IPL 2024 KKR VS RCB : సొంతగడ్డపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును చిత్తుగా ఓడించింది కోల్‌కతా నైట్ రైడర్స్. ఈ ఎడిషన్‌లో సొంతగడ్డపై కాకుండా ఇతర మైదానంలో గెలిచిన తొలి జట్టు కోల్‌కతానే కావడం విశేషం. శుక్రవారం చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో 183 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా అలవోకగా చేధించి ప్రత్యర్థి జట్టును చిత్తు చేసింది. 16.5 ఓవర్లలోనే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి మ్యాచ్‌ను ముగించింది. ఈ మ్యాచ్ రిజల్ట్‌పై ఇరు జట్ల కెప్టెన్లు మాట్లాడారు.
సొంత మైదానంలోనే ఓడిపోవడంపై ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ మాట్లాడుతూ పిచ్ కండిషన్స్ తమకు ప్రతికూలంగా మారాయని పేర్కొన్నాడు. "ఫస్ట్ ఇన్నింగ్స్‌లో మైదానం డబుల్ ఫేస్‌డ్‌గా ఉంది. సెకండ్ ఇన్నింగ్స్ వచ్చేసరికి వాతావరణం మారి పిచ్ కాస్త మెరుగైంది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేయడం అంత ఈజీ విషయం కాదు. క్రీజులో నిలదొక్కుకున్న విరాట్ కోహ్లీ కూడా కాస్త ఇబ్బంది పడ్డాడు. కొన్ని విషయాలను విభిన్నంగా ప్రయత్నించి ఉండాల్సింది. తొలి ఆరు ఓవర్లలోనే సునీల్ నరైన్, ఫిల్ సాల్ట్ బాగా ఆడి బ్యాటింగ్‌తో మా నుంచి మ్యాచ్‌ను లాగేశారు. మా బౌలర్లపై ఒత్తిడి పెంచారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో స్పిన్ వేద్దామనుకుంటే రైట్ హ్యాండ్ కాంబినేషన్‌తో దిగిన కోల్‌కతా బ్యాటర్లకు కరెక్ట్ కాదనిపించింది. మ్యాక్స్ వెల్‌తో పాటు ఫింగర్ స్పిన్నర్లను ప్రయత్నించాలనుకున్నాం. కానీ, ఈ వికెట్ పై అంతగా టర్న్ లభించలేదు. వైశాక్ బౌలింగ్ బాగుంది. ముందుగా కర్న్ శర్మతో బౌలింగ్ వేయించాలనుకున్నాం. కానీ, ఈ పిచ్ మీద స్లో బౌలింగ్ వేయగలవారైతేనే కరెక్ట్ అనిపించింది." అని డుప్లెసిస్ స్పందించాడు.
కోల్‌కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ రస్సెల్ బౌలింగ్ వేసేటప్పుడే ఈ పిచ్ ఫాస్ట్‌కు సహకరిస్తుందని అర్థమైంది. అందుకే అతడు స్లో బంతులతో ప్రత్యర్థిని కట్టడి చేశాడు. బెంగళూరుతో మ్యాచ్‌కు ముందు ఈ మైదానంలో రెండు సెషన్లు ప్రాక్టీస్ చేయడం ఉపయోగపడింది. ఓపెనర్‌గా సునీల్ నరైన్ ఊహించినట్లుగానే ఆడి అద్భుతమైన ఆట కనబరిచాడు." అని వెల్లడించాడు.
ఈ మ్యాచ్‌లో వెంకటేశ్ అయ్యర్ అద్భుతంగా రాణించాడు. మ్యాచ్ విజయంలో కీలకంగా వ్యవహరించాడు. అతడు మాట్లాడుతూ "బెంగళూరు బౌలర్ వైశాక్ చాలా బాగా బౌలింగ్ వేశాడు. అతను సంధిస్తున్న స్లో బౌలింగ్ తీరు మమ్మల్ని బాగా ఇబ్బందిపెట్టింది. మా బౌలర్లు ఇలానే బెంగళూరు బ్యాటర్లను కట్టడి చేశారు. ఇకపోతే సునీల్ నరైన్ మంచి ఆరంభం ఇచ్చాడు. కీలకమైన మ్యాచ్‌లో ఫామ్ అందుకోగలిగాను. ఏ ప్లాట్ ఫాం అయినా 100 శాతం ఆడేందుకు ప్రయత్నిస్తా" అని వెంకటేశ్ అయ్యర్ వివరించాడు.
ఆర్సీబీపై పేలుతున్న సెటైర్లు - ఈ ఫన్నీ మీమ్స్ చూశారా? - IPL 2024 KKR VS RCB
కోల్‌కతాతో మ్యాచ్ - క్రిస్ గేల్ రికార్డ్‌ను బ్రేక్ చేసిన కోహ్లీ - IPL 2024 Kohli Most sixes