Ind vs Pak T20 Winning Celebrations: 2024 టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్‌పై భారత్ చారిత్రక విజయం నమోదు చేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. పొట్టికప్‌లో న్యూయార్క్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై టీమ్ఇండియా 6 పరుగుల తేడాతో నెగ్గి, ఐసీసీ టోర్నీల్లో మరోసారి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఆసాంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో భారత్ నెగ్గగానే ఆదివారం అర్ధరాత్రే ఫ్యాన్స్ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు.
హైదరాబాద్‌లోని పలు ఏరియాల్లో టీమ్ఇండియా ఫ్యాన్స్ పాక్‌పై విక్టరీని సెలబ్రేట్ చేసుకున్నారు. మధ్యప్రదేశ్ ఇందౌర్‌లో, మహారాష్ట్ర పుణెలో టపాసులు కాల్చుతూ, హుషారుగా స్టెప్పులేశారు. పుణెలో జేసీబీపై ఎక్కి సంతోషాన్ని వ్యక్తపర్చారు. కేవలం భారత్‌లో కాకుండా ఫ్యాన్ పార్క్‌లు ఏర్పాటు చేసిన లండన్‌లోనూ సంబరాలు జరిగాయి.
న్యూయార్క్‌లోనూ: ఇక మ్యాచ్ జరిగిన అమెరికా న్యూయార్క్‌లోనూ ఫ్యాన్స్ కోలాహలం సృష్టించారు. స్టేడియం లోపల, బయటా కేరింతలు, బ్యాండు చప్పుల్లు, డ్యాన్స్‌లతో భారత క్రికెట్ ఫ్యాన్స్ హంగామా చేశారు. టీమ్ఇండియా జెర్సీలు ధరించి దాయాది దేశంపై గెలుపును ఎంజాయ్ చేశారు.
రితికా, అనుష్క కూడా: కెప్టెన్ రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ మ్యాచ్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. టీమ్ఇండియా మ్యాచ్‌లు ఎక్కడున్నా స్టేడియాని వెళ్లే ఈ ఇద్దరూ జట్టును ప్రోత్సహిస్తూ ఆటను ఎంజాయ్ చేశారు. మ్యాచ్ నెగ్గగానే అనుష్క, రితికా తమదైన స్టైల్లో సంబరాలు చేసుకోవడం ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది.
ఈ మ్యాచ్‌లో నమోదైన పలు రికార్డులు
- టీ20ల్లో భారత్ కాపాడుకున్న అతి చిన్న లక్ష్యం (120) ఇదే. 2016లో జింబాబ్వే (139)పై డిఫెండ్ చేసిన టార్గెట్ ఇప్పటివరకు అత్యుత్తమంగా ఉంది.
- టీ20 వరల్డ్‌కప్‌లోనూ తక్కువ టార్గెట్‌ను డిఫెండ్ చేసిన లిస్ట్‌లో శ్రీలంక (120 vs న్యూజిలాండ్, 2014)ను భారత్ ఈ మ్యాచ్చో సమం చేసింది.
- టీ20 వరల్డ్‌కప్‌లో ఒకే ప్రత్యర్థిపై అత్యధిక మ్యాచ్‌లు నెగ్గిన రికార్డు కూడా భారత్‌దే. పొట్టికప్‌లో పాకిస్థాన్‌పై టీమ్ఇండియా 7సార్లు నెగ్గింది. ఈ లిస్ట్‌లో పాకిస్థాన్ రెండో ప్లేస్‌లో ఉంది. కివీస్‌పై పాక్ 6సార్లు గెలిచింది.
రూ.2లక్షల టికెట్ కోసం ట్రాక్టర్ అమ్మిన పాక్ ఫ్యాన్- పాపం మ్యాచ్ పోయిందిగా!
ఉత్కంఠ పోరులో 'భారత్'దే పైచేయి- బుమ్రా దెబ్బకు పాక్ విలవిల - T20 World Cup 2024