IND vs ENG 3rd Test Rehan Ahmed : ఇంగ్లాండ్ స్పిన్నర్ రెహన్ అహ్మద్‌కు మూడో టెస్ట్ ముందు వీసా సమస్య ఎదురైంది. రెహన్ సింగిల్ ఎంట్రీ వీసాతో ఇండియాకు వచ్చాడు. రెండో టెస్ట్ ముగిసిన తర్వాత జట్టు సభ్యులతో కలిసి దుబాయ్ వెళ్లాడు. అయితే మూడో టెస్ట్ కోసం రాజ్‌కోట్‌కు చేరుకున్న రెహన్‌కు అధికారులు ఎంట్రీ ఇవ్వలేదు.
రెండోవ,మూడవ టెస్టు మధ్య పది రోజుల గ్యాప్ ఉంది. దీంతో ఇంగ్లాండ్ ప్లేయర్స్ సేద తీరేందుకు దుబాయ్ వెళ్లారు. గురువారం నుంచి జరుగనున్న మూడో టెస్ట్ కోసం ఇంగ్లాండ్ ఆటగాళ్లు తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో రెహన్‌కు సింగిల్ ఎంట్రీ వీసా కారణంగా విమానాశ్రయంలో నిలిపివేశారు. దీంతో అతను మళ్లీ పేపర్‌వర్క్ చేయాల్సి వచ్చింది. దీనిపై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తక్షణమే స్పందించింది. రెహన్‌కు ఎంట్రీ ఇవ్వలేదని, ఆ తర్వాత అధికారులు తాత్కాలిక వీసా జారీ చేసినట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది.
ఇక రెహన్ అహ్మద్ తాజా సిరీస్‌లోని రెండు మ్యాచ్‌ల్లో 36.37 సగటుతో 8 వికెట్లు పడగొట్టాడు. విశాఖపట్నంలో జరిగిన రెండో మ్యాచ్‌లో రైట్ హ్యాండ్ బ్యాటర్‌గా 70 పరుగులు చేశాడు. గతంలో ఈ సిరీస్‌కు మందు యువ ఆఫ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ కూడా వీసా సమస్యను ఎదుర్కొన్నాడు. వీసా ఆలస్యం కారణంగా వారం రోజులు తర్వాత ఇండియాకు చేరుకున్నాడు. దీంతో హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆడలేకపోయాడు.
ఇకపోతే రాజ్‌కోట్ వేదికగా జరిగే మూడో టెస్ట్ కోసం భారత జట్టు తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తోంది. రెండో టెస్టులో తమ ఆటతీరుతో చెలరేగిపోయిన రోహిత్ సేన రానున్న మ్యాచ్‌లోనూ గెలువును తమ ఖాతాలో వేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మిగతా మూడు టెస్టులకు టీమ్ఇండియా ప్లేయర్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, రానున్న మ్యాచ్ కోసం తుది జట్టు ఎంపిక ఎలా ఉంటుందనే ఆసక్తి క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. అయితే ఇప్పటికే బ్యాటింగ్‌లో విఫలమవుతున్న వికెట్ కీపర్ కేఎస్ భరత్‌ను తప్పించి యంగ్ ప్లేయర్ ధ్రువ్ జురెల్‌ను తుది జట్టులోకి తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి సమాచారం.
మూడో టెస్ట్‌కు కీలక మార్పులు - భరత్ బదులు ధ్రువ్- సర్ఫరాజ్ సంగతేంటంటే ?
చివరి ఆరు మ్యాచుల్లో నాలుగు సెంచరీలు - మూడో టెస్ట్‌లో అతడు ఎంట్రీ!