ETV Bharat / sports

పుణెలో రివెంజ్​కు భారత్​ సిద్ధం!- కివీస్​తో రెండో టెస్ట్​ పిచ్ పరిస్థితేంటి? వర్షం ముప్పు ఉందా? - IND VS NZ 2ND TEST

న్యూజిలాండ్​తో రెండో టెస్ట్​కు సిద్ధమైన టీమ్ ఇండియా - మ్యాచ్ వివరాలివే

IND VS NZ 2nd Test
IND VS NZ 2nd Test (source Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Oct 24, 2024, 7:07 AM IST

IND VS NZ 2nd Test : ఓ వైపు లెక్క సరిచేయాలనే పట్టుదలతో టీమ్​ ఇండియా, మరోవైపు సిరీస్‌ పట్టేయాలన్న ఆశలతో న్యూజిలాండ్​, పుణెలో రసవత్తర సమరానికి సిద్ధమయ్యాయి. రెండు జట్ల మధ్య రెండో టెస్టు అక్టోబర్ 24 నుంచి ప్రారంభం కానుంది.

బెంగళూరు వేదికగా జరిగిన మొదటి మ్యాచ్​ తొలి ఇన్నింగ్స్‌లో 46కే కుప్పకూలిన టీమ్ ఇండియా, రెండో ఇన్నింగ్స్‌లో పుంజుకున్నప్పటికీ మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయింది. దీంతో ఎన్నో ఏళ్ల తర్వాత భారత్‌ గడ్డపై సాధించిన విజయం ప్రత్యర్థి జట్టులో విశ్వాసాన్ని పెంచింది.

అలానే వరల్డ్​ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌పై కన్నేసిన టీమ్ ఇండియాకు, ఆస్ట్రేలియా పర్యటన ముందు మిగిలిన రెండు టెస్టుల్లో విజయం సాధించడం ఎంతో ముఖ్యం. అయితే సొంత గడ్డపైనే భారత్‌ 0-1తో వెనుకబడడం చాలా అరుదు. అప్పుడెప్పుడో 2017లో ఆస్ట్రేలియాపై, 2021లో ఇంగ్లాండ్‌పై ఇలా వెనుకపడినప్పటికీ బలంగా పుంజుకుని సిరీస్‌ను దక్కించుకుంది. కాకపోతే అవి నాలుగు మ్యాచుల టెస్ట్​ సిరీస్‌లు. అయితే ఇప్పుడు మూడు మ్యాచుల సిరీసే. కాబట్టి ప్రస్తుత సిరీస్​లో జరగబోయే రెండూ మ్యాచుల్లోనూ గెలవాలి. ఈ గెలుపు వరల్డ్​ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్​ అర్హతకు కూడా ఎంతో ముఖ్యం.

ఏదేమైనా తొలి టెస్టులో పరాజయాన్ని అందుకున్నప్పటికీ రెండో టెస్ట్​లో భారతే ఫేవరెట్. చూడాలి మరి మొదటి టెస్ట్​లో అనూహ్యంగా విజయం సాధించిన కివీస్​పై భారత జట్టు పుణె పిచ్​పై ప్రతీకారం ఎలా తీర్చుకుంటుందో.

పిచ్ ఎలా ఉంది, వర్షం ముప్పు వివరాలు(IND VS NZ 2nd Test Pitch, Rain) - బెంగళూరులో ఓటమి అందుకున్న నేపథ్యంలో పుణె పిచ్‌ విషయంలో భారత్‌ జాగ్రత్త చర్యలు తీసుకుంది. ఈ పిచ్‌పై పచ్చిక లేదు. న్యూజిలాండ్​ పేసర్లు, తొలి టెస్టులోలాగా ప్రభావం చూపే ఛాన్స్ లేదు. మందకొడి పిచ్‌ నుంచి మ్యాచ్‌ సాగుతున్న కొద్దీ, స్పిన్నర్లకు మరింత సహకారం అందుకుంది. మ్యాచ్‌కు ఎలాంటి వర్షం ముప్పు లేదని తెలిసింది. ఐదు రోజులు కూడా ఎండ కాస్తుంది.

3 వేల పరుగుల మైలురాయి(KL Rahul 3 Thousand Runs) - టెస్టు క్రికెట్లో మూడు వేల పరుగుల మైలురాయిని అందుకోవడానికి రాహుల్‌ చేయాల్సినది 19 పరుగులు.

బోర్డర్ గావస్కర్ ట్రోఫీ: భారత్ జట్టు ఎంపికపై ఉత్కంఠ- వాళ్లకు ఛాన్స్ దక్కేనా?

'దంగల్​కు రూ.2000 కోట్లు వస్తే రూ.కోటి ఇచ్చారు - సాక్షిమాలిక్‌ చెప్పేవన్నీ అబద్ధాలే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.