IPL 2024 CSK New Catptain : మరో పది రోజుల్లో ఐపీఎల్ 17వ సీజన్ గ్రాండ్‌గా ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లోనూ టైటిల్‌ను ముద్దాడాలని డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ పట్టుదలతో ఉంది. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోనే బరిలోకి దిగబోతుంది. అయితే ఎప్పటిలాగే మహీ రిటైర్మెంట్ గురించి ఈ సారి కూడా వార్తలు గుప్పుమన్నాయి. ఇదే మహీకి ఆఖరి సీజన్ అని, అతడి తర్వాత సీఎస్కేను ఎవరు ముందుకు నడిపిస్తారనే ప్రశ్నలు కూడా మెదిలాయి.
అయితే తాజాగా ధోనీ తర్వాత సీఎస్కే కెప్టెన్ ఎవరనే ప్రశ్నకు చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్ సమాధానం ఇచ్చారు. భవిష్యత్‌లో సారథి ఎవరనే విషయం గురించి సీఎస్కే యజమాని శ్రీనివాసన్ చాలా స్పష్టతతో ఉన్నారని తెలిపారు. "కెప్టెన్ విషయంపై అంతర్గత చర్చలు జరిగాయి. ధోనీ తర్వాత సీఎస్కే కెప్టెన్ ఎవరనే విషయంపై శ్రీనివాసన్ చాలా క్లియర్‌గా ఉన్నారు. కెప్టెన్, వైస్ కెప్టెన్ వంటి విషయాలను కోచ్, ప్రస్తుత సారథికి వదిలేయాల్సిన విషయాలు. వాళ్లు నిర్ణయించుకున్న తర్వాతే ఆ సమాచారాన్ని నాకు అందిస్తారు. ఆ తర్వాత నేను మీకు చెబుతాను. అప్పటివరకు మనం ఈ విషయం గురించి మాట్లాడకపోవడం మంచిది'' అని పేర్కొన్నారు.
ఈ ఐపీఎల్ సీజన్ కోసం తమ జట్టు ఎలా సన్నద్ధం అవుతుందో కూడా చెప్పారు కాశీ విశ్వనాథన్. ప్రస్తుతం నాకౌట్స్‌కు అర్హత సాధించడంపై మాత్రమే దృష్టి సారించాం. అదే మా మొదటి లక్ష్యం కూడా. మిగతా సీజన్ ఆ రోజు ప్రదర్శనపై ఆధారపడి ఉంటుంది. గత కొన్ని సీజన్లుగా దీనినే ఫాలో అవుతున్నాం. 'మొదట లీగ్ మ్యాచ్‌లపై దృష్టి సారిద్దాం. తర్వాత నాకౌట్స్ క్వాలిఫై కావడం కోసం ట్రై చేద్దాం' అని ప్రతి సీజన్ మొదలు కావడానికి ముందు మహీ జట్టుతో ఇదే చెబుతుంటాడు. జట్టుపై ఒత్తిడి కూడా ఉంటుంది" అని విశ్వనాథన్ అన్నారు. కాగా, ఈ సీజన్లో సీఎస్కే తన తొలి మ్యాచ్‌ను ఆర్సీబీతో తలపడనుంది.
-
A forever kind of #Yellove 💛#WhistlePodu 🦁🥳 pic.twitter.com/7AnB2YdoNk
— Chennai Super Kings (@ChennaiIPL) March 12, 2024
కోహ్లీకి బీసీసీఐ బిగ్ షాక్ - 2024 టీ20 వరల్డ్ కప్ అతడు కనపడడా?
'హార్దిక్ లేకుండానే గుజరాత్ స్ట్రాంగ్‌గా ఉంది'- పాండ్యపై ఆసీస్ మాజీ ప్లేయర్ కీలక వ్యాఖ్యలు