Jos Buttler IPL 2024 : యూఎస్, వెస్డిండీస్ల వేదికగా జూన్ 1 నుంచి ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ సమరం మొదలుకానుంది. ఇప్పటికే ఈ మెగా టోర్నీలో పాల్గొంటున్న పలు దేశాలు తమ సన్నాహాలు ప్రారంభించాయి. అయితే ప్రస్తుతం ఐపీఎల్ లీగ్ కోసం కొందరు విదేశీ ప్లేయర్‌లు ఆడుతున్నారు. అయితే అందులో కొందరు ఇంగ్లాండ్ క్రికెటర్లు మాత్రం ప్లేఆఫ్స్‌కి ముందే స్వదేశానికి వెళ్లిపోయారు.
పాకిస్థాన్‌తో టీ20 సిరీస్ కారణంగా తమ ప్లేయర్లను వెనక్కి రప్పించింది ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికట్ బోర్డ్. అయితే ఈ నిర్ణయాన్ని తాజాగా ఇంగ్లాండ్ వైట్-బాల్ కెప్టెన్ జోస్ బట్లర్ సమర్థించాడు. ఇంటర్నేషనల్ క్రికెట్, ప్రపంచంలోని అతిపెద్ద టీ20 లీగ్‌తో క్లాష్ కాకూడదని చెప్పాడు.
కీలక మ్యాచ్‌కి బట్లర్ దూరం
మే 22న బుధవారం ఐపీఎల్ ఎలిమినేటర్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో రాజస్థాన్ రాయల్స్ తలపడుతోంది. ఈ కీలక మ్యాచ్‌కి ఆర్‌ఆర్ స్టార్ బ్యాటర్ బట్లర్ అందుబాటులో ఉండడు. ప్లే-ఆఫ్స్‌కి దూరమైన ఇతర ఇంగ్లండ్ ప్లేయర్స్‌లో విల్ జాక్స్, రీస్ టోప్లీ, ఫిల్ సాల్ట్ ఉన్నారు. పాకిస్థాన్, ఇంగ్లాండ్ నాలుగు టీ20 మ్యాచ్‌ల సిరీస్ బుధవారం ప్రారంభమవుతంది.
మంగళవారం బట్లర్ మీడియాతో మాట్లాడాడు. "ఇంగ్లాండ్ కెప్టెన్‌గా నా జట్టుకు ఆడటమే నా ప్రధాన బాధ్యత. అయితే ఐపీఎల్, ఇంటర్నేషనల్ క్రికెట్ క్లాష్ కాకూడదనేదే నా వ్యక్తిగత అభిప్రాయం. ఈ గేమ్‌లు చాలా కాలంగా షెడ్యూల్ అయి ఉన్నాయని భావిస్తున్నాను. ప్రపంచకప్ ఆడటం, ఇంగ్లాండ్ తరఫున పర్‌ఫార్మ్ చేయడానికి మొదటి ప్రియారిటీ ఉంటుంది. ఇదే అత్యుత్తమ ప్రిపరేషన్ అని నేను భావిస్తున్నాను." అని చెప్పాడు.
బట్లర్ బాటలో సామ్ కరన్
ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన శామ్ కరన్ కూడా ECB నిర్ణయం సమంజసమని చెప్పాడు. "బహుశా మేమందరం తిరిగి రావడమే సరైన విషయం. అన్ని ఫ్రాంచైజీలు ఒక్కో ఆటగాడిని కోల్పోవడం న్యాయమే. కొన్ని ఫ్రాంచైజీలు కొంత మంది ప్లేయర్‌లను ఉంచుకోవడం, కొన్ని ఉంచుకోకపోవడం చాలా కఠినంగా ఉండేది." అన్నాడు.
అతడిని ఒప్పించేందుకు ధోనీ సాయం కోరిన బీసీసీఐ - ఎందుకంటే? - Team India Head Coach BCCI
'రోహిత్ ఆడియోను ప్రసారం చేయలేదు - నీతికి కట్టుబడి ఉన్నాం' - IPL 2024