India Vs England T20 World Cup : టీ20 వరల్డ్ కప్ మొదటి సెమీఫైనల్లో అఫ్గానిస్థాన్‌ని చిత్తు చేసి సౌతాఫ్రికా ఫైనల్ చేరింది. అయితే ఈ ఫైన్లోని మరో బెర్త్ కోసం ఇప్పుడు ఇంగ్లాండ్, భారత్ ఢీకొనేందుకు సిద్ధమయ్యాయి. అయితే ఈ రోజు (జూన్ 27) గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియంలో జరగాల్సిన సెమీఫైనల్‌కు వర్షం అంతరాయం కలిగిస్తోంది. అక్కడి వాతావరణ సూచన మేరకు, ఈ మ్యాచ్‌పై వర్షం ప్రభావం బాగానే ఉందని అంటున్నారు.
మ్యాచ్‌కు అంతరాయం కలిగితే ఎలా?
భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు (గయానా కాలమానం ప్రకారం ఉదయం 10:30 గంటలకు) ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక ఈ సెమీ ఫైనల్‌కి రిజర్వ్ డే లేదు. అందుకే మ్యాచ్‌ను పూర్తి చేయడానికి మొత్తం 250 నిమిషాల అదనపు సమయాన్ని కేటాయించారు. అంటే షెడ్యూల్ చేసిన రోజులోనే మ్యాచ్ నిర్వహణకు అవసరమైతే అదనపు సమయం (ఎక్స్‌టెండెడ్ అవర్స్) ఉపయోగించుకుంటారు. రెండు జట్లు కనీసం పది ఓవర్లు ఆడితేనే ఫలితం ప్రకటిస్తారు.
అదే మొదటి సెమీఫైనల్ స్థానిక కాలమానం ప్రకారం రాత్రి జరిగింది కాబట్టి, నిర్ణీత రోజుకు మొత్తం 60 నిమిషాల అదనపు సమయం మాత్రమే కేటాయించారు. ఈ సెమీఫైనల్ కోసం రిజర్వ్ రోజున, ఆడేందుకు అదనంగా 190 నిమిషాలు కేటాయించారు.
రిజర్వ్ డే ఎందుకు లేదు?
సెమీ-ఫైనల్ 2 నుంచి 24 గంటల్లోపు గెలచిన టీమ్ ఫైనల్ ఆడాల్సి ఉంటుంది. రిజర్వ్ డే ఉంటే ఇంత తక్కువ సమయంలో మరో కీలక మ్యాచ్ ఆడటం భారత్ లేదా ఇంగ్లాండ్‌కి కష్టమవుతుంది. జూన్ 29న శనివారం బార్బడోస్‌లో జరిగే ఫైనల్‌కి ట్రావెల్ చేయాల్సి కూడా ఉంటుంది. అందుకే రెండో సెమీఫైనల్‌కి రిజర్వ్ డే లేదని కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి.
వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే ఏం జరుగుతుంది?
మ్యాచ్ టై అవ్వడం, వాతావరణ పరిస్థితులు సూపర్ ఓవర్‌ను పూర్తి చేయకుండా అడ్డుకోవడం, లేదా వాతావరణం కారణంగా మ్యాచ్ పూర్తిగా క్యాన్సిల్ అయితే లేదా ఏ కారణం చేతనైనా ఈ గేమ్ ఫలితం తేలకపోతే, సూపర్ 8లో మొదటి స్థానంలో నిలిచిన జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది. అంటే గ్రూప్ 1లో టాప్ పొజిషన్‌లో ఉన్న భారత్ నేరుగా టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్స్‌కు చేరుకుంటుంది.
సెమీస్ ఫైట్‌లో కళ్లన్నీ 'విరాట్'పైనే- నాకౌట్‌లో ఆ మెరుపులు మళ్లీ చూస్తామా? - T20 World Cup 2024
రోహిత్, బట్లర్ కో ఇన్సిడెంట్- సెమీస్‌కు ముందు ఇంట్రెస్టింగ్ పాయింట్