలన ప్రదర్శనలతో హైదరాబాద్‌ సమాధానం చెప్పింది. బలమైన జట్లను ఓడించి పాయింట్స్‌ టేబుల్‌లో రెండో స్థానంలో నిలిచింది. ఈ సీజన్‌లో రెండు సార్లు (287/3, 277/3) అత్యధిక స్కోర్‌ రికార్డును బద్ధలు కొట్టింది. క్వాలిఫయర్ 1 మ్యాచ్ జరగబోచే అహ్మదాబాద్‌ పిచ్‌ కూడా సూపర్ ఫాస్ట్‌ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది.

  • హైదరాబాద్‌ ఫామ్‌ కొనసాగిస్తే!
    ఓపెనింగ్‌ జోడీ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ పార్ట్‌నర్‌షిప్‌ జట్టుకు కీలకం. ఈ సూపర్‌ హిట్‌ జోడీ మరోసారి చెలరేగితే కోల్‌కతాకు కష్టాలు తప్పవు. మిడిల్ ఆర్డర్‌లో నితీశ్‌రెడ్డి, హెన్రిచ్‌ క్లాసెన్ అదరగొడుతున్నారు. అబ్దుల్ సమద్‌ కూడా ఆఖరిలో మెరుపులు మెరిపిస్తున్నాడు. ఈ స్టార్‌ ప్లేయర్‌లు ఫామ్‌ను కొనసాగిస్తే హైదరాబాద్‌ ఫైనల్‌కు చేరడం ఖాయం. బౌలింగ్‌లో పేసర్లు భువనేశ్వర్‌, నటరాజన్‌, కెప్టెన్‌ కమిన్స్‌ కీలకం. అయితే కోల్‌కతాతో పోలిస్తే హైదరాబాద్‌కు నాణ్యమైన స్పిన్నర్లు లేకపోవడం లోటుగా చెప్పవచ్చు. కానీ కోల్‌కతాతో పోలిస్తే హైదరాబాద్‌ పేస్ బలంగా ఉండటం కలిసొచ్చే అంశం.

  • కోల్‌కతాకే వీరే ప్రధాన బలం
    కోల్‌కతాలో ఓపెనర్లు సునీల్ నరైన్‌, ఫిల్‌ సాల్ట్‌ అద్భుత ఫామ్‌లో ఉన్నారు. ధనాధన్‌ హిట్టింగ్‌తో ఆరంభం నుంచే స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. ఈ జోడీని ఆరంభంలోనే పడగొడితే హైదరాబాద్‌కు పని తేలికవుతుంది. శ్రేయస్ అయ్యర్‌, వెంకటేశ్‌ అయ్యర్ పెద్దగా ఫామ్‌లో లేరు. ఒంటి చేత్తో మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చేయగల రింకు సింగ్, ఆండ్రి రస్సెల్‌కు సన్‌రైజర్స్‌ ప్రత్యేక వ్యూహాలను సిద్ధం చేయాల్సిందే. బౌలింగ్‌లో హర్షిత్ రాణా, వరుణ్‌ చక్రవర్తి, సునీల్ నరైన్‌ ప్రమాదకరం.

  • కేకేఆర్‌దే పైచేయి?
    మంచి పేస్‌, బౌన్స్‌ ఉండే అహ్మదాబాద్‌ పిచ్‌ ఇటు బ్యాటర్లకు, అటు బౌలర్లకు అనుకూలిస్తుంది. తొలుత బ్యాటింగ్‌ చేసే జట్టుకు విజయావకాశాలు ఎక్కువ. భారీ స్కోర్లు నమోదు కాకపోవచ్చు. ఇప్పటి వరకు ఐపీఎల్‌లో కోల్‌కతా, హైదరాబాద్‌ జట్లు 26 సార్లు తలపడ్డాయి. ఇందులో కేకేఆర్‌ ఏకంగా 17 మ్యాచ్‌లు గెలవగా, సన్‌రైజర్స్‌ 7 మ్యాచుల్లో విజయం సాధించింది. ఈ సీజన్‌లో కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లోనూ హైదరాబాద్‌ ఓడిపోయింది.

ప్లే ఆఫ్స్​ షెడ్యూల్ ఇదే - లీగ్ స్టేజ్​లో ఈ 4 జట్ల ప్రదర్శన ఎలా సాగిందంటే? - IPL 2024 Play offs

5ఏళ్ల తర్వాత సన్​రైజర్స్ అలా- అంతా కమిన్స్ వల్లే! - IPL 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.