ETV Bharat / sports

దూకుడుగా ఆడుతున్న ఇంగ్లాండ్- భారత్ తొలి ఇన్నింగ్స్​ 445 ఆలౌట్ - Most Test Wickets Indians

Ind vs Eng 3rd Test 2024: భారత్- ఇంగ్లాండ్ టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ 207-2తో ఉంది.

Ind vs Eng 3rd Test 2024
Ind vs Eng 3rd Test 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 16, 2024, 5:09 PM IST

Updated : Feb 16, 2024, 5:46 PM IST

Ind vs Eng 3rd Test 2024: రాజ్​కోట్​ టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్​లో 207-2తో నిలిచింది. దీంతో ఇంగ్లాండ్ ఇంకా 238 పరుగులు వెనుకబడి ఉంది. ఓపెనర్ బెన్ డకెట్ (133 పరుగులు) సెంచరీతో అదరగొట్టాడు. మరో ఓపెనర్ జాక్ క్రీలీ (15), ఒలీ పోప్ (39) పెవిలియన్ చేరారు. ప్రస్తుతం క్రీజులో డకెట్, జో రూట్ (9) ఉన్నారు. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ , మహ్మద్ సిరాజ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.

అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్​లో 445 పరుగులకు ఆలౌటైంది. 326-5తో రెండో రోజు ఇన్నింగ్స్​ ప్రారంభించిన భారత్ అదనంగా మరో 119 పరుగులు జోడించింది. జడేజా ఓవర్​నైట్ స్కోర్ 110కి కేవలం 2 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అరంగేట్ర బ్యాటర్ ధ్రువ్ జురెల్ (46 పరుగులు) హాఫ్ సెంచరీ మిస్ అయ్యాడు. ఇక ఆఖర్లో రవిచంద్రన్ అశ్విన్ (37), జస్ప్రీత్ బుమ్రా (26) రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ వుడ్ 4, రెహన్ అహ్మద్ 2, జో రూట్, జేమ్స్ అండర్సన్, టామ్ హార్ల్టీ తలో వికెట్ దక్కించుకున్నారు.

తొలి రోజు బ్యాటింగ్​లో భారత్​దే పైచేయిగా నిలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్​కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. యువ బ్యాటర్లు యశస్వి జైశ్వాల్ (10), శుభ్​మన్ గిల్ (0) స్వల్ప వ్యవధిలోనే ఔటయ్యారు. ఇక మిడిల్​లో వచ్చిన రజత్ పటీదార్ (5) మరోసారి విఫలమయ్యాడు. ఈ దశలో కెప్టెన్ రోహిత్ శర్మ (132 పరుగులు), జడేజా (112 పరుగులు) సెంచరీలతో మోత మోగించారు. మరో డెబ్యూ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ వచ్చీ రావడంతోనే బౌండరీలతో విరుచుకుపడ్డాడు. తొలి అంతర్జాతీయ మ్యాచ్​లోనే 62 పరుగులు చేశాడు.

అశ్విన్ @500: ఈ మ్యాచ్​లో టీమ్ఇండియా స్పిన్నర్ అశ్విన్ అరుదైన ఘనత అందుకున్నాడు. టెస్టుల్లో 500 వికెట్లు పడగొట్టిన తొమ్మిదో బౌలర్​గా నిలిచాడు. ఇంగ్లాండ్​ బ్యాటర్ జాక్ క్రాలీని ఔట్ చేసిన అశ్విన్ ఈ మైలురాయి అందుకున్నాడు. దీంతో టెస్టుల్లో 500 వికెట్లు పడగొట్టిన రెండో భారత బౌలర్​గా రికార్డు కొట్టాడు. అశ్విన్ కంటే ముందు అనిల్ కుంబ్లే (619) ఈ ఘనత సాధించాడు. దీంతో అశ్విన్​పై ప్రశంసల జల్లు కురుస్తోంది.

భారత్​ x ఇంగ్లాండ్​ - ఆ నాలుగు రికార్డులపై అశ్విన్ ఫోకస్​ !

వికెట్ నెం.500- టెస్టుల్లో 'అశ్విన్' ఘనమైన రికార్డ్

Last Updated : Feb 16, 2024, 5:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.