ETV Bharat / sports

సంజూ మెరుపులు- టీమ్ఇండియా గ్రాండ్ విక్టరీ- 4-1తో సిరీస్ కైవసం - India Vs Zimbabwe 5th T20I

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 14, 2024, 7:58 PM IST

Updated : Jul 15, 2024, 6:59 AM IST

IND Vs ZIMB 5th T20I : ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా జింబాబ్వేతో జరిగిన చివరి మ్యాచ్​లో టీమ్ఇండియా విజయం సాధించింది. 42 పరుగుల తేడాతో గెలుపొందింది.

IND Vs ZIMB 5th T20I
IND Vs ZIMB 5th T20I (Associated Press)

India Vs Zimbabwe 5th T20I: ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా జరిగిన చివరి మ్యాచ్​లో టీమ్ఇండియా విజయం సాధించింది. టీమ్ఇండియా జింబాబ్వేపై 42 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో 4-1 తేడాతో సిరీస్‌ను ముగించింది. ఇప్పటికే టీమ్ఇండియాదే పైచేయి కాగా ఈ నామమాత్రపు ఐదో మ్యాచ్‌లోనూ గిల్ సేన అద్భుతంగా ఆడింది.

మ్యాచ్ సాగిందిలా :
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్​కు దిగిన భారత జట్టు, ఆరంభంలోనే కఠిన పరిస్థితులు ఎదుర్కొంది. అయితే ఆ తర్వాత వేగం పుంజుకుని చేలరేగిపోయింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు స్కోర్ చేసింది. యంగ్ ప్లేయర్ సంజు శాంసన్‌ (58), హాఫ్ సెంచరీతో టాప్ స్కోరగ్​గా నిలిచాడు.

ఇక తొలి ఓవర్లోనే ఓపెనర్‌ యశస్వి జైశ్వాల్‌ (12), రజా బౌలింగ్‌లో పెవిలియన్ చేరుకున్నాడు. ఆ తర్వాత తొలి డౌన్‌లో వచ్చిన అభిషేక్‌ శర్మ (14) కూడా అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఇక తన ఇన్నింగ్స్​లో సంజూ శాంసన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ నిర్మించే ప్రయత్నం చేశాడు శుభ్​మన్​ గిల్‌(13). కానీ, రిచర్డ్‌ అతడ్ని ఔట్​ చేశాడు.

ఇక రియాన్‌ పరాగ్‌ (22)తో కలిసి శాంసన్‌ కాస్త మెరుగ్గానే ఆడేందుకు ప్రయత్నించగా, 30 పరుగుల వ్యవధిలోనే ఈ ఇద్దరూ ఔటయ్యారు. చివరిలో వచ్చిన శివమ్​ దుబే (26), రింకూ సింగ్‌ (11) కాస్త దూకుడుగా ఆడటం వల్ల టీమ్ఇండియా మంచి స్కోరు సాధించింది. జింబాబ్వే బౌలర్లలో ముజరబాణి 2, సికిందర్‌, రిచర్డ్‌, బ్రాండన్‌ తలో వికెట్‌ తీశారు.

ఆ తర్వాత క్రీజులోకి దిగిన జింబాబ్వే ప్లేయర్లకు ఆదిలోనే షాక్ తగిలింది. ముకేశ్ కుమార్ వేసిన తొలి ఓవర్‌ మూడో బంతికే ఓపెనర్‌ వెస్లీ (0) బౌల్డయ్యాడు. దీంతో బ్రియాన్‌ (10)తో కలిసి మరో ఓపెనర్‌ మరుమాణి (27) ఇన్నింగ్స్‌ నిర్మించేందుకు ట్రై చేశాడు. కానీ, వాషింగ్టన్‌ సుందర్‌ బౌలింగ్‌లో మరుమాణి ఎల్బీడబ్ల్యూగా వెనుతిరిగాడు. కాసేపట్లోనే బ్రియాన్‌ కూడా ఔటయ్యాడు. ఇక మిగతా ప్లేయర్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. చివరిలో వచ్చిన అక్రమ్‌ 27 పరుగులతో ఫర్వేలేదనిపించాడు. టీమ్ఇండియా బౌలర్లలో ముకేశ్‌ కుమార్‌ 4 వికెట్లు పడగొట్టగా, శివం దుబే 2, వాషింగ్టన్‌ సుందర్‌, అభిషేక్‌ శర్మ, తుషార్ చెరో వికెట్‌ తీశారు.

భారత్ x శ్రీలంక - టీ20, వన్డే సిరీస్‌ షెడ్యూల్ ఇదే

లంకతో సిరీస్​ - టీమ్​ఇండియా టీ20 జట్టు కెప్టెన్​ ఎవరంటే? - IND VS Srilanka T20 Series

Last Updated : Jul 15, 2024, 6:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.