ETV Bharat / sports

కివీస్​తో ఓటమి WTCపై ఎఫెక్ట్- ఫైనల్ చేరాలంటే ఎన్ని నెగ్గాలంటే?

టీమ్ఇండియా సొంత గడ్డపై న్యూజిలాండ్​తో తొలి టెస్టులో ఓడింది. ఈ ఓటమి ప్రభావం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికపై ఎంత మేరకు ప్రభావం చూపిందంటే?

India WTC 2025
India WTC 2025 (Source: Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Oct 20, 2024, 3:51 PM IST

India WTC 2025 : బెంగళూరు వేదికగా న్యూజిలాండ్​తో జరిగిన తొలి టెస్టులో టీమ్ఇండియా ఓటమిపాలైంది. దీంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ 2023-25 సీజన్‌ పాయింట్ల పట్టికలో టీమ్‌ఇండియాపై ఎలాంటి ప్రభావం పడిందనేది ఆసక్తికరంగా మారింది. అయితే భారత్ స్థానం విషయంలో మాత్రం ఎలాంటి మార్పు జరగలేదు. పాయింట్ల పట్టికలో టీమ్ఇండియా అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. కానీ, విన్నింగ్ పర్సంటేజీలో తగ్గుదల వచ్చింది. దీంతో రాబోయే మ్యాచ్​లు భారత్​కు అత్యంత కీలకంగా మారాయి.

ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టీమ్‌ఇండియానే టాప్‌లోనే ఉంది. ఇప్పటి వరకు ఆడిన 12 టెస్టుల్లో 8 విజయాలు సాధించింది. మరో మూడింట్లో ఓడి, ఒక మ్యాచ్ డ్రాగా ముగించింది. దీంతో టీమ్‌ఇండియా ఖాతాలో 98 పాయింట్లు ఉన్నాయి. పర్సంటేజీలో 74.24 శాతం నుంచి 68.06 శాతానికి తగ్గిపోయింది. ఆస్ట్రేలియా (62.50), శ్రీలంక (55.56) వరుసగా రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. భారత్​పై తాజా విజయంతో కివీస్ ఆరో ప్లేస్ నుంచి నాలుగో స్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం కివీస్ 44.40 శాతంతో కొనసాగుతోంది.

ఫైనల్ చేరాలంటే?
భారత్‌ వరుసగా మూడోసారి డబ్ల్యూటీసీ ఫైనల్​కు అర్హత సాధించాలంటే టాప్‌- 2లో నిలవాల్సి ఉంటుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్ ఫస్ట్ ప్లేస్​లోనే ఉన్నప్పటికీ, కివీస్​తో ఓటమి వల్ల రాబోయే మ్యాచ్‌ అత్యంత కీలకంగా మారాయి. భారత్‌ ఇంకా 7 టెస్టులు ఆడనుంది. కివీస్‌తో రెండు, ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల్లో తలపడనుంది. ఇందులో కనీసం 4 మ్యాచ్​ల్లో గెలిస్తేనే టాప్‌-2లో భారత్ నిలుస్తుంది. 67.54 పర్సంటేజీతో దాదాపుగా ఫైనల్ చేరుతుంది.

దక్షిణాఫ్రికా కష్టమే!
ప్రస్తుతం 38.89శాతం విజయాలతో దక్షిణాఫ్రికా ఆరో ప్లేస్ లో ఉంది. తర్వాత ఆ జట్టు ఆడబోయే ఆరు మ్యాచ్​ల్లో అన్ని గెలిస్తే 69.44 శాతానికి చేరుకుంటుంది. అది అంత సులువైన విషయం కాదు. అదే సమయంలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భారత్​పై ఆస్ట్రేలియా నాలుగు మ్యాచ్‌లు గెలిచి, వేరే సిరీస్ ల్లో రెండు డ్రాలు, ఒక మ్యాచ్ ఓడిపోతే 64.04శాతంతో ఆసీస్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంటుంది.

పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న శ్రీలంక డబ్ల్యూటీసీ ఫైనల్ కు క్వాలిఫై అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఆ జట్టు దక్షిణాఫ్రికా, ఆసీస్ తో చెరో రెండు మ్యాచ్​లు ఆడనుంది. వాటిపై ఆ నాలుగింటిని గెలిస్తే శ్రీలంక విన్నింగ్ పర్సంటేజీ 69.23 శాతానికి చేరుతుంది. కానీ అంత ఈజీ విషయం కాదనే చెప్పాలి. అలాగే కివీస్ జట్టు కూడా తర్వాత ఆడబోయే అన్ని మ్యాచ్ ల్లో గెలిచినా 64.29శాతంగా విన్నింగ్ పర్సంటేజీ ఉంటుంది. అలాగే బంగ్లా, విండీస్ జట్లకు పెద్దగా అవకాశాలు లేవు.

టీమ్ఇండియాకు తప్పని ఘోర పరాజయం - 36 ఏళ్ల తర్వాత భారత్​లో కివీస్ విక్టరీ!

డే 4 కంప్లీట్- భారత్​ 462 ఆలౌట్- ఇరుజట్లకు ఐదోరోజే కీలకం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.